ఉద్యమాలు, రాజకీయాలు బొంగు అంటే విద్యార్థులకు ఫ్యూచరుండదు. సప్పుడ్దాక సదువుకుంటే కాంపిటీషన్ వరల్డ్ లో నెగ్గుకొస్తరు. ర్యాంకులు కొడతరు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తరు. తల్లి దండ్రులను బాగ చూసుకుంటరు. గప్పుడే దేశం బాగు పడ్తది... అనే వాళ్లు చాలా మందే ఉన్నారు. నిజమే విద్యార్థులు సదువుకోవాలే.. కానీ సదువు`కొనే` పోటీలో సదువే లేకుండా పోతున్నది కదా? దీని గురించి ఆలోచించొద్దా.. దీని సంగతెందో తేల్చొద్దా? అయ్యా.... పిల్లలు ఈ రోజు నుంచి రాజకీయాలు తెల్సుకోకపోతే ఓటేసే ఏజెచ్చొన తరువాత రాజకీయ నిర్ణయం ఎట్ల చేస్తరు. పరిపక్వత ఎప్పుడొస్తది? ఎక్కడ్నుంచి ప్రారంభం కావాలే...? ఆ పరిపక్వత లేకపోతే సమాజానికి పనికొచ్చేట్లు విద్యార్థి తనను తాను మార్చుకుంటడా?
|
జెఎన్ యు విద్యార్థి ఎన్నికల్లో గెలిచిన ఎస్ ఎఫ్ ఐ నాయకులు (ఫైల్ ఫొటో) |
ఒక విద్యార్ధి సమాజానికి పనికి వచ్చేలా తన జీవితాన్ని ఎలా మలచుకోగలడు ..
మేధావులారా, మార్గం చూపించగలరా...
No comments:
Post a Comment