Sunday 15 March 2015

ఉఫ్.. ఆడవాళ్లకే `సిగ్గు.. శరం` అనేవి ఎందుకు పరిమితం?

సమాజంలోని పురుషాధిక్య భావజాలం కొన్ని పదాలను కొంత మందికే పరిమితం చేస్తుంది. ఆ పదాలు అందరికీ  వర్తించేవిగా  ఉన్నట్లే ఉంటాయి. కానీ వాటి పరమార్థం కచ్చితంగా స్ర్తీలను అణచి ఉంచడానికే  తోడ్పడతాయి. అలాంటి పదాలే సిగ్గు, శరం వంటివి..

దీనిపై ఆలోచన... లోచన గ్రూపులో అర్థవంతమైన చర్చ జరిగింది. మీ అందరి సౌలభ్యం కోసం ఆ చర్చను ఇక్కడ అందిస్తున్నాను.
---------------------------------------------------------------------------------------------------------------

ఉఫ్... ఆడవాళ్లకే సిగ్గు శరం అనేవి ఎందుకుండాలి?
Like ·  · 
  • Ramesh Soyam Humanist మగవారికి అవి ఉన్నాయో లేవో తెలియదు కాబట్టి 
    14 hrs · Like · 8
  • Subba R Jevisetty Thappu chese prathi okkarikee undaali. Kevalam oka gender ke undaali anatam tappu.
    14 hrs · Edited · Like · 5
  • Jagadish Kumar గుడ్... మొత్తానికి ఏ ఒక్క జెండర్ కు వాడకూడదా? ఏ జెండరుకూ వాడకూడదా? ఏ జెండరుకు ఏ సందర్భంలో వాడుతారు? కాస్త సెలవివ్వండి..
    14 hrs · Like
  • Jagadish Kumar తప్పు చేసిన వాళ్లకు `సిగ్గు` ఉండాలి.. తప్పు చేసిన వాళ్లకు `శరం` ఉండాలి.. అంటే అర్థం ఏంటి? ఆ పదాలు ఏ అర్థాలను సూచిస్తాయి?సెలవివ్వండి.
    14 hrs · Like · 1
  • Ramesh Soyam Humanist సిగ్గు శరం కలిగిఉండమనేది నైతికవిలువలు కలిగిఉండమనడం. అవి దిగజారినప్పుడు సిగ్గుశరం లేదని అంటారు.....
    14 hrs · Unlike · 2
  • Jagadish Kumar సిగ్గు.. శరం.. కలిగి ఉండడం అంటే నైతిక విలువలు కలిగి ఉండటమా? మగవాడు `సిగ్గు` ఎప్పుడు పడతాడు? ఆడది `సిగ్గు` ఎప్పుడు పడుతుంది? ఈ రెండు సిగ్గులు ఒక్కటేనా? రెండింటి నైతిక విలువల డిగ్రీస్థాయి ఒక్కటేనా? సందర్భం ఒక్కటిగానే ఉంటాయా?
    14 hrs · Like · 3
  • Jagadish Kumar అలాగే `శరం` కలిగి ఉండడం అంటే అర్థమేంటి? మగవాడు `శరం` కలిగి ఉండడమంటే ఏంటి? ఆడది `శరం` కలిగి ఉండడం అంటే ఏమిటి? ఈ రెండు సందర్భాల్లో `శరం` అర్థం ఒక్కటేనా?
    13 hrs · Like · 1
  • Reddy Bosa తప్పుచేసినపుడు మాత్రమే సిగ్గు పడరు సిగ్గు అనేది వేర్వేరు సందర్బాల్లో ఒక్కొక్క అర్దాన్ని తెలియజేస్తుంది అది మెచ్యూరిటి వున్న వాల్లకు మాత్రమే అర్దమవుతుంది
    13 hrs · Edited · Unlike · 2
  • Ramesh Soyam Humanist సందర్బాలు వేర్వేరుగా ఉండవచ్చు:
    ఆడ/మగవారు తప్పుచేసినప్పుడు సిగ్గుపడతారు(ఈ విశయం నలుగురుకి తెలిస్తేనే)
    ఆడవారు తమ అందాన్ని ఎవరైనా పొరపాటున పొగిడినప్పుడు సిగ్గుపడతారు.
    13 hrs · Unlike · 5
  • Jagadish Kumar సో.. నోట్ దిస్ పాయింట్... 'తప్పు చేసినప్పుడు` `సిగ్గు` పడడం అనేది ఉంటుందంటారు. ఒప్పుకుందాం.

    ఏది తప్పు? ఏది ఒప్పు? ఒక మగవాడు పది మంది ఆడాళ్లతో తిరిగినప్పుడు అది `మగతనం`గా చెలామణి అవుతుంది. వాడు మగాడ్రా బుజ్జీ అంటాం. ఆడికి సిగ్గు లేదు అని ఎందుకు అనం? అ
    ...See More
    13 hrs · Like · 5
  • Reddy Bosa కానీ ఒక విషయం ఒక సందర్బంలో మగవారికంటే ఆడవారికే సిగ్గు తక్కవ 

    ఒకే గదిలో బహు ఆడవాల్లు వస్రాలు మర్చుకోగల్గుతారు గానీ మగవారు మార్చుకోలేరు 

    ఒక మగాడిగా అది అందరికి తెలిసిన విషయమే అనుకుంటా
    13 hrs · Unlike · 2
  • Jagadish Kumar రెడ్డి బోసా గారూ.. మెచ్యూరిటీతోనే ఆలోచన చేద్దాం.. ఎందుకంటే మీరు, నేను చెప్పిన అభిప్రాయాలన్నీ ఒప్పు కాకపోవచ్చు. వివేచనతో లోచించే వారు ఇక్కడ కోకొల్లలు ఉన్నారు. చూద్దాం. మన మేథస్సును పెంచేందుకు సహకరిస్తారేమో?
    13 hrs · Like · 2
  • Jagadish Kumar మీరు చెప్పినదానికి సమాధానం చాలా సింపుల్.. స్ర్తీలు మాత్రమే కలిసి ఉన్నప్పుడు వారిలో తామంతా ఒక్కటే అన్న భావన ఉంటుంది. పబ్లిక్, ప్రయివేటు ప్రాపర్టీ అనేవి ఉండవు. అదే మగాళ్లనుకో.. వీరిలో ప్రయివేటు ప్రాపర్టీ భావన హెచ్చుగా ఉంటుంది. భయంకరమైన జెలసీ లేదా అవమానపు భావన ఉంటుంది. అందుకే ఒకరి ముందు మరొకరు పూర్తి నగ్నంగా నిలబడడానికి కూడా జంకుతారు.

    ఇకపోతే సబ్జెక్టు `సిగ్గు` గురించి.. సిగ్గు అనేది కేవలం తప్పు చేయడం అనే నైతిక విలువతో ముడిపెట్టి చూడడం గురించి.. మీరన్న సబ్జెక్టులో ఏ ఒక్కరూ నైతికంగా తప్పు చేయడం లేదు. అయినా `సిగ్గు` పడిపోతున్నారు.
    13 hrs · Like · 7
  • Reddy Bosa పురాణకాలం నుంచి సాంప్రదాయాలు కట్టుబాట్లు అనేవి స్త్రీ ల వరకే ఎకువ పరిమితమై వుండేవి అవి క్రమేపి ఈనాటి వరకు సాగుతూ నే వచ్చాయి అయినా ప్రస్తుత మోడెరెన్ కాలంలో ఆడవాల్లు వాటికి విలువివ్వడం లేదుగా జగదీష్ గారు బొమ్మ బొరుసయ్యింది బొరుసు ఇంకేదో అవుతుంది
    13 hrs · Like · 1
  • Ramesh Soyam Humanist వెస్టర్న్ దేశాలలో స్త్రీలు పోర్నోగ్రఫీ పుస్తకాలు కూడా రైళ్ళలో ప్రయాణించేటప్పుడు చూస్తారట. అదే దృశ్యాన్ని మన దేశంలో ఊహించలేం.ఒకవేళ చూడమని ఇస్తే బహుస వారు సిగ్గుపడవచ్చు(గూబగుయ్యి మనిపించవచ్చు). బహుశ స్త్రీల సిగ్గుపడేవిశయం సంస్కృతికి సంభంధించిన విశయం అవచ్చు.
    13 hrs · Like · 4
  • Uday Bangaram Kaadu boss manishi puttinapudu a siggu sharam levu, and sex mida intha moju ledu.
    Samajamlo marpu lani ladies mida ruddesaru, aada maga madya sex ni goppaga chuincharu.
    9 hrs · Like
  • Uday Bangaram Andukane e prblms anni.
    9 hrs · Like
  • Rajendra Kumar Kandula మగ వాళ్ళకు సిగ్గు అనేది తెలియదు కాబట్టి...
    9 hrs · Like · 1
  • మార్పు కావాలి Uff ee pujalu punaskaralu adavallake enduku
    7 hrs · Unlike · 2
  • ఝాన్సీ రాణి పూజ నాకు కామెంట్ చేయాలంటేనే సిగ్గేత్తాంది కాని చేస్తా అంటే నీకు సిగ్గులేదు అసలు నువ్వు ఆడదానివేనా అంటారు ...! సున్నితమైన విషయాల్లో మాత్రమే ఆడది అడుగేయాలని , కొంచం కఠోరంగా వున్నా అది మగవారి వంతు అన్నట్లు అంటగట్టింది నా సంస్కృతి నాకు .... !
    7 hrs · Unlike · 7
  • Jagadish Kumar రమేష్ గారూ.. పోర్న్ సంగతికే వద్దాం విదేశాల్లో బహిరంగంగా చూస్తార(ట).. అని మీరు చెప్పారు. మన దేశంలో పోర్న్ బహిరంగంగా ఎవరు చూడొచ్చు? చూడడం వరకు ఎందుకు. బూతులు ఎవరు మాట్లాడొచ్చు? ఎవరు మాట్లాడితే వినసొంపుగా ఉంటాయి? ఎవరు మాట్లాడితే కంపరమెత్తి మన చర్మం మీద వెంట్రుకలు మొలుస్తాయి? చెల్లి నుంచి అమ్మ ఆలి వరకు మగాడు ఎన్ని బూతులైనా తిట్టొచ్చు. అదే ఆడది ఒక్క బూతు తిట్టినా `ఏహే ఏంటి ఆ `సిగ్గు`,`శరం` లేని మాటలు.. బజారుదానా నోర్మూసుకుని లోపలికి ఫో` అని నెట్టేస్తాం.

    దీనర్థం ఏమిటి? మహిళలకు రెండు హక్కులు కల్పించబడ్డాయి. వారిపై బూతు చేయించుకోవడం (సెక్సువల్ చూపులనుంచి రేపుల దాకా, ఇవి మాటలు, చేతలరూపంలో ఉంటాయి. ఇందుకోసం మహిళ తనను తను సిద్ధంగా ఉంచుకోవాలి. సెక్స్ ఆటబొమ్మలా..), బూతు చేయకుండా ఉండడం (వారు తమ సెక్స్ కోరికలను బహిరంగ పర్చడం దగ్గర్నుంచి, కనీసం నోటి మాట ద్వారా బూతు బయటకు రానివ్వకపోవడం. వస్తే బజారుది, తిరుగుబోతు అని పిలుపించుకునేందుకు సిద్ధంగా ఉండాలి. `సిగ్గులేనిదానా` అనిపించుకునేందుకు వెనుకాడకూడదు.).
    7 hrs · Like · 5
  • Jagadish Kumar ఝాన్సీ.. నీ పాయింటు కరెక్టే.. సంస్కృతిని జవ దాటితే నైతిక విలువను తప్పినట్లే.. అంటే అప్పుడు కూడా `సిగ్గు` పడాలన్నమాట.. రమేష్ సోయం గారు చెప్పినట్లు ముఖ్యంగా ఆడవాళ్లు `మన` సంస్కృతిని జవదాటితే వారి గూబగుయ్యిమంటుందన్నమాట.. 

    మన సంస్కృతి లక్షణం పితృస్వామికం
    . మహిళలపై ఇది రుద్ద బడుతోంది. ఆ లక్షణాన్ని జవదాటితే `నైతికంగా` `తప్పు` చేసినట్లు అవుతుంది. అలా చేసినందుకు గాను సదరు మహిళ `సిగ్గు`పడాలన్నమాట.

    మరో మాటలో చెప్పాలంటే పురుషాహంకారి తనకు నచ్చని విధంగా మహిళ ఉందనుకుంటే `సిగ్గు` `శరం` లేనిదానా అని సంభోదించవచ్చు. అంతేనా రమేష్ గారూ...?
    7 hrs · Like · 5
  • Pusyami Sagar magavallaku vunte baggodhu kanuka 
    7 hrs · Unlike · 1
  • Jagadish Kumar సాగర్ గారూ.. మగవారు ఎందుకు `సిగ్గు` పడకూడదు? సుబ్బా, రమేష్ గార్లు `సిగ్గు`కు జెండర్ లేదన్నారు. తప్పు చేసిన వారు `సిగ్గు`పడాలని, ఇది నైతిక విలువలో భాగమని సెలవిచ్చారు. తప్పులు చేసినప్పటికీ మగవాడు `సిగ్గు`పడకూడదా? తప్పు చేసిన దానికి `సిగ్గు` అనేది తప్పుగా ఆపాదించబడుతోందా?
    7 hrs · Like · 3
  • Pusyami Sagar ahahahahahah sir nenu just kidding chesanu  ....siggu padali ..naithika viluvalani tokkinchinadhuku siggu padali .....nyayam leni vyvastha lo manugada konasaagistunnaduku siggupadali ..nijame tappu chesinvaadu siggu padali
    7 hrs · Unlike · 1
  • Jagadish Kumar `తప్పు` చేసిన వాడు/ఆమె `సిగ్గు` పడాలి. అంతేనా?

    తప్పును డిఫైన్ చేయండి.


    సెక్స్ కోరిక వ్యక్త పర్చడం, ఆడా, మగా.. ఇద్దరిలో ఎవరు చేస్తే తప్పు, ఎవరు చేస్తే ఒప్పు. ఎవరికి సిగ్గుండాలి? ఎందుకుండాలి?
    7 hrs · Like · 3
  • MK Dhanunjaya Murthy సిగ్గు అనేది ఒక అపరాధ భవన. లింగ వివక్ష లేకుండా, ప్రతి వొక్కరికీ అది వుంటుంది. కృష్ణుడు నా ప్రియుడు అని కొందరాడవాళ్ళు సిగ్గు లేకుండా ఊహించుకుంటారు అనటం లో ఒక పురుషాధిక్యత మాత్రమే కనపడుతుంది. సంస్కృతిని జవదాటితే, నైతికత తప్పినట్లే, అప్పుడు సిగ్గుపడాలనటం అపరిపక్వ వాదన. ఈ సంస్కృతి ని ఖచితంగా మతం తో ముడిపెట్టి చూస్తాం. ముఖానికి ఎటువంటి ఆచ్చాదనా లేకుండా, ఒక ముస్లిమేతర స్త్రీ బయట తిరిగితే, ఏమీ అనిపించదు. అదే ఒక ముస్లిం స్త్రీ Burkha Clad లేకుండా తిరిగితే, ఆమెకు సిగ్గులేదు అంటారు. అనేది ముస్లిమేతరులు కాదు. ముస్లిములె. ఇక్కడ సిగ్గు అనేది ఒకే స్త్రీ పట్ల రెండురకాలుగా ఎందుకుంది?

    మీరన్నట్లు, మహిళలకు రెండు హక్కులు(?) కల్పించబడ్డాయి. వారిపై బూతు చేయించుకోవడం, బూతు చేయకుండా ఉండడం. ఇది అక్షరాల నిజం. Sexual Desire ని ఒక స్త్రీ వ్యక్తీకరిస్తే, అది సిగ్గులేనితనం. అదే ఒక మగవాడు వ్యక్తీకరిస్తే, అది వాడి జన్మహక్కు. నీకు సిగ్గులేదా? అని వేసే ప్రశ్న, నీవెంత తప్పుచేసావు? అని చెప్పే Symbolism నుండి, మగవాడ్ని కాబట్టి నా ఆధిక్యతను నువ్వు ఒప్పుకొని తీరాలనే స్థాయికి దిగజారింది.
    6 hrs · Edited · Unlike · 6
  • Jagadish Kumar మూర్తి గారూ.... మీ విశ్లేషణ బాగుంది. ఆదే పాయింటు చెప్పాలని నా ప్రయత్నం కూడా.. స్ర్తీ తన సెక్స్ కోరికను స్వేచ్ఛగా వ్యక్త పర్చడాన్ని సహించలేని, భరించలేని పురుషాహంకారులు మాత్రమే `సిగ్గు, శరం లేనిదానివా?` అని తిడతారు. ఈ రెండు పదాలను స్ర్తీపై వాడడమంటే...కచ్చితంగా లింగ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని ప్రదర్శించడమే .. 

    అదే స్ర్తీ ఇవే పదాలను మగవాడిపై వాడితే అవి కచ్చితంగా నైతిక విలువలు (దొంగతనం చేయడంతో సహా.) మీరినప్పుడు మాత్రమే... నలుగురు ఆడోళ్లతో తిరుగుతున్నావ్ నీకు సిగ్గులేదా? అని పొరపాటున అన్నారనుకుందాం. `నాకెందుకు సిగ్గు.. ఉంటే వాళ్లకుండాలి గానీ...` అని అత్యంత సునాయాసంగా ఆ పదాన్ని ఆడాళ్ల మీదకు నెట్టేస్తారు. సో ఆడాళ్లను తనచుట్టూ తిప్పుకున్నవాడు కూడా, ఆ ఆడాళ్లను వారి భావ స్వేచ్ఛను గౌరవించకుండా, పురుషాహంకారంతో కూడిన పైత్యాన్నే ప్రదర్శించేందుకు సిద్ధపడతాడు. గమనించండి.. 

    అలాంటి సందర్భంలో తాము చేసిన పనిని సమర్థించుకునేందుకు మహిళ పొరపాటున పెదవి విప్పినా, హావభావం ప్రదర్శించేందుకు ప్రయత్నించినా తోటి మహిళ కూడా అనేమాట `సిగ్గులేనిదానా? బజారుదానా?` అని అనే.. మహిళ కూడా ఇలా సంబోధించిందంటే అర్థమేంటి? `నీవు ఒక్క పురుషుడికే ప్రయివేటు ఆస్తిగా ఉండాలి. పబ్లిక్కయ్యావు. బజారుదానివయ్యావు. వ్యభిచారివి.` అని.. అంటే పురుషుడికి లొంగి ఉండడమనే `నైతిక విలువ`ను ఆమె కూడా చెబుతోందన్నమాట. ఇది లింగ బానిసత్వం తప్ప మరోటి కాదు.
    5 hrs · Like · 3
  • Thatisetti Raju Jagadish Kumar bhai...
    తప్పు అనేది లేకపోలేదు ...
    చట్ట పరంగా నేరం గా పరిగణించబడే వాటినే తప్పుగా తీసుకుంటే, సరుపోతుంది..


    నైతికత అంటారా ..?
    భిన్న వాదనలకి తావివ్వాలి మరి.
    మీరు ఏ ఉద్దేశ్యం తో అడిగినా,
    ఆడవాళ్ళ" కే " కాదు ,
    ఆడవాళ్ళ" కి కూడా" ఉండాలి .
    సిగ్గు శరం...
    ఒకవేళ అవి చట్ట పరిదిలో తన ఉనికి కి లాబదాయకమైతే ..!

    మనం రోబోటిక్స్ కి చేరుకున్నాం, గానీ రోబోస్ కాదుగా..!
    ఆత్మాబిమానం, ఆవేశ కావేశాలు ఉన్నపుడు,
    సిగ్గు శరం ,వాటికి కవచాలు గా
    ఉండగలుగుతాయ్..!

    స్త్రీ వాదం అంటే 
    స్త్రీని వెనకేసుకురావడం,
    ఎంతమాత్రం కాదు..!
    ఆమెకు ఆమెగా ముందుకు సాగే ,
    వాతావరణానికి ,ఆటంకం కలగకుండా 
    విడిచి పెట్టడం అంతే..!

    అంతకు మించి ఏం చేసినా,
    ఆమెకి ఊతకర్రని అలవాటు చేసినట్టే..!
    అది పురుషాదిక్య భావపు
    ఆదర్శ రంగు మాత్రమే
    5 hrs · Edited · Like · 2
  • Jagadish Kumar తాటి శెట్టి రాజుగారూ..

    1. డబ్బులకు ఒళ్లు అమ్ముకోవడం (పేదరికం), డబ్బులకోసమే ఒళ్లు అమ్ముకోవడం (వృత్తి, ఫ్యాషన్, సంతృప్తి).. ఈ పనులను ఆడా, మగా ఇద్దరూ చేస్తున్నారు. వ్యభిచారం అనేదానికి లింగబేధం లేదు. చట్టపరంగా కొన్ని ప్రాంతాల్లో అనుమతిస్తున్నారు. కొన్ని ప
    ్రాంతాల్లో అనుమతించడంలేదు. దేనిని ప్రాతిపదికగా తీసుకోమంటారు? ఏది తప్పు? ఏది ఒప్పు? 

    2. మీరన్నట్లు చట్టమే పరమావధి అనుకుందాం. ఒక్కో దేశంలో ఒక్కో చట్టం ఉంది. ఒకదేశంలో మహిళ పరదా దాటి బయటకు రావద్దని చెబుతోంది. అలా వస్తే తప్పని చెబుతోంది. ఓ మహిళ పరదా దాటి బయటికొస్తేనే `నేరమా?

    3. ఆడవాళ్ల `కే` కాదు, `కి కూడా` ఉండాలి అన్నారు. ఉన్నది, మగవాళ్లుగా మనం సంబోధిస్తున్నది, ఉండాలంటున్నది వాళ్ల `కే` అయితే, `కి కూడా` అనే పదాలు ఎందుకొచ్చాయి? పొట్టి బట్టలు వేసుకున్నందుకా? మగవాడితో సమానంగా తిరుగుతున్నందుకా? లేకా స్వేచ్ఛగా సెక్స్ గురించి ఎక్స్ ప్రెస్ చేసే సాహసం చేస్తున్నందుకా? లేదా `గుట్టుచప్పుడు కాకుండా` తమ కోరికను `నేరం చేస్తున్నామనే బానిసత్వపు భావన`తో తీర్చుకుంటున్నందుకా?
    5 hrs · Like · 4
  • Thatisetti Raju 1..తాను నివసిస్తున్న సమాజపు, చట్టానికి తలొంచాలి...!

    2..ప్రాంతాల ,దేశాలవారీ గా ,వాతావరణ,ఆహార మార్పుల్ని అంగీకరించినట్టే ,చట్టాల్లో మార్పుల్ని అంగీకరించాలి..

    చట్టంలో లొసుగులు కనిపిస్తే ,మార్పుల కై పాటుపడాలి ..

    3..నిక్కర్ల లో కాదు, మనోస్దైర్యం లో కురచతనం ఉన్న వాళ్ళ కే, వెనక కుక్కల అరుపుల కి బెదురు.

    ఎవడేం అనుకుంటున్నాడో ..,
    అనేది స్త్రీ వదలకపోతే 
    ఏకాంతంలో కూడా 
    పురుషాదిక్య బానిసే..!

    బానిసత్వం తీసుకోవడంగా 
    కూడా అంతమవ్వాలి..!
    5 hrs · Edited · Like · 1
  • Jagadish Kumar 4. ఆత్మాభిమానానికి, ఆవేశకావేశానికి సిగ్గు, శరం అనేవి కవచాలా? ఏ కోణం నుంచి..? 

    5. స్ర్తీవాదం స్ర్తీ చేసిందనుకో ఆడాళ్లు ఆడాళ్లను వెనుకేసుకు వస్తుందంటారు. అది కూడా `తప్పు` అనే భావనతోనే సుమీ.. అదే మగాడు స్ర్తీవాదం చేశాడనుకో `నైతిక తప్పు` అనే భావనతో అనుమ
    ానపు మాటల్తో దెప్పి పొడుస్తాం. ఎందుకంటే ఆ `నైతికత` పురుషాధిక్య ఆధారంగా నిర్ణయించబడింది కాబట్టి.. స్ర్తీ హక్కులను, ఇష్టాఇష్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినేందుకు, పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధపడని `నైతికత` కాబట్టి..

    6. అయినా రాజుగారూ.. నాకు తెలియక అడుగుతా... `ఆమెకు ఆమె ముందుకు సాగే వాతావరణం` కేవలం ఆమెతోనే సాధ్యమవుతుందా? పురుషుడి సహకారం అక్కర్లేదా? `ఆటకం కలిగించకుండా?` అన్నారు. ఎవరినుంచి వస్తుంది? పురుషుడి నుంచి కాదా? పురుషాధిక్య భావజాలానికి బానిసలుగా పడుండాలనుకునే స్ర్తీ లనుంచి కాదా? పురుషుడి సహకారం లేకుండా ఈ రెండింటిని ఆమె ఎదుర్కొనే పరిస్థితులు ఈ సమాజంలో ఉన్నాయా? సమాజంలో పరిస్థితి, భావజాలం అలా లేనప్పుడు `ఆమెకు ఆమె ముందుకు సాగేట్లు విడిచిపెడితే ఏం జరుగుతుంది? ద్యే...వుడా ఇంకెప్పుడు `నాకై నేను, నాలా ఉండాలనుకోవద్దని` బుద్ధి తెచ్చే విధంగా మన సమాజం ప్రయత్నిస్తుంది. కావాలంటే టెస్టు చేసి చూడండి.

    7. గుడ్.. ఉన్న ఊతకర్రను ఊడగొట్టి అడుగు ముందుకేయకుండా చేసేందుకు గా...ట్టి ప్రయత్నం అది.. ఎందుకంటే `ఆమెకు ఆమెగా ముందుకు సాగాలంటే` ప్రస్తుత సమాజంలో ఆమెకు `ఊతకర్ర` కావాలి.
    4 hrs · Like · 2
  • Thatisetti Raju 4..మనం ఏది చేసినపుడు, సమాజం నుంచి వ్యతిరేకత ఎదురై,
    మన ఆత్మాబిమనం దెబ్బ తింటుందో,
    దానిని

    తిరిగి చేయకుండా ,మనల్ని సావదానంగా ఉంచేదాన్ని, సిగ్గు అంటాం. దాని హిందీ శబ్దం షరం.
    దాన్ని తప్పుడు సందర్బాల్లో వాడ్డం వల్ల ఆ పదమే తప్పుగా మారిపోయింది..!

    5.. స్త్రీ వాదం, స్త్రీ పురుషుల్లో, ఎవరు చేసినా దాని మూలార్దాన్ని తెలుసుకోవాలి..!
    సమానత్వం అన్నది 
    తక్కువ నుంచి ఎక్కువ చేయడం అనే భ్రమలో ఉంది ..!
    ఇదే జరిగితే కొన్నాళ్ళకి పురుష హక్కుల కోసం అరవాల్సి వస్తుంది ..!

    6 . మీరను కునే తను తనలా ,ఉంటే 
    ద్యే.... వుడా అనే పరిస్తితులు మారుతున్నాయి,
    దాడులు వేరు,
    సగటు సామాజిక పరిణతి వేరు ,
    మొదటిది గతం నుంచి కొనసాగుతుంటే 
    రెండవది గతాన్ని ,చీల్చుకు పోతుంది.

    7. మనం లేని పోని అతి జాగ్రత్తలతో, భయాలు నేర్పి,
    తెలివిగా ..ఆమె ఆత్మ న్యూనతని పోనీకుండా .,మరింత పెంచుతున్నామని.. తెలుసుకోమంటున్నాను.
    అందుకే ఊతకర్ర వద్దన్నాను..!
    4 hrs · Like · 1
  • Jagadish Kumar రాజుగారూ.. `సిగ్గు` విషయంలో ఆడవాళ్లను సర్దుకుపోమంటున్నారా? 
    -----------------------------------------------------
    --- పురుషాధిక్యత మెండుగా ఉండే చట్టాలను ఎందుకు అంగీకరించాలి? ఆ అవసరమేంటి? మనిషిగా ఆడదాన్ని గుర్తిస్తే, ఆమెకు మనస్సు ఉంటుందనుకుంటే, ఆమెకూ క
    ోరికలుంటాయన్న సోయి మనకుంటే `సిగ్గులేదా` అని అనకుండా ఉండడానికి ఏ దేశం చట్టాలు కావాలి? ఏ చట్టంలో మార్పులు రావాలి?

    --- రాజుగారు.. హైవే సినిమా చూశారా? చూడకపోయినా నష్టం లేదు. యూట్యూబ్ కు వెళ్లి `ఆలియాభట్ ఎమోషనల్ డైలాగ్ హైవే మూవీ` అని టైప్ చేయండి. మోనోలాగ్ డైలాగు వీడియోలు కొన్ని వస్తాయి. వాటిని వినండి.. ఆలియాభట్ తనతల్లిదండ్రులను అడుగుతుంది. `బయట వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. కానీ ఇంటి వాళ్లతో కూడా జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెప్పలేదు? నేనైతే ఇక్కడ పూర్తిగా ఎక్స్ పోజ్ అయి ఉన్నానుగా?`... ఇదీ సగటు భారతీయురాలి స్థితి. ఎన్ సి ఆర్ బి చెబుతున్నది కూడా ఇదే. తెలిసినవాళ్ల వల్లే రేపులు 90శాతానికి పైగా జరిగాయి.

    సెక్స్ గురించి.. సెక్సువల్ ఎక్స్ ప్రెషన్స్ ను `సిగ్గు అనే పేరిట అణిచివేసి, ఇంట్లో అత్యాచారం జరిగితే దానిని బటయకు పొక్కనీయకుండా `పరువు` అనే పేరిట అణిచివేస్తుంటే వెనుక కుక్కల అరుపులకు బెదరకుండా ఎలా ఉంటారు?

    -- ఎవడేం అనుకుంటున్నాడో అనేది అనుకోకపోతే `విలువలు` `నైతికత` `పరువు` `మర్యాద` వంటి పురుషాధిక్య నీతులు చూపెట్టి నువ్వు `ఆడదానివి`... అవన్నీ `అనుకోవాలి`.. అనుకోకపోతే నీవు `చెడినదానివి`, `బజారుదానివి`, `సోయిలేదా` అనే సుభాషితాలు సాటి మహిళల నోటి వెంటే వస్తుంటాయి. కాదంటారా? చివరకు వచ్చే వాక్యం `నువ్వు ఆడదానివేనా? కాస్త సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద అనేవి ఉంటే, ఒంటి మీద సోయి ఉంటే బాగుండేది` అనే కదా!..
    4 hrs · Like · 2
  • Thatisetti Raju Jaggi bhai..
    --------------------------------------------------
    సినిమాలేం ఉపగ్రహాల నుంచి ఊడి పడవు..!

    మీరు చెప్పిన ,హైవే సినిమాకి ముందు తరువాత స్త్రీ జీవితంలో చెప్పుకోదగ్గ మార్పులేమైనా వచ్చాయా..?
    ఈ ప్రామాణిక పరిజ్ఞాన దాస్యాన్నే, వదలమనేది..!
    ఇంకెంత కాలం స్త్రీ ,
    సోకాల్డ్ మేదావుల,
    చంకల్లో కూర్చుని....
    లోకాన్ని చూడాలి...!

    చట్టాల్ని మార్చగల శక్తి ,
    సామాన్యుడికి ఉందని నమ్మండి..!
    లేని పోని చట్ట దిక్కారాలు నేర్పి కొత్త సమస్యలు ఆమెకి పెంచకండి..!
    కావాలంటే టెస్ట్ చేసి చూడండి..!

    స్త్రీ అన్న కారణంగా,
    పురుషుడికి అంగీకరింప బడ్డ ఏ పనైనా, తన ఇష్ట ప్రకారం చేస్తానంటే చేసే స్వేచ్చ హక్కు స్త్రీ కి ఉండాలి ..!
    ఉండి తీరాలిః

    స్వేచ్చగా పలానావి చేసి తీరు అనే
    అనే ఆదర్శాలకి ఆమె బలి కాకుండా 
    జాగ్రత్త పడాలి

    చెయ్యొద్దనే నియంతృత్వం
    లాంటిదే 
    చేసితీరు అనే 
    ఆదర్శ డాంభికం కూడా
    3 hrs · Edited · Like · 1
  • MK Dhanunjaya Murthy రెండు కుటుంబాలవాళ్ళు పరస్పరం కొట్లాడుకున్నారు. కొంతకాలం పాటు వారిమధ్య ఎలాంటి మాటల్లేవు. ఒక సందర్భం లో ఈ ఇంటి వ్యక్తి తన ప్రత్యర్థి తో మాట్లాడుతుండగా, సదరు వ్యక్తి భార్య చూసింది. అతను ఇంటికి వచ్చేవరకు ఓపిగ్గా వుంది, తర్వాత తన భర్త తో ఇలా అంది " మగపుట్టుక పుట్టావ్, పుల్లారెడ్డి కొడుకనిపించుకున్నావ్, పాతికెకరాల ఆసామివీ, ఇంతేసి చదూకున్నావ్, మనతో కొట్లాడిన వాడితో నువ్వు, నువ్వే మాట్లాడతావా? వాని పెండ్లాం ఎవడేవనితోనో తిరుగుతుందని నేనే దాంతో మాట్లాడడం మానేశాను. నాకు సిగ్గుంది కాబట్టి. నీకు ఆ మాత్రమైనా లెకపాయె. యాడన్నా పడి సావు " అని. 

    జన బాహుళ్యం లో సిగ్గు అనే మాట ఒక్కో సందర్భం లో ఒక్కో రకంగా ఇన్ని సందర్భాలలో వాడబడుతూంది '' మనం ఏది చేసినపుడు, సమాజం నుంచి వ్యతిరేకత ఎదురై, మన ఆత్మాబిమనం దెబ్బ తింటుందో, దానిని తిరిగి చేయకుండా ,మనల్ని సావదానంగా ఉంచేదాన్ని, సిగ్గు అంటాం'' అన్నThatisetti Raju గారి అభిప్రాయం తో పూర్తిగా ఎకీభవిస్తున్నను. ఇక వాదాలన్నీ మనం ఊహించుకుంటున్నవే అని నా భవన.
    3 hrs · Like · 1
  • Jagadish Kumar సమాజం వ్యతిరేకత కొలబద్దనా? అప్పుడే మగాళ్ల హక్కుల గురించి అరవడమా?
    ----------------------------------------------------------------------------------
    -- ఒక మగాడు ఎంత మంది ఆడాళ్లతో తిరిగినా వ్యతిరేకత రానిది. ఒక ఆడది ఒక మగాడికంటే ఒక్కరితో ఎక్కువగా తిరిగిన
    ా వ్యతిరేకత వస్తుంది. సో మీరన్న సావదానంగా ఉంచే `సిగ్గు` ఆడదానికి తప్ప, మగానికి అక్కర్లేదన్నమాట.. 

    -- స్ర్తీ వాదంలో మూలార్థం ఏమిటి బెదరూ?? దేన్నయినా ఉన్న స్థితి నుంచి ఎక్కువ లేదా తక్కువ నుంచి ఎక్కువ చేయాలనే ప్రయత్నిస్తాం. ఈ రెండూ కాకుండా కొత్త స్థితి ప్రమాణాన్ని కనిపెట్టారేమో కాస్త సెలవివ్వండి.

    -- స్ర్తీ పొరపాటున తన హక్కు కోసం అడిగితే 99శాతం ఆక్రమించిన పురుషహక్కులకు కచ్చితంగా భంగం వాటిల్లుతుంది. కచ్చితంగా అరవాల్సిందే. ఏ ఇన్నాళ్లూ వీళ్లు అరవలేదా? హక్కులు ఇచ్చి ఆ తరువాత మగాళ్లు అరిస్తే అందులో తప్పేముంటుంది? అదేమైన అవమానకరమైన పనా?

    -- మీరు కనబర్చిన `సగటు` సామాజిక పరిణితి అద్భుతం. అందులోంచి మీరు త్వరలో బయటకు వస్తారని ఆశిస్తున్న..

    -- లేని, పోనివి ఒక్కటి చెప్పు.. ఉన్నవే పూర్తిగా చెప్పకుండా, చైతన్యం చేయకుండా చీకట్లో ఉంచుతున్నాం. ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులను ఉన్నదున్నట్లుగా ధైర్యంగా చెప్పు. ఏం చేయాలనుకుంటుందో తెలుసుకో.. ఆమె చేయాలనుకుంటున్న పనికి సహకరిస్తాననే భరోసా, సహకారం రెండూ ఇవ్వు... ఆత్మన్యూనతను అడ్రస్ కూడా దొరకని స్థలానికి తన్నేస్తుంది.
    3 hrs · Like · 3
  • Jagadish Kumar నియంతృత్వం కాదు.. సామాజిక చైతన్యంతోనే `ఆమె`బంధనాలు తెంచాలి
    ---------------------------------------------------------------------------------
    -- అయ్యా... రాజుగారూ.. స్ర్తీని చంకనెత్తుకుని తిరగమని ఏ పురుషుడికి, సోకాల్డ్ మేధావికి నేను చెప్పడం లేదు. ఎప్పు
    డూ చెప్పను. నేనూ ఆ పని చేయను. పదాడంబరం కోసం వాడిన పదజాలమే అయితే నో ఇష్యూస్... నా కామెంట్లు మొదటి నుంచీ చదవండి. అలా అన్న సందర్భం ఒక్కటైనా చూపించండి.

    -- చట్ట ధిక్కారమా? అది చేస్తే సమస్యలు ఆమెకా? అతనికా? ఓహో చట్ట పరంగా బొక్కలో వేసి కొత్త సమస్యలు తెస్తామని బెదిరిస్తున్నారా? `సిగ్గు, శరం` తెచ్చుకుని ఆమె ఇప్పుడున్నట్లే ఉండాలంటారా?

    -- అయ్యా మన పురాణాలు, వేదాలు, సోకాల్డ్ సంస్కృతులు చెబుతున్న పాత చింతకాయ పచ్చడి వాదన రుచినే మీరు మరో చూసినట్లున్నారు. ఆ రుచి మీకు నచ్చక ఇక్కడ కక్కాలనుకుంటున్నారు. ఆ పని చేయకండి. `స్ర్తీ మనిషన్న కారణంగా, ఆమెకు అంగీకరింపబడ్డ ఏ పనైనా, ఆమె ఇష్ట ప్రకారం చేస్తానంటే చేసే స్వేచ్ఛా హక్కు స్ర్తీకి ఉండాలి.. ఉండి తీరాలి...`` ఇలా అని చూడండి. మీరూ మనిషేనన్న భావన మీకే కలుగుతుంది.

    -- స్వేచ్ఛ అనే ఆదర్శం కానైతే ఆమెకున్న బంధనాలు తెంచుతాయి. బంధనాలు వేసే వాళ్లను బలిచేస్తాయి. బంధనాలను, బంధనాలు వేసే వాళ్లను మాత్రం నియంతృత్వంతో కాకుండా, సామాజిక చైతన్యంతో ఆడది కూడా `ఓ మనిషన్న` స్పృహతీసుకురావడం ద్వారానే రూపుమాపాలి. అప్పుడే అది దీర్ఘకాలం మన్నుతుంది. లేదంటే రాజుగారు చెప్పినట్లు డాంబికమే అవుతుంది.
    3 hrs · Like · 3
  • Thatisetti Raju నేను స్త్రీ వాదినే అని., నిరూపించుకోవాల్సిన అవసరం.. లేదనుకుంటా..!

    నా పోస్ట్లు , కామెంట్స్ కాదు.,

    నన్ను తెలిసిన వారు, నా చుట్టూ నా జీవితంతో సంబందించిన స్త్రీలే తేల్చాలి.. నా స్త్రీ వాదమెంతో..!
    భాషకేముంది ...
    బడి కెళ్తే వస్తది ..!

    ఆదర్శాలకేముంది,
    పుస్తకాలు చదివితే ...
    వస్తది..!

    ప్రవర్తన అనేది
    అవగాహన తో 
    అవగతం చేసుకుంటేనే 
    వంటబడతది
    3 hrs · Unlike · 3
  • Jagadish Kumar అయ్యో రాజుగారు.. మీరు ఏ వాదో నాకెట్ల తెలుస్తది? సర్టిఫికేట్ ఇయ్యనింకె నేనేవడ్ని? మీ అభిప్రాయం చెప్పిన్రు. నేను చెప్పిన. గంతే. ఇగ భాష గురించంటరా? బడికెళ్లనోడు కూడా అర్థం మారకుండా పదాలు వాడుతున్నడు. బడికెళ్లినోళ్లమే పదాడంబరానికి పోయి అర్థం మర్చిపోతున్నం..

    అదేదో సైన్మాలో బ్రహ్మానందం అంటడు. చరిత్రదేముందిరా చింపితే చిరిగిపోతుంది. డిటో డైలాగ్ కాస్త వర్షన్ మార్చి ఆదర్శాల మీద పెట్టినట్టున్నరు..

    ప్రవర్తన అనేది వ్యవహారంలో నేర్చుకునేది. అట్లనే వంటబడ్తుంది. థాంక్యూసాబ్.. మీ విలువైన అభిప్రాయాలు పంచుకుని చర్చను సంపద్వంతం చేసినందుకు...
    2 hrs · Like · 3
  • 2 hrs · Unlike · 3
  • Reddy Bosa అదిరింది పో ఏం చర్చ ఏ చర్చ రాజు గారు జగదీష్ దారు నువ్వా నేనా అన్నట్టుగా వుంది గ్రేట్ చాలా రోజులు తర్వాత
    47 mins · Unlike · 4