This is the power of Yoga and Meditation.
యోగి ప్రహ్లాద్ జాని, 1929 లో రాజస్థాన్ లో జన్మించారు. 1940 నుండి ఎటువంటి ఆహారము, నీరు లేకుండా జీవిస్తున్నారు. ఈయన 7 సం. వయస్సు నుండే ఎక్కువ సమయం అడవిలో గడిపేవారు. 11 సం. ల కల్లా దుర్గాదేవి భక్తుడయ్యారు. చిన్న వయస్శునుండే పూజలు, యోగ, ధ్యానం చేసేవారు. గుజరాత్ లో ఒక దేవాలయం దగ్గర్లోని ఒక గుహలో నివసిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తారు. పూజా కార్యక్రమాలు, రోజు మొత్తంలో ఎక్కువ సమయం యోగ, ధ్యానం తోనే గడుపుతారు.
2003 లో స్టెర్లింగ్ హాస్పిటల్స్, అహ్మదాబాద్ లో 30 మంది డాక్టర్స్(Sudhir Shah & Others) ఈ యోగి ని ఒక రూమ్ లో ఉంచి 15 రోజుల పాటు పరీక్షలు జరిపారు. రోజు ఉదయాన్నే 100ml నీరు మాత్రం పుక్కిలించుకోవటానికి ఇచ్చేవారు.. CCTV cameras అమర్చారు. 15 రోజుల తర్వాత అతని ఆరోగ్యం లో ఎటువంటి మార్పు లేదు. కనీసం టాయ్లెట్ కూడా వాడలేదు.
2010 ఇండియన్ మిలిటరీ(DIPAS), మరి కొన్ని సంస్తలు అతని మీద పరిశోధనలు జరిపారు. ఆశ్చర్యం, ఆయన ఆరోగ్యంలో ఎటువంటి మార్పులు లేవని చెప్పారు. ఆ వయస్సులో ఆయన ఆరోగ్యం ఒక 40 సం. ల కుర్రాడి ఆరోగ్యంలా ఉందని చెప్పారు.
ఈ పరిశోధనలు అన్ని CCTV cameras, పలుసంస్తలు, అనేక మంది సమక్షంలో జరిగినవే.
ఇది యోగ, ధ్యానం యొక్క గొప్పతనం.
No comments:
Post a Comment