Saturday, 17 January 2015

దేవుడున్నాడా? ఎక్కడ? దేవుడింకా రాలేదా? ఎప్పుడొస్తడు?

దేవుడు ఉన్నాడు.. ఉన్నాడు..  ఉన్నాడు.. అంటూ గోల చేస్తున్న  వారికి నా మితృడు శ్రీనివాస్ ఓ అడ్రస్ చూపించాడు. అది నచ్చిన వాళ్లు, నచ్చని వాళ్లు తలోమాట అన్నారు. అప్పటిదాకా దేవుడు ఉన్నాడన్న ఓకాయన.. దేవుడు వస్తాడురా.. మీ అందరికీ మూడిందిరా  అన్నడు...  అయితే  దేవుడింక రాలేదా? ఎప్పుడొస్తడు అని ప్రశ్నించాం. పాపం సమాధానం  వెతక్కునే పని నడుస్తున్నట్లుంది....


దేవుడు ఉన్నాడు... గుళ్లల్లో..
దేవుడున్నాడు ఇళ్ల గోడలపై..
దేవుడు ఉన్నాడు.. కథల్లో...
దేవుడు ఉన్నాడు.. సినిమాల్లో...
దేవుడు ఉన్నాడు.. ఊహల్లో...
టీవీపెట్టి చూడు దేవుడు కనిపిస్తాడు..
భయట అడుగు పెట్టి చూడు గుళ్లల్లో అంతెత్తు విగ్రహమై కనిపిస్తాడు..
ఏమీ లేనివాళ్లు వాళ్లు గంటలు గంటలు లైన్లు కట్టి.. ఉన్నోడు పచ్చనోట్లు పోసి ప్రత్యేక లైన్లలో ఆయన దగ్గర దర్శనం చేసుకునీ మరీ వస్తాం..
కాలికి దెబ్బతాకితే మందులు వాడతాం... గుడికి వెళ్లి కొబ్బరికాయ కాయ కొట్టం ఎందుకంటే దేవుడున్నాడు..
అనుక్షణం పూజలు చేసే పూజారికి గుండె జబ్బు వస్తే... 'ఆసుపత్రిలో చేర్పిస్తాం.. ఇంగ్లీషు మందులు వాడతాం.. గుడిలోనే పూజలు చేయం.. ఎందుకంటే దేవుడున్నాడు..
మరో మాట.. ప్రపంచ వ్యాప్తంగా దైవాంశ సంభూతులుగా పేరు ప్రఖ్యాతలు పొందిన సత్య సాయి బాబా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఎందుకు చనిపోయారు అని అడగొద్దు.. ఎందుకంటే దేవుడున్నాడు..
ఆయన ఉంటేనే మేం రాజకీయాలు చేయగలం.. ఆయన ఉంటేనే.. మేం ప్రజల్ని భయపెట్టగలం.. పరిపాలించగలం...
ఈ భయంలో.. ఈ మత్తులో ప్రజలు లేకుంటే.. ప్రజలు నీలాగే ప్రశ్నిస్తారు..
అప్పుడు ప్రజల్నించి మమ్మల్ని నువ్వొచ్చి కాపాడతావా...?? భలే ప్రశ్నిస్తావమ్మా ... @జాన్సీరాణిపూజ
దేవుడున్నాడు.. ఉండాలి ప్రతి ఒక్కడి 'భయం'లో... అదే మాకు కావాలి..
కర్టసీ : Sri Sundar
Like ·  ·  · 51348

No comments:

Post a Comment