Thursday 15 January 2015

ప్రభుత్వ విద్యా వ్యవస్థ - లోపాలు - చర్చ

ప్రభుత్వ విద్యా వ్యవస్థ అది ఎదుర్కొంటున్న సమస్యలపై  ఫేసుబుక్కులో అర్థవంతమైన చర్చ నడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి...

చాలా బాధాకరమైన విషయం:
The Hindu, 14.1.2015, front page, and The Indian Express, page 6
The Annual Status of Education Report ( ASER ) states that only 48.1% class 5 students in India , and 25% class 8 students can read class 2 texts.
How have these students reached class 5 or class 8 if they cannot even read class 2 texts ? There seems to be something seriously wrong with our education system
Like ·  · 
  • Ram Krishna ఇప్పుడు చదువు అవసరం లేదు మాకు....మేము వేదాలకాలంలోనే మేధావులం..
    15 hrs · Like · 1
  • Subba R Jevisetty అది వాళ్ళ ఖర్మ అంటుందేమో ఈ హిందుత్వ ప్రభుత్వం.
    15 hrs · Like · 1
  • సత్య ప్రవీణ్ పెరుమాళ్ళ Chaduvante markulu matrame ayinappudu phalitalu ilAnE untai kadandi
    15 hrs · Like · 1
  • Subba R Jevisetty నేను చదువుకున్నప్పుడు చాలా మంది విద్యార్ధులు పుస్తకాలను కత్తరించి దొంగతంగా దాచిపెట్టి పరీక్షల్లో చూసి రాసేవాళ్ళు. ఆశ్చర్యమేమంటే డిగ్రీ కాలేజీ లో కూడా కొందరు చూసిరాస్తూ పట్టుబడ్డారు.
    15 hrs · Edited · Like · 1
  • Ram Krishna ఆశ్చర్యం ఏముంది అన్న అందులో నాకు తెలిసి అది మన పేటెంట్....చాలసార్లు పరీక్ష రాసేవారి భవిష్యత్తు ముందు కూర్చున్నవాడి తెలివిపైనే ఆధారపడి ఉంటుంది
    15 hrs · Like · 1
  • Subba R Jevisetty  మాకు 7వ తరగతి పరీక్షల్లో ప్రతి రోజూ మా ప్రదానోపధ్యాయుడు వచ్చి చాలా ప్రశ్నలకి సమాధాలను బహిరంగంగా అందరికీ చదివి వినిపించి రాసుకోమని చెప్పాడు. అయినా ఒకడు పరీక్ష తప్పాడు.
    14 hrs · Edited · Like
  • Jagadish Kumar పాయింట్ చాలా స్ర్టయిట్...

    1. స్టూడెంట్స్ కి తగ్గ టీచర్లు ఉండడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో రిక్రూట్ మెంట్లు ఆగిపోయాయి.

    2. టీచర్లలో క్వాలిటీ ఉండడం లేదు. ప్రయివేటు పాఠశాలల్లో ఇంటర్మీడియట్ పిల్లలు పదో తరగతికి పాఠాలు చెబుతున్నారు.

    ఈ రెండు కారణాల వల్ల విద్యార్థుల్లో నేర్చుకునే నైపుణ్యం (లర్నింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి.)

    పై రెండు పాయింట్లు ఒకదానికి ఒకటి లింకున్న అంశాలు. అవెలా అంటే... 
    ------ ప్రభుత్వ పాఠశాలలు ఆదాయ వనరులు కావు. వాటి మీద పెట్టేది ఖర్చే. ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవాలని, అప్పుడైతేనే అప్పులు చెల్లించే స్తోమత ఏర్పడుతుందని, అప్పులిచ్చిన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ చెబుతున్నాయి. ఎవరో చెబితే మేమినాలా? మేమే తగ్గించుకుంటాం అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ద్రవ్య నియంతణ బిల్లు (FRBM) చట్టాన్ని ఆమోదించుకున్నాయి. ఈ చట్టం ద్రవ్యలోటు పెరగకుండా నియంత్రించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖర్చును, అప్పులను రెండింటినీ పోటీ పడి తగ్గించాలి. ఈ రెండింటిలో ఏది తగ్గుతుంది? అప్పులు తగ్గే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ఖర్చే తగ్గాలి. రిక్రూట్ మెంట్లు అందుకే నిలిచిపోతున్నాయి. ఒకవేళ అయినా అరకొరగా అవుతున్నాయి.
    ------- ప్రభుత్వ టీచర్లు లేకపోతే, ప్రభుత్వ పాఠశాలలు నడవవు. ప్రభుత్వ పాఠశాలలు నడవకపోతే ఆ కొరతను ఎవరు తీర్చాలి? ప్రయివేటు స్కూళ్లు.. ఈ ప్రయివేటు స్కూళ్లు విద్యార్థి అభివృద్ధి కోసం పని చేస్తున్నాయా? లాభాల కోసం పని చేస్తున్నాయా? కచ్చితంగా రెండోదే... విద్యార్థి అభివృద్ధి కోసం పని చేస్తున్నామని చెప్పుకునే పాఠశాలలు సైతం తమకు లాభం ఉండే పరిమితుల్లోనే విద్యార్థికి సౌకర్యాలు కల్పిస్తాయి. ఇది కాదనలేని వాస్తవం.

    అయ్యా... విద్య మీద వెచ్చించే మొత్తాన్ని భవిష్యత్తు కోసం `పెట్టుబడి` గా కాకుండా, `లాభం లేని ఖర్చు`గా ప్రభుత్వమూ, ప్రయివేటు పాఠశాలల యాజామాన్యాలు వ్యవహరించడం వల్లే విద్యార్థుల్లో నేర్చుకునే నైపుణ్యాలు తగ్గిపోతున్నాయి. 

    కేంద్రంలో ప్రభుత్వం మారింది. అదిప్పుడు 'వైదిక కార్పొరేట్ మార్గాన్ని` ఎంచుకుంది. ఈ స్కూళ్లు అన్నీ పనికి రావు వేదాలను కంఠతా పట్టమని చెబుతోంది. విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కాకుండా కేవలం భట్టీయం ద్వారా మాత్రమే విద్యను ప్రసాదించే పద్ధతిని ప్రోత్సహిస్తోంది. ర్యాంకుల కోసం మన కార్పొరేట్ స్కూళ్లు చేసే పని, చరిత్ర గతిని మధ్య యుగాలకు నెట్టేందుకు మోడీ సర్కార్ కూడా అవలంభించబోతోంది. విద్యార్థికిక లర్నింగ్ స్కిల్స్ వచ్చినట్లే...
    14 hrs · Like · 3
  • Subba R Jevisetty దారుణం.
    14 hrs · Unlike · 1
  • Sathwik Teja thappu anthaa praadhamika paathashalala patla govrnmnt vidhaanam di 

    chaduwu ochinaa , rakunnaa pass tappa fail undadu 


    aksharaalu raakundane high schools ki vachestunaru 

    cheyanti thappuku high school teachers ninda mostunaaru 

    a b c d lu 1 4 lu kuda rani pilalaki high schl teachers first nundi nerpinchatam asadhyamaina vishayam 

    medhavulu kuda mamulu manushulalaga gvrnmnt schls lo primary, high schls unai ane vishayame marachi poi ankitha bhavame teacher lalo undatle ani pichi aropanalu chesthunaru tapiste

    lothuga veltega satyam telsedi

    - naa high schl teacher mitrudi aavedana idi
    14 hrs · Edited · Unlike · 4
  • Pitla Sudhakar Our indan study system
    14 hrs · Like · 1
  • Jagadish Kumar సాత్విక్ ... ఆర్గ్యుమెంట్ కోసమైనా నీవు చెప్పింది వాస్తవమే అని నమ్ముదాం... కొన్ని విషయాలు గమనించావా?

    1. ఎబిసిడిలు, ఒకటీ రెండులు రాని వారు కూడా కింది తరగతుల్లో పాస్ అయి పై తరగతులకు వస్తున్నారు అన్నావు. ఇలా పాసయి పై తరగతులకు వచ్చేవాళ్లెవరు? సమాజాన్ని ఉన్నదున్నట్లుగా చూడు నీకే అర్థమవుతుంది. ఎస్సీలు, ఎస్టీలు, బిసిలు, ఆర్థికంగా వెనుకబడిన ఓసీలు... దీనర్థం ఏమిటి? డబ్బున్న వారికి తప్ప, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి చదువు `కొన`లేనివారంతా ఇలాంటా బొటాబొటిగాళ్లుగా తయారవుతున్నారు.

    2. లర్నింగ్ స్కిల్స్ కు సంబంధించిన సర్వే ను ప్రథమ్ అనే ఎన్ జి ఓ సంస్థ కేవలం ప్రభుత్వ పాఠశాలల మీదే చేసింది. నేను ప్రయివేటు పాఠశాలల సంగతి కూడా చూడాలంటున్న. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, వసతులు లేక విద్యార్థి అనివార్యంగా ఒక్కో ఏడాది ఒక్కో క్లాసు దాటుతుంటే, ప్రయివేటు పాఠశాలల్లో డబ్బులు చెల్లించుకుని, అరకొర టీచర్లతో, భట్టీయం మోడల్ తో విషయ పరిజ్ఞానం లేకుండా ఒక్కో ఏడాది ఒక్కో క్లాసును దాటుతున్నాడు. ఈ రెండు విద్యా వ్యవస్థల్లో విద్యార్థి నష్ట పోతున్నప్పటికీ ప్రయివేటు పాఠశాలల వల్ల ఆర్థికంగా కూడా నష్ట పోతున్నాడు. ఇలా నష్టపోయేదెవరు? మొదటి పాయింటులో చెప్పిన వాళ్లే... ఎందుకంటే డబ్బుతో చదువు`కొన` కలిగినవారు మేలిమి పాఠశాలల్లోనే తమ విద్యార్థులను పంపుతారు కాబట్టి...

    3. ప్రయివేటులో `మేలిమి` విద్య ఓ మేడిపండు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో కార్పొరేట్ స్కూళ్లున్నాయి. ఇవి విద్యార్థులను వారికే ఉన్న లర్నింగ్ స్కిల్స్ ను, పోసే డబ్బును బట్టి వడగట్టి గ్రేడ్లుగా విభజిస్తాయి. ఇందులో కొంత మందిని అవి `ప్రత్యేక` దృష్టితో చూస్తాయి. వాళ్లు ర్యాంకులు అనే బంగారు గుడ్లు పెట్టే బాతులు.... మిగిలిన వాళ్లంతా ఫారం లోని కోళ్లు... ర్యాంకులు కురిపించే నారాయణ, చైతన్యల్లో పాస్ పర్సంటేజి 40శాతానికి మించకుండా ఉందన్న విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ ప్రథమ్ అనే సంస్థ ప్రయివేటు పాఠశాలల మీద సర్వే చేసి ఉంటే అసలు విషయం అర్థమయ్యేది.

    4. చివరగా... పదో క్లాసు చదివిన ప్రభుత్వ స్కూలు పిల్లోణ్ని, ప్రయివేటు స్కూలు పిల్లోణ్ని పక్కపక్కన పెట్టు. తెలివిలో, ఆలోచనలో, విషయ విశ్లేషణలో ఎవరు ముందుంటారో చూడు. ఐ బెట్... 100 మందిని నీవు పరిశీలిస్తే 80 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే గెలుస్తారు. ఎందుకంటే సమాజంలో ఉండే అన్ని కష్టాలను అనుభవిస్తూ, సౌకర్యాల లేమిని గమనిస్తూ, తనను తాను బతికించుకునేందుకు పడే కష్టంలోంచి ఆ విద్యార్థి పుట్టుకొస్తాడు.. భట్టీయం కంటే ఇది ఎన్నో రెట్లు బెటర్....
    14 hrs · Like · 3
  • Sathwik Teja kaani 10th result rakunte evarini antunaru? 

    high schl teachers ni 


    high schl lo zero knwldge tho join aye pilalaki 

    ye high schl teacher ainaa em nerpiyagaladu? sylabus chepala? leka aksharalu nerpistu kurchovalaa alaantapudu 10th lo kuda pass fail anedi tiseyalsi untadi 

    ee kalam ki kawalsindi batti matrame
    14 hrs · Edited · Like · 1
  • Jagadish Kumar Pitla Sudhakar పోస్టర్ లోనే నీ ఆవేదనకు సమాధానం ఉంది Sathwik Teja.. ఈ వ్యవస్థే విద్యార్థులకిచ్చే సౌకర్యాల్లో వివక్ష చూపిస్తోంది. పరీక్షలు మాత్రం సమానంగా పెడుతోంది. కాబట్టి ఉన్నత పాఠశాలల టీచర్లది ఎలాంటి తప్పు లేదు.

    పైగా... మనం గమనించాల్సింది ఏమిటంటే ప్
    రభుత్వ ఉన్నత పాఠశాలల టీచర్లు అలాంటి విద్యార్థులను కూడా తీర్చిదిద్ది తమ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణతను సాధించగలుగుతున్నారు. So many Examples are there...

    కాబట్టి ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న... నీ టీచర్ నీకు ఇదే నేర్పిందా? అని కాదు... నీకు చదువుకునే అవకాశం ఈ వ్యవస్థ కల్పించిందా? అవకాశం ఉంటే నీవు సోమరి పోతువా? అని... మొదటి ప్రశ్నకు లో లేదు అన్నప్పుడు రెండో ప్రశ్నకు ఆస్కారమే లేదు.
    13 hrs · Like · 2
  • Sathwik Teja mundu cm ga unapudu mahanubhavudu chandra babu nayudu garu 

    oka unnaatha patha shala head master ni 


    10th clas result rananduku akadikakade suspnd chesadu  

    vidyarthula paristiti i knw 

    but motham system failure ki high schl teachers ni 

    DEO lu, vidyaadhikarulu anyayanga titatam enta darunam annade na prashna

    samasyaku mula karanam prabhutwame
    13 hrs · Edited · Unlike · 2
  • Jagadish Kumar ఓ ముఖ్యమంత్రి అలా సస్పెండ్ చేసినప్పుడు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఈ కింది పనులు జరిగి ఉండాల్సింది...

    1. ఓరీ ముఖ్యమంత్రి... తప్పు నీలో, నీ ప్రభుత్వం, నీవు అనుసరిస్తున్న విధానంలో... పెట్టుకుని ఎందుకురా ఆయన్ను డిస్మిస్ చేశావు
     అని అడగాల్సింది. అడగలేదు. అయ్యో పాపం అనుకున్నారు.
    2. ఉత్తీర్ణతా శాతం పెరగలేదని ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నప్పుడు, కింది స్థాయి పాఠశాలల్లో టీచర్లు, సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని గల్లా పట్టుకుని అడగాల్సింది. అడగలేదు. వాడి కర్మ అంతే ఏడ్చింది అనుకున్నారు.
    3. టీచర్లకు దగ్గరి మితృలు విద్యార్థులు... విద్యార్థులైనా నిజాయితీగా పనిచేస్తున్న మా ఉపాధ్యాయులను ఎందుకు డిస్మిస్ చేశారని గర్జించాల్సింది. వాళ్లలో సంఘ చైతన్యం లేకపోవడం వల్ల వాళ్లా ప్రశ్న వేయలేపోయారు...

    విద్యార్థికి ప్రశ్నించడం మీద చైతన్యం కల్పించకపోవడం, సంఘ చైతన్యాన్ని గుర్తించేట్లు చేయకపోవడం, తను కూడా ప్రశ్నించేందుకు సిద్ధపడకపోవడం, ఎంతసేపు తన తప్పులను తనలోనే వెతుక్కుని కుమిలిపోవడం, వ్యవస్థ మార్పుకు మిగిలిన ఉపాధ్యాయులను కలుపుకు పోకుండా, ఐక్యమత్యమే మహాబలమని తను చెప్పిన పాఠాన్ని తనే విస్మరించడం... ఏకాకిగా మిగిలిపోవడం... చివరకు మనుధర్మ శాస్ర్తం చెప్పినట్లు `నా కర్మ` అనుకుని కుమిలిపోవడం... ఇదీ నేటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల దుస్థితి..

    ప్రశ్న చచ్చినప్పుడు, ప్రశ్నించే తత్వం లేనప్పుడు లబోదిబోమని ఏడ్వడం, అన్యాయమైపోతున్నామని మొర పెట్టుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటావా? Sathwik Teja
    13 hrs · Like · 2
  • Sathwik Teja  aa prashnanu vaaru bhayapadi veyalekapoyaru but ten years vaatha petaaru cbn ni padellu duranga unchatam lo upadhyayula pathra keelakam ainadi
    13 hrs · Unlike · 1
  • Jagadish Kumar గుడ్... నేను కాదనను.. కానీ ఈ పదేళ్లలో జరగాల్సిన పని ఏమిటి? జరిగిందేమిటి?

    1. పాలకుడ్ని పక్కన పెట్టడంలో పాత్ర ఉన్న ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయం ఏం కావాలో ఆలోచించారా? ఆలోచించకపోతే తప్పు.

    2. ఆలోచించి మళ్లీ పాలకుల దయాదాక్షిణ్యాల కోసం వెయిట్ చేశారా? చేస్తే తప్పు.. 
    3. వెయిట్ చేయలేదు పోరాటాలు చేశారనుకుందాం... కలిసి చేశారా? విడివిడిగా చేశారా? సంఘాలు వేరయి ఉండొచ్చు.. సమస్యలు ఒక్కటే కదా... సమస్యల ప్రాతిపదికన కలిసి కొట్లాడొచ్చు కదా... కలిసి కొట్లాడకపోతే తప్పు.
    4. కలిసే కొట్లాడారనుకుందాం... పాఠశాలల్లో ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారా? విద్యార్థులున్నారు కదా? వారిని కలుపుకుపోయారా? ఎప్పుడైనా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు విద్యా వ్యవస్థ లోని సమస్యలపై కలిసి పోరాటం చేశారా? చేయకపోతే తప్పు..
    5. ఒకవేళ కలిసే పోరాటం చేశారనుకుందాం... దీనిని సామాజిక చర్చగా మార్చగలిగారా? కనీసం పిల్లల తల్లిదండ్రులనైనా ఇందులో ఇన్వాల్వ్ చేశారా? ఒకవేళ చేసి ఉంటే నేడు ఈ దుస్థితి ఉండేదా?

    ఉపాధ్యాయుడు తను సమాజంలో భాగమని, సమాజాన్ని కూడా ఎడ్యుకేట్ చేసుకుని, కలుపుకుపోవాలని తెలియకపోతే ఓట్లు, సీట్లు, దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడడం ద్వారా చేస్తున్న `కర్మ`కు ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంటారు.
    13 hrs · Like · 1
  • Pitla Sudhakar ప్రభుత్వ విధనాలు సరైన పద్ధతిలో లేని కారణంగా విధ్య ను కొనుక్కొవాల్సిన పరిస్థితి ఇది దారుణంగా తయారైంది ఇ వ్యవస్థలో !
    13 hrs · Unlike · 2
  • Sambasiva Rao Daggupati No detaining system. It is not clear whether students are of govt.school or private school.Foundation is not strong.Teachers responsible shall feel ashamed for students poor knowledge/standards.
    12 hrs · Like
  • Griddaluru Venkatanagarajarao ప్రభుత్వ రంగంలోని విద్యావ్యవస్థను పూర్తిగా కూలగొట్టి, ప్రయివేటు కార్పొ"రేటు" విద్యాసంస్థలకు దాసోహం చేసిన మన ప్రభుత్వ విధానాలను తప్పుబట్టల్సిందే? అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చెడిపోయినట్లుగా ఈ విద్యావిధానం మన ప్రక్క రాష్ట్రాల్లో కూడా లేదు. మన ప్రక్కనే వున్న తమిళ్నాడు రాష్ట్రంలో సర్కారు స్కూల్స్ చాలా బాగున్నాయి. మన రాష్ట్రాల్లో ఈ కార్పొరేటు విద్యాసంస్థలైన నారాయణ, చైతన్య, రత్నాలే ప్రధాన కారణాలు.....
    11 hrs · Unlike · 4
  • Amar Gandham karnudi chavuki sava laksha karanalu unnatlu govt.education ila vundataniki kuda chala reasons vunnai!1.primary education system darunam ga vundi,main ga govt.schools irregularity pillallo ekkuva,parents sariga pillallni pattinchukoru2.RTE act ki Tala toka ledu, ee Act UPA govt.system ki ichina bad gift. Teachers koratha ekkuva,eppudu Reports,records submitt cheyyamantaru...antha fraud,kaki lekkale teachers ani use ledu3.Discipline ga vunchalante pillalni bayamestundi,ekkada teachers mida action vuntundo ane bhayam,konchemaina bayam lekapote ela?4.Paniki malina education ministers,education values teliyani IAS officers,veeriki bhayapade Rjd's,DEO's, veeri mind set marali5.govt.Teachers complete effort pettakapovatam,rural areas lo oke voorilo tama pillalni private schls ki pampiste idi parents ki elanti message pampinatlu?6.Primary,up schools lo teachers ki monthly unnecessary training clases petti schools ni padu chesi final ga PRIVATE SCHOOLS ki benefit jarigela chustunna govte.main muddayi.inka chala vunai
    9 hrs · Like
  • Kusuma Rohini That's the standards we have
    9 hrs · Like · 1
  • Kameswara Rao Velpuri What APTF,UTF, STF and other teachers organisations are doing. I think these organisations and left parties are taking donations to run their parties and organisations.
    7 hrs · Like
  • Shiva S Madgula Baga kottaru mana bhavi tharala pina
    7 hrs · Like
  • Hariprasad Gundala drop out s yekkuva avuthaarani FAIL cheyatamledhu upto 9th dhaakaa,ilaa vunapudu standards alaane vuntaayi
    4 hrs · Like
  • Shiva S Madgula Kusuma Rohini garu it is standard we created.
    Jagadish Kumar what ever he said it absolute. I have association with educational system for about 14 years and parlelly 10 years with corporate. I find students from rural background have that cutting edge
     of logic and from Carporate schools communication and presentation.
    We experimented once by an escalated training program to 3 students from rural area where they could beat many campus selections than corporate.
    Otherside of the story is the competency level of teachers in govt and rural colleges are really the major drawback for student development.
    4 hrs · Unlike · 1
  • Jagadish Kumar ప్రియమైన Amar Gandham

    మీరు లేవనెత్తిన పాయింట్లు... వాటికి వివరణలు లేదా ప్రశ్నలు...
    1.primary education system darunam ga vundi,main ga govt.schools irregularity pillallo ekkuva,parents sariga pillallni pattinchukoru
    ప్రభుత్వ పాఠశాలలకు ఏ సామాజిక, ఆర్థిక తరగతికి చెందిన పిల్లలు వస్తారు? ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. అప్పుడే మనం చేసే కామెంట్లకు బలం వస్తుంది. ఈ దేశంలో 80శాతం మంది ప్రజానీకం మార్కెట్లో రోజుకు రూ.20లు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారు. ఇది నేను చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వ మానవవనరుల నివేదిక చెబుతోంది. ఇలాంటి ప్రజానీకం ఉన్న కుటుంబాల్లో పిల్లలు స్కూలుకు ఇర్రెగ్యులర్ గా కాకపోతే రెగ్యులర్ గా పోతారా? కారణం సింపుల్.. స్కూలుకు వెళ్తే పూట గడవదు. ఉపాధి, విద్య మధ్య బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం వల్ల మీకీ ఇర్రెగ్యులారిటీ కనిపిస్తుంది. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంలోనూ దీనినే అప్లయి చేసుకోవచ్చు. 
    - సౌకర్యాలు అన్నీ కల్పించినా, ఇంట్లో ఫుడ్డు లేకపోతే ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఈ లింకు అర్థం చేసుకోవాలి.
    - సౌకర్యాలు లేకున్నా, ఇంట్లో ఫుడ్డు లేకపోయినా బ్యాలెన్స్ చేస్తూ చదువుకునే వారు ఎప్పుడు స్కూలుకు ఇర్రెగ్యులర్ గా ఉంటారు.
    - సౌకర్యాలు కల్పించినా, ఇంట్లో ఫుడ్డు ఫుల్లుగా ఉన్నా రాకపోతే సోమరిపోతులంటారు. అలాంటి వారు ఎంత మంది ఉన్నారో చూడాలి.

    2.RTE act ki Tala toka ledu, ee Act UPA govt.system ki ichina bad gift. Teachers koratha ekkuva,eppudu Reports,records submitt cheyyamantaru...antha fraud,kaki lekkale teachers ani use ledu
    విద్యా హక్కు చట్టం మీద కోపమా? చట్టంలో ఉన్న లొసుగులపై కోపమా? లేదా ప్రభుత్వ చేతగాని తనాన్ని, చిత్తశుద్ధి లేని తనాన్ని మీరు ప్రశ్నిస్తున్నారా? అత్త మీద కోపం దుత్త మీద తీస్తే నష్టం... 

    3.Discipline ga vunchalante pillalni bayamestundi,ekkada teachers mida action vuntundo ane bhayam,konchemaina bayam lekapote ela?
    బడితెకు పని ఎప్పుడొస్తుంది? టీచర్లో సబ్జెక్టు లేకపోయినప్పుడు, పిల్లల్ని ప్రేమగా చూడలేకపోయినప్పుడు. పిల్లలు టీచర్ పట్ల గౌరవం ఎందుకు ప్రదర్శించడం లేదు? సినిమాలు, సీరియళ్లు టీచర్లను ఐటమ్ గాళ్లుగా చూపించి, కొంగు జార్చుకునే జాణల్లా చూపిస్తే పిల్లలు వారిని ఇంకే దృష్టితో చూస్తారు? పిల్లలు ఎందుకు నేర్చుకోవడం లేదు. ఇంట్లో, బయటా నేర్చుకునే వాతావరణం కాక బట్టీయం వాతావరణమే ఎక్కువ. వారి మెదళ్లు హీటర్ల కంటే అద్వాన్నమయిపోతున్నాయి. ఈ మూడు సెట్ చేయకుండా విద్యార్థులను శిక్షిస్తే ఎలా?

    4.Paniki malina education ministers,education values teliyani IAS officers,veeriki bhayapade Rjd's,DEO's, veeri mind set marali
    ఎవరు ఎవరికి భయపడాలి? జనంలో చైతన్యం లేకపోవడం వల్లే ఈ విద్యా వ్యవస్థ ఇలా ఏడ్చింది. జనంలో చైతన్యం రావాలంటే సాంస్కృతికోద్యమాలు రావాలి. విద్య పట్ల మమకారం ఏర్పడే విధంగా, అన్యాయాన్ని ప్రశ్నించే విధంగా, మూఢనమ్మకాలు, కర్మల పేరిట భరించడానికి వ్యతిరేకంగా జనంలో చైతన్యం తీసుకురావాలి. అప్పుడు అందరూ సక్కగా పనిచేస్తారు. మనం పనిచేయించకుండా, వాళ్లు చేయడం లేదని అంటే ఎలా? ఎప్పుడూ ఎవడో ఒకడు రావాలి.. ఉద్దరించాలి అనడమేనా? మన చేతుల్లో ఏమీ లేదా?

    5.govt.Teachers complete effort pettakapovatam,rural areas lo oke voorilo tama pillalni private schls ki pampiste idi parents ki elanti message pampinatlu?
    తమ పిల్లల్ని ఏ స్కూళ్లకు పంపాలో ఆ పిల్లల తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. అది వారి కుటుంబ విషయం. వారి భవిష్యత్తు విషయం. 
    అయ్యా తల్లిదండ్రులెవరైనా తల్లిదండ్రులే. ఎవరి తల్లిదండ్రులైనా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటారు.
    ఈ రోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపడం లేదంటే, అక్కడ ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయో? వాటికి కారణాలేంటో? వాటిని కదా చూడాలి. తప్పు ఒకరిదైతే శిక్ష ఇంకొకరికి ఎలా?

    6.Primary,up schools lo teachers ki monthly unnecessary training clases petti schools ni padu chesi final ga PRIVATE SCHOOLS ki benefit jarigela chustunna govte.main muddayi.inka chala vunai
    ఏ శిక్షణా లేకుండా పిల్లలన్ని శిక్షించే టీచర్లు కావాల్నా? వారితో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందంటారా? ఉపాధ్యాయులకు శిక్షణ ఉండొద్దంటారా? ప్రభుత్వమే ముద్దాయి అయితే వేటిల్లో ముద్దాయో వాటిపై నిలదీయాలి ప్రశ్నించాలి.. అంతేగానీ జలుబు చేసిందని ముక్కే కోసేసుకుంటామా?

No comments:

Post a Comment