Saturday 17 January 2015

రామకృష్ణ పరమహంస - శోక్లాలు - చారిత్రక నేపథ్యం చర్చ...



రామకృష్ణ పరమహంసను... ఆయన శ్లోకాలను ఒక్కొక్కరు ఒక్కో రకంగా అన్వయించి చెబుతున్నారు. దీనివల్ల ఆయన చెప్పినవన్నీ  దైవత్వ ప్రధానంగా మారిపోయి మత ప్రచారకుల చేతుల్లో సాధనాలుగా మారిపోతున్నాయి. రామకృష్ణ పరమహంస చెప్పిన  ఓ శ్లోకాన్ని తీసుకుని, దాని సారాంశాన్ని, అర్థం చేసుకునే పద్ధతిని, అప్పటి కాలానికి అన్వయింపును వివరించేందుకు ఈ పోస్టులో ప్రయత్నం జరిగింది. రామకృష్ణ పరమహంస అప్పటి కాలంలో ఆధ్యాత్మిక  పథాన సంఘ సంస్కరణకు అవసరమైన బీజాలను నాటారు. అది అర్థం చేసుకోకుండా ఆయనకు దైవత్యాన్ని అంటగట్టడం అవివేకం అవుతుంది.
ఆధ్యాత్మిక గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస ఒక శ్లోకం చెప్పాడు.
"భగవంతుని ప్రేమికులు ఏ కులానికీ చెందరు.... ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కాజాలడు. భక్తి ద్వారా అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడు కాగలడు."
Like ·  · 
  • Narendra Kumar bull shit smels like bullshit
    2 hrs · Edited · Like
  • Vijaya Bhaskar Jella Bhakthi dvara parama pavitrudu ayye, antarani vadu evaru ?
    Antaranivallu ?????????
    2 hrs · Like · 1
  • Sakthi Swaroopini Naa abiprayam prakaram antaranivallu ante manavatwam lenivallu manishini manishila chedatam ranivallu...
    2 hrs · Like · 5
  • Sakthi Swaroopini Kulam matham indulo antarani tanam ledu kevalam mana behaviour lo matrame antarani tanam undi....
    2 hrs · Like · 3
  • Sakthi Swaroopini E kulalu mathalu kevalam okari swardamkosam matrame .........
    2 hrs · Like · 2
  • Rambabu Thota భక్తీ ద్వారా అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడు కాగలడు...........అంటే భక్తీ లోకి ప్రవేశించకముందు the socalled అంటరానివాడిని రామకృష్ణులు అంటరానివాడనే అంటారా..........then ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కాజాలడు !!! మరి ఏమవుతాడో చెప్పలేదు......ఇది జ్ఞానమా కన్ఫ్యూజనమా????
    2 hrs · Like
  • Jagadish Kumar రామకృష్ణ పరమహంస చెప్పిన దానిని విశ్లేషించి చూడండి.. శ్లోకం చివరి నుంచి ముందుకు వెళ్తే మరింత లోతైన అర్థం వస్తుంది.

    1. అతను జీవించి ఉన్న కాలంలో అంటరాని వారున్నారు.

    2. అంటరాని వాళ్లను సంఘసంస్కరణ ద్వారా బ్రాహ్మణుడితో సమానం చేయాలనుకున్నారు.
    3. అలా వచ్చిన వాళ్లను ప్రేమించని, లేదా ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే కాడన్నారు.
    4. ఒకవేళ అలా ప్రేమించక, కులాన్ని బట్టి దూరం పెట్టేట్లయితే `భగవంతుని ప్రేమికులు ఏ కులానికీ చెందర`ని చెప్పేశారు..

    ఆనాడింక నేరాన్ని బట్టి శిక్షలు అమలు చేసే రాజ్యాంగం లేదు. కులాన్ని బట్టి శిక్షలు అమలు చేసే మనుధర్మశాస్ర్తం అమల్లో ఉంది. అలాంటి సందర్భంలో మనుషుల మధ్య ప్రేమను సాధించేందుకు, వారందరినీ సమాన స్థాయికి తీసుకువచ్చేందుకు, కుల భావనను రూపుమాపేందుకు రామకృష్ణ పరమహంస గారు ఆధ్యాత్మిక దారిని ఎంచుకున్నారు.

    ఇప్పుడు కూడా అలాంటి వారు మరింత మంది రావాలి. దేశానికిప్పుడు వారి అవసరం పెరిగింది.
    2 hrs · Like · 7
  • Narendra Kumar appatiki adi correct ithey ...........ippudu kudaa danni pattuku velladadam enduku?
    2 hrs · Like
  • Narendra Kumar brhmanundi antaraanivaritho samaanam enduku cheyyakudadu?
    2 hrs · Like · 1
  • Sakthi Swaroopini Ipudu brahmanulu kuda manato samaname manato kalise udyogalu chestunaru manato kalise samajamlo nadustunnaru ekkado konni chotla murkulu valla inka mudatwam migili undi
    2 hrs · Unlike · 4
  • Narendra Kumar ippudu samaaname naa?ok.
    2 hrs · Like
  • Narendra Kumar aitey appativi ippatiki panikiraavu anthenaa
    2 hrs · Like
  • Bharath Chary Kodi guddu mida ikalu pikude pani
    2 hrs · Like
  • Jagadish Kumar అయ్యా... Narendra Kumar రామకృష్ణ పరమహంస జీవించింది (1836-1886) 50 ఏళ్లు. పశ్చిమబెంగాల్ లో ఆయన నివాసం. ఈ ప్రాంతంలోనే ఉన్న ఈస్టిండియా కంపెనీ అప్పటికే తన వందేళ్ల ను (1757-1858) పూర్తి చేసుకుని, బ్రిటీషర్లు అధికారం చేపడుతున్న సమయం అది. సరిగ్గా ఆ సమయంలోనే రామకృష్ణ పరమహంస గారి కార్యక్రమాలు విస్తృతమవుతూ వచ్చాయి.

    పార్రిశామికీకరణ ప్రారంభమైన క్రమంలో పరిశ్రమలకు అవసరమైన కార్మికులు గ్రామాల నుంచే రావాలి. అది కుల బంధనాలు తెంచుకునే రావాలి. అలా రావాలంటే అప్పటి కట్టుబాట్లు అంగీకరించేవి కావు. సమాజం అడుగు ముందుకేయాలంటే కుల కట్టుబాట్లను ధ్వంసం చేయాలనుకున్న వాళ్లు సంఘ సంస్కరణ ఉద్యమాలను తీసుకువచ్చారు. (ఈ సంఘ సంస్కరణోద్యమాలే ఉద్యమాలుగా మారి బ్రిటీషర్ల కొంపలు ముంచుతున్నాయని గ్రహించి ఆ తరువాత వాళ్లు కుల వ్యవస్థను ధ్వంసం చేయకుండా వదిలేశారు. కులాన్ని పరిరక్షించేందుకు నడుం బిగించారు.)

    పశ్చిమబెంగాల్ ఇలాంటి సంఘ సంస్కరణోద్యమాలకు పుట్టినిల్లు. రామకృష్ణ పరమహంస పుట్టిందక్కడే. సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావం రామకృష్ణ పరమహంస మీద ఉండొచ్చు. ఆయన శిష్యుడే వివేకానందుడు.. మన దేశం గురించి విదేశాల్లో గర్వంగా చెప్పిన వివేకానందుడిని, స్వదేశానికి తిరిగి వచ్చిన తరువా ఇక్కడి బ్రాహ్మణులు ఛీత్కరించారు. ఆయనే చనిపోయాడని కొంత మంది, చంపేశారని కొంత మంది చెబుతుంటారు. ఇది ఆనాటి కుల వివక్ష, అంటరానితనం, కుల కట్టుబాట్ల త్రీవత.

    రాజ్యాంగం ఏర్పడిన తరువాత కులాలను బట్టి కాక, నేరాన్ని బట్టి శిక్ష అమల్లోకి వచ్చింది. అయితే అదిప్పటికీ అరకొరగానే అమలవుతోంది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో పుట్టుకొస్తున్న కొత్త వృత్తులు చేసేందుకు మానవ వనరులు కావాల్సి వస్తోంది. సమాజపు ఈ అవసరమే అన్ని కులాల వారిని కొన్ని పరిమితుల్లో ఒకే వేదిక మీదకు తీసుకువస్తోంది. ఇప్పుడు జరుగుతున్నది ఇదే.

    అందరూ ఒకే వేదిక మీదకు వచ్చినట్లు కనిపించినా ఇప్పటికీ పై కులాలకు, కింది కులాలంటే వివక్ష. బంధూత్వాలు కలుపుకోవడానికి సిద్ధపడరు. అందుకే ఎంత చదువు చదివినా గాని స్వకుల పెళ్ళిళ్ల కే వారి చైతన్యం పరిమితం అయిపోతోంది గానీ, కులాంతర వివాహాల వైపుకు మళ్లడం లేదు. గమనించండి. మరి దీనికి కారణమేంటి?
    1 hr · Edited · Like · 5
  • Narendra Kumar mee essay chadivanu...nakemi ardam kaledu...nannu kshaminchagalaru...inkeppudu argue cheyyanu...
    1 hr · Like
  • Jagadish Kumar sir Narendra Kumar... లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు... ఎడిట్ చేశాను. ఇప్పుడు చదవండి.. ఓపికుంటే...

    --- సింపుల్ గా చెప్పాలంటే రామకృష్ణ ఉన్ననాటి పరిస్థితులు, ఆయన చేసిన కృషి, ఇప్పుడు మారిన పరిస్థితులు, ఇప్పటికీ అమల్లో ఉన్న కుల అసమానతల గురించి చెప్పాలనుకున్నాను. అది అర్థం చేసుకోకపోతే మనం ఆయన్ను పాక్షికంగానే అర్థం చేసుకుంటాం..
    1 hr · Like · 4

No comments:

Post a Comment