సమాజంలో విభిన్న భావజాలాలను వ్యక్తీకరించే రచయితలపై భౌతిక దాడులు చేయడం సరైనదేనా? వీటిని వెనుక యావత్తు దేశ ప్రజలు ఉన్నారా? హిందూ మతం ముసుగేసుకుని కొన్ని మతతత్వ సంస్థలే ఈ దాడులకు తెగబడుతున్నాయా? ఇది నిజంగా యావత్తు హిందువులు హర్షించేదిగా ఉంటోందా? తమిళనాట రచయిత పెరుమాళ్ మురుగన్ పై దాడి నేపథ్యంలో జరిగిన చర్చ ఇది...
ఆర్ యస్ యస్ , విహెచ్ పి , భజరంగ్ దళ్ మొ ... సంస్తల చర్యలు హిందూ మతాచారాలను పాటించే నిజమైన భక్తులు సిగ్గుపడేలా చేస్తున్నాయి . .నచ్చని భావజాలాన్ని వ్యక్తీకరించే రచయితల ఫై భౌతికంగా దాడులు చేయటం సరైందా? నిజంగా మత సాంప్రదాయాలను అనుసరించే వారు చేయరు. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకునే వారే తమను మత రక్షకులనుకోవాలని , ప్రచారం కోసం దాడులు చేస్తారు..భావ జాలం నచ్చకపోతే విమర్సచేయండి . చర్చకు పెట్టండి . నచ్చితే ప్రజలు ఆమోదిస్తారు , నచ్చకపోతే తిరస్కరిస్తారు . అంతేకాని దాడులు చేయటం ఏమిటి ? వీరి చర్యలకు మరియు తాలిబాన్లు , ఆల్ఖైదా ఉగ్రవాదుల చర్యలకు పెద్ద తేడా కన్పించటం లేదు. ఏ మతమూ పరమత ద్వేషాన్ని భోదించదు.మతం సహనాన్ని బోధి స్తుంది .వీరికి మతం ఫై విశ్వాసం లేనట్టు స్పష్ట మౌతుంది .ఈ లాంటి సంస్తలకు మతానికి సంబంధం లేదని ప్రకటించాలి .ఈ దాడులు హిందూ సంస్కృతీ కాదు ,భారతీయ సంస్కృతీ అంతకంటే కాదు. ప్రజాసంస్కృతి కే భిన్నంగా వ్యవహరించే ఈ సంస్తల చర్యల ఫై ప్రజాస్వామికవాదులు స్పందించాలి.భవిష్యత్తులో ఇ లాంటి దాడులకు అవకాశం లేకుండా ప్రభుత్వం కటినమైన చర్యలు తీసుకోవాలి .
No comments:
Post a Comment