Sunday 4 January 2015

హిందూ ధర్మమే.. ఓ అధర్మం.. సమభావన లేదు.. కులాలను బట్టి అసహనం.. న్యాయతీర్పులు.. (చర్చ)

హిందూ ధర్మమే.. ఓ అధర్మం.. సమభావన లేదు.. కులాలను బట్టి అసహనం.. న్యాయతీర్పులు..
---------------------------------------------------------------------------------------------
హిందూమతం తన మతస్థులనే సమభావనతో చూడలేదు. కులాలవారీగా శిక్షను విధించింది. తక్కువ కులాలవారికి చెవులు, ముక్కు, చేతులు, పిరుదులు, స్థనాల నుంచి ప్రారంభించి తల దాకా తెగ్గోయడం ద్వారా ఆ శిక్షలుంటాయి. అదే ఎక్కువ కులం వారి ఒంటి మీద చిన్న గాయం కూడా చేయకుండా శిక్షలు విధించమంటాయి..
సహనం... అసహనం కూడా కులాలను బట్టి మారిపోతుంటుంది. దానిని అనుసరించే న్యాయం కూడా...
గతంలో నేనొక కామెంట్ చేశా.. రాముడు, శంభూకుడి గురించి... కొద్దిమంది వర్షన్లు, ఆధారాలు అడిగినట్లు గుర్తు... ఇక్కడ అవి కూడా ఇస్తున్నాను...
----------------------------------------------------------------------------------------------
మనుధర్మ శాస్ర్తం (మానవ సంహిత)... శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌజ్..
--------------------------
ఎనిమిదో అధ్యాయం --- క్రయ విక్రయాల విభాగం
10వ శ్లోకం ----ధర్మోపదేశం దర్పేణ విప్రాణామస్య కూర్వతః|| సప్తమసే చయేత్తైలం వక్ర్తేశ్రోత్రేచ పార్థివ||
తాత్పర్యం --- ఎక్కడో ఎవరో చెప్పిన కొద్దిపాటి జ్ఞానం చేత, అహంకారం పూని శ్రోత్రియ సద్ర్భాహ్మణునికే ధర్మ పన్నాలు చెప్ప సాహసించే శూద్రునికి చెవిలోనూ, నోట్లోను కాచిన సలసల మరిగేనూనె రాజు పోయించాలి.
11వ శ్లోకం --- ఏకజాతిర్థ్విజాతీం స్తు వాచా దారుణయాక్షిపన్| జిహ్వాయాః ప్రాప్నుయాచ్ఛేదం జఘస్యప్రభవోహి సః||
తాత్పర్యం --- శూద్రుడు ద్విజులను దారుణమైన పేర్లతో పిలిచినా తిట్టినవాని నాలుక తెగ్గోయాలి. అతడు బ్రహ్మదేవుని పాద జన్ముడు.
12వ శ్లోకం --- యేన కేన చిదంగేన హింస్యాచ్చేచ్రేష్టమంత్యజః| ఛేత్తవ్యం తత్తదేవాస్య తన్మనోరసుశాసనమ్||
తాత్పర్యం --- తనకంటే శ్రేష్టులైన బ్రాహ్మణులను, శూద్రుడు సాహసించి వారిపై తన అవయవం ఏది ప్రయోగించినా, ఆ శూద్రునికి ఆ అంగం ఛేదించాలి. కర్రతో కొట్టినా చేయి నరకాలి. ఇది మన్వాదులు విధించిన శాసనము.
14వ శోక్లం --- సహాసనమభిప్రేప్సురుత్కృష్టస్వాపకృష్టజః| కట్యాం కృతాంకో నిర్వాస్యః స్ఫిచం వా@- స్యాపక ర్తయేత్||
తాత్పర్యం---- బ్రాహ్మణుడితో సమాన స్థాయి ఆసనం ఆశించేవాడికీ, ఆ విధంగా కూర్చునే శూద్రునికీ నడుము మీద ఒక కర్రు గాల్చి వాత వేయాలి. అతని పెదవుల్ని కత్తిరించాలి.
---------------------------------------------
ఇదే అధ్యాయనంలో `బలాత్కారానికి` శిక్ష విభాగంలో..
ఇందులోనూ శూద్రులకు కఠిన శిక్షలు విధించిన మనుస్మృతి బ్రాహ్మణుడి పట్ల ఎటువంటి ధర్మం పాటిస్తుందో చూడండి..
12వ శోక్లం --- న జాతు బ్రాహ్మణం హన్యాత్సర్వపాపే ష్వపిస్థితమ్| రాష్ర్టాదేనం బహిః కుర్యాత్సమగ్రధనమక్షతమ్||
తాత్పర్యం --- సకల పాపములు చేసే బ్రాహ్మణుడిని వధించకూడదు. అతడిని అన్ని విధాలా నిర్ధనుణ్ని చేసి, ఒక్క దెబ్బనైనా కొట్టక కట్టుబట్టల్తో దేశాన్నుంచి వెళ్లగొట్టాలి.
13వ శ్లోకం --- సబ్రాహ్మణ వధాద్భూయాసన ధర్మొ విద్యత్ భువి| తస్మాదస్య వథం రాజా మనసా పిన చింతయేత్||
తాత్పర్యం--- ఈ లోకంలో బ్రాహ్మణ వధ కంటే మించిన గొప్ప అధర్మం ఇంకోటి లేదు. కనుక ప్రభువు బ్రాహ్మణ హత్యను మనస్సులోనైనా తలచరాదు...
------------------------------------------------
అయ్యా ఇదీ హిందూ కోడ్ ఆఫ్ లా అలియాస్ మనుధర్మ శాస్ర్తం చెబుతోంది. వీటిని బట్టి...
1. సమన్యాయం, సమభావన, సహనం అనేది మతంలోని వివిధ కులాలను బట్టి వాటికి మాత్రమే గిరికీసుకుని ఉండే అంశమని అర్థమవుతోంది. కులం రేఖ దాటితే దండనలే దండనలు...
2. పైవారికో న్యాయం.. కింది వారికో న్యాయం.. అదో పెద్ద అన్యాయం... కానీ అదే హిందూ ధర్మ న్యాయం...
3. తీర్పులు చెప్పాల్సిన వాడి దృష్టి సైతం కులాలను బట్టి ఉండాలని ఇంతబాగా విన్నవించుకున్న తరువాత కింది కులాలకు న్యాయం మేడిపండు లాంటిదని అర్థం కావట్లేదా?
---------------
చివరగా... ఇంత అసహనంతో, అన్యాయంతో, అమానవత్వంతో నిండి ఉన్న హిందూ మతం గొప్పదని చెప్పేవారు కచ్చితంగా అవతలి మతంలో `తలతీసేసుకోవాలి` వంటి పదాలుంటే వాటిని భూతద్ధంలో చూపిస్తారు. గురివింద గింజ చందానా...
Like ·  · 
  • Om Kiran I don't have time to read nonsense.. from partial to no knowledge ppl. no context, నీతి, సారంశం ఏది.. If you want to discuss, make simple and straight point..
    14 hrs · Edited · Like · 2
  • Jagadish Kumar నాయనా Om Kiran నీకు పేషన్స్ కావాలి... టైమ్ కావాలి.. అవతలివాడు చెప్పేది స్వీకరించగలగాలి.. అప్పుడే ఎబిసిడిలు, గ్రామరూ, ఆ తరువాత ప్రాబ్లమ్సూ, సొల్యూషన్సు తెలుస్తాయి.. 
    - లేకపోతే నీవు చెప్పేది సూర్ సెన్సు... అవతలివాడు చెప్పేది నాన్సెన్సు అవుతుంది... wakeup buddy...
    13 hrs · Like · 5
  • Om Kiran read again, you dont have idea on dharma at all and how can you expect me to listen to your assumed knowledge ??? thats why I said // from partial to no knowledge ppl. no context, నీతి, సారంశం ఏది.. //
    13 hrs · Like
  • Jagadish Kumar Om Kiran
    1. ఏది ధర్మం? ఏది అధర్మం? నీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పు. దేనిని నీవు ధర్మంగా స్వీకరిస్తావు? ఏది అధర్మం అంటావు? చెప్పు వింటా...


    2. ఇక అజ్యూమ్ నాలెడ్జి సంగతంటావా? ఉదాహరణలను చూపెట్టినా అజ్యూమ్ నాలెడ్జి అంటే పాపం నీవే దుస్థితిలో ఉన్నావో అర్థమవుతుంది. ముందు నీకళ్లకున్న గంతలు తీసేయ్... మెదడులో ఉన్న చెత్త తీసేయ్... ఉన్నదున్నట్లుగా చూడడం నేర్చుకో... హయ్యో సారీ... ఇలా మాట్లాడేశానేంటి? ఛ ఛ... నీవు ఎలా ఉండాలంటే అలాగే ఉండు. నీ ఇష్టం. నీ మెదడులో చెత్త ఉంటే నాకేంటి? నీ కళ్లకు గంతలుంటే నాకేంటి? ఒక్కటే బాధ నీవు మారవు. నష్ట పోతావు. నీకు తెలియకుండానే సమాజానికి నష్టం చేస్తావు... 

    3. ``thats why I said // from partial to no knowledge ppl. no context, నీతి, సారంశం ఏది.. //`` దీని భావమేమి ఓం కిరణేశా? నాయనా నాకు నాలెడ్జి లేదు. నేను ఎత్తి రాసింది మనుధర్మ శాస్ర్తం నుంచే. మనుధర్మ శాస్ర్తంలో ఉన్న శ్లోకాలు నేను రాసినవి కావు. మనువే రాశాడని చెబుతున్నారు. వాటి తాత్పర్యాలు నేను రాసినవి కావు. శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం... ఆ పుస్తకం నేను ప్రింట్ వేయలేదు.నవరత్న బుక్ హౌజ్ వేసింది..

    4. పోనీలే. మహానుభావా...! ఓం కిరణేశా... నీవు పూజ్యడవు, పుణ్యాత్ముడవు, గొప్పవాడివి, ధర్మాధర్మ సూత్రాలు తెలిసిన అపరమేథస్వివి, మేథస్సే లేని మా లాంటి వాళ్లను వదిలేయి తండ్రి... నీ దృష్టిలో నాకున్నది పాక్షిక మేథ. అదేమో ఉన్నది ఉన్నట్లుగా చూడమంటుంది. నీలాగా దివ్వ దృష్టితో చూడడం రాదు తండ్రి.. నీతి, సారంశం మనుషులను బట్టి, కాలాన్ని బట్టి, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి, రక్త సంబంధం బట్టి, కుటుంబాన్ని బట్టి, బంధుత్వాన్ని బట్టి, ఇష్టాఇష్టాలను బట్టి, చట్టాలను బట్టి... ఉఫ్... ఇలా చాలా వాటి `బట్టి` మారిపోతుంటుందని నేననుకుంటున్నాను. నీవు చెప్పే ధర్మం స్థిరంగా ఉంటుందని, జడపదార్థమని, అందరికీ ఒక్కటే వర్తిస్తుందని నాకు తెలియదు స్వామి.. కొంచెం జ్ఞానోదయం కల్గించు సామి..

    5. లెంథీ డిస్కషన్స్ ఇష్టమని చెప్పే మహానుభావా..! ఇది సాంతం చదువుతావని ఆశిస్తున్నా.. అజ్ఞానుడినైన నన్ను నీ జ్ఞానామృతం వంటి, నీకే అర్థమయ్యే నాలుగు ఇంగ్లీషు ముక్కల వాక్కులతో జ్ఞానవంతుడ్ని చేస్తావని ఆశిస్తున్న...
    12 hrs · Like · 4
  • తిరుమలెష్ రాసురి lol he wont come back because he don't know the truth, he follows what they told(BOSS) to him, he will do it through commands by Boss, he is Paid PRACHARAK in Social media. evan he is not doing proper work for the job(In Social media) lol . by the way he won't change....if you show him evidences also, because paid Account.
    9 hrs · Edited · Unlike · 1
  • Sai Krishna Chaitanya Hindu darmam adarmam aithe asalu darmam ento cheppu darmam ante ento cheppu... Feeling depressed.. Mee telivi antha desam kosam pettandi boss.. Vidweshalu recha kottadaniki kadu.
    8 hrs · Like
  • Jagadish Kumar Sai Krishna Chaitanya విద్వేషం.... ఎవరి మీద? ఎవరెవరి మధ్య? ఇప్పుడు నే రాసింది కూడా దేశం కోసమే...
    8 hrs · Like · 1
  • తిరుమలెష్ రాసురి వీళ్ళని మార్చింది ఎవరు?
    8 hrs · Unlike · 1
  • Jagadish Kumar విద్యార్థులు పసి వారు.. వారిలో `అంటరానితనం` అని విషపు బీజాలు పడ్డాయంటే దానికి ఈ వ్యవస్థ మొత్తం కారణం. ఇప్పటికైనా రిపేర్ ఇలా జరగాలి.

    1. అంటరానితనం ఎందుకు నేరమో ఆ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. గ్రామస్థాయిలో కుల ఆధిపత్య పోరు, లేదా అణిచివేతను వ్యతిరేకి
    ంచే పోరు.... వారి తల్లిదండ్రులు ఏ పాత్రలో ఉన్నారు అనేదానిపై వారి పిల్లలకు ఈ విషయం చెబుతారా? చెప్పరా? అనేది ఆధారపడి ఉంటుంది.

    2. పాఠశాలలో ఉపాధ్యాయులైనా అంటరానితనం అమానుషం అని చెప్పాలి. దానిని వివరించాలి. ఉపాధ్యాయుడికి ఉన్న సామాజిక దృక్పథం ఎలాంటిది? తను నిర్వహిస్తున్న వృత్తిని ఆర్థిక, సామాజిక కోణాల్లో ఎలా అర్థం చేసుకున్నాడు? అనే దానిపై ఉపాధ్యాయుడి బోధన సారాంశం ఆధారపడి ఉంటుంది.

    3. పాఠశాల పై స్థాయిలో ప్రధానోపాధ్యాయుడు తన విద్యార్థుల్లో ఉన్న ధోరణులను గుర్తించి సవరించేందుకు ప్రయత్నం చేసి ఉండాల్సింది. అయితే ఆ ప్రధానోపాధ్యాయుడు తన వృత్తిని ఏ కోణంలో చూస్తున్నాడు? అతనిపై ఉన్న సామాజిక ఒత్తిళ్లు ఎలా ఉన్నాయి? అనే అంశాలు అతని పాత్రను ప్రభావితం చేస్తాయి.

    4. ఇక ఎంపిపి, ఎంపిడిఓ, ఎంఇఓ, సర్పంచి, ఉపసర్పంచి ఇంతమంది కలిసి ఆపుదామని ప్రయత్నించినా విద్యార్థులు ఆగలేదన్నది ఇదే వార్తలో ఉంది. ఆపూటకు వార్తల కోసం, పబ్లిసిటీ కోసం చేసే ప్రయత్నాలైతే విద్యార్థులు కోడి పిల్లల్లా తలోదిక్కు పారిపోయి నిజంగానే వార్తా వస్తువులవుతారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడబలుక్కుని విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి, ఇలాంటి ధోరణులు పునరావృతం కావని చెప్పాలి. వారికి కనీసం ఆ ఆలోచన వచ్చిందా? లేదా? వారికి ఆ స్పృహ ఉందా? పబ్లిసిటీ స్పృహ కంటే సామాజిక స్పృహ పై చేయి సాధించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.

    5. చివరగా, గతంలోనే ఇలాంటిది జరిగింది. ఇది పునరావృతం అయ్యిందన్నప్పుడు జిల్లా కలెక్టర్, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు, ప్రభుత్వం ఏమి చేస్తోంది? అంటరానితనం, అస్పృశ్యత పై పాలకులు కఠినంగా వ్యవహరించగలిగితే పాఠశాల స్థాయిలో ఇలాంటివి రిపీట్ అవుతాయా?
    8 hrs · Like
  • Sai Krishna Chaitanya Manchi chepe vippatam idi kadu sir. meeru manchi cheppalani unte manishi ela undalo cheppu chalu ante kani Ila kadu
    7 hrs · Like
  • Sai Krishna Chaitanya Ayna mahabaratam prakaram thagudu thappu. Adavarini gouravinchaka povatam ante pathname... Joodham, asatyam adatam kuda thappe.. Ivvanni manchi mataladathava kada boss..vatitho evarinaina Marchagalaremo chudandi
    7 hrs · Like
  • Sathwik Teja purva kalam lo sukshma jivula valla oche rogalaku mandulu leka chala mandi chanipoyevaru,asalu sukshma jivulu unai ani telistega,chiken pox ni amma varu anevaru, shapam ani saripetukunevaru

    daanni "kaala dharmam" ani cheppatam thappa sanaa
    thana dharmam chesindi antu em ledu 

    ade science anweshana tho aa rogalaki mandulu kanipetabadi 
    aa "akaala kaala dharmaalu" duram ayai 

    science mundu sarva dharmalu,mathaalu nothing 

    telisi teliyani varu matrame dharmam,kharmam ane bhraanthi lo munigipotaru 

    varini evaru kapadaleru
    5 hrs · Edited · Unlike · 1
  • Jagadish Kumar U r right Sathwik Teja.... 

    1. Ayya Sai Krishna Chaitanya garoo... nenu cheppe vidhanam lo tappemiti... prasnichamantunnanu... adi tappu avutunda..? 


    2. meeru cheppe mahabhaaratam lo Manchi vetakadam ante gongatlo annam tinna chandamga untundi... Mahabharatam anedi neeku timmini bammi cheyadam, anyaayaanni kooda nyaayam ani cheppinchadaaniki brahmaandanga panikostundi... Check it..
    5 hrs · Like
  • Srinath Bairu Gangaputra Jai Sree Ram........ I really really Proved of Being Hindu.... Epudo jerigindani gurinchi matlaaku alla jerigindi kabate gandhi ji ambedkar tho rajagam rainchadu.... nenu Bc ki chendina vadini peda kulaniki kadu kani naa mathani nenu istapaduthanu and vere mathani gouravisthanu
    4 hrs · Like · 2
  • Sai Krishna Chaitanya Maataladhemundi sir galilo kalilo kalisipithay... Samajanni marchataniki nenu sidhamga unnanu.. Konni pranthallo thandre koduki thagamani dabbulivatam chusanu..ratri nidra kuda pattatledu sir.. Idi ye rakanga nyayam.. New yr roju bus lo vinnanu.. Koduku amma ki ph chesi antunna matalu "amma frns tho vasthunnaru eppatlane newyr party chesukuntam daba paina.. Beerle le... Ha avanni meme arrange chesukuntam le.. Nannani kindachesukumanu memu paina chesukuntam"... chee anipinchindi. Thalli mundu matladalsina matala avi.. Lets fight against alcohol sir.. Ramayanam, mahabarathalu thappu antunnaru ga.. Kotha pustanni maname radham sir, hindu darmame adarmam kada.. Darmam edo janalaki cheputham sir...
    3 hrs · Unlike · 1
  • Bala Krishna Cherupally neeku telisi evariki kosaaru ..mee intlo evfaraikaina kosaaraa... nuvvu chusaavaa...konchem burra pettru
    3 hrs · Like
  • Om Kiran తిరుమలెష్ రాసురి only idiots assume 'toooooo' much and give reasons too supporting their assumptions  

    ***so as I came back so your reasoning on 'because' in own your words are 'wrong' //lol he wont come back because he don't know the truth, he fol
    lows what they told(BOSS) to him, he will do it through commands by Boss, he is Paid PRACHARAK in Social media. evan he is not doing proper work for the job(In Social media) lol //

    ***again in your own words since mine is NOT a paid account again your statement is wrong.// by the way he won't change....if you show him evidences also, because paid Account.//
    2 hrs · Like
  • Jagadish Kumar గుడ్... Om Kiran నీవు క్లారిఫై చేసినందుకు.. నీలో నాకు నచ్చిందదే... నువ్వు సూపర్బ్... తిరుమలెష్ రాసురి మీరు కూడా సబ్జెక్టు మీద మాట్లాడితేనే మంచిది... మీ ఇద్దరికిది నా సలహా మాత్రమే.. మాట్లాడేది, మాట్లాడకపోయేది మీ ఇష్టం...
    2 hrs · Like
  • Jagadish Kumar ఐ లవ్ యు.... Srinath Bairu Gangaputra నీవు ఏ మతాన్ని ఇష్ట పడతావో నీ ఇష్టం. నీ గర్వం నీ వ్యక్తిగతం. నో ప్రాబ్లం. వేరే మతాన్ని గౌరవిస్తానని చెప్పావు చూడు అది బాగా నచ్చింది. ఇప్పుడది లేకనే ఈ దేశంలో మత చిచ్చు రగులుతోంది. అయితే నా మతమే గొప్పది, ఇతర మతాలు చిన్నదంటూ లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చెప్పినప్పుడే అసలు సమస్య మొదలవుతోంది. ఏదేమైనా నీవు నీ మాటకు కట్టుబడి ఉంటావని ఆశిస్తున్నా...
    2 hrs · Like
  • Om Kiran Jagadish Kumar Srinath Bairu Gangaputra //వేరే మతాన్ని గౌరవిస్తానని చెప్పావు చూడు అది బాగా నచ్చింది//

    Please help me how you can 'respect' this below so that I may also try to follow and respect.
    ...See More
    1 hr · Edited · Like
  • Om Kiran Sai Krishna Chaitanya ధర్మం ఎదో ప్రేత్యకమిన పదం కాదు ఇంతక ముందు భారతదేశం లో అందరు మాములుగా వాడెపదమే.. 
    Example: తెలుగు మీడియం రాసిన పదార్దాల రసాయన "ధర్మం", ఐస్క్యూబ్ ధర్మం ఘన పదార్దం, same water if burnt above boiling point ఆవిరిగా మారడం దాని ధర్మo,
     పోలీస్ ధర్మమా దొంగలను పట్టుకోవడం 
    from telugu wiki:
    http://te.wikipedia.org/.../%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0...

    reg ur comment; //Hindu darmam adarmam aithe asalu darmam ento cheppu darmam ante ento cheppu//
    కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో విస్తారంగా లభించే ఒక వాయువు. దీన్నే బొగ్గుపులుసు వాయువు లేదా కర్బన ద్వి ఆమ్లజని...
    TE.WIKIPEDIA.ORG
    1 hr · Like
  • Om Kiran Sai Krishna Chaitanya you don't have to feel depressed, for 'others' actions, instead reason it and don't take to personal.. 

    సత్వంవేషణ్ సర్వ సంఘ పరిరక్షణకు: so truth, fact comes out of news, you can't hide at the same time a trust that NOT coming to
     news or hidning due to political correctness is also danger so..

    in social media we got a chance to explore the 'truth' factual info that is useful to 'ALL' sections not one person, one group or one community but but only for all.. 

    Similar way, if Islamic or other religion is demand harm others just because of their 'belief' is not on certain. then hiding that is also 'danger' .. hiding it is passing the problem to our children as its going to come sooner or later... 

    reg //Feeling depressed.. Mee telivi antha desam kosam pettandi boss.. Vidweshalu recha kottadaniki kadu.//
    1 hr · Like
  • Bala Krishna Cherupally nee bonda emi telusu neeku
    1 hr · Like
  • Jagadish Kumar Sai Krishna Chaitanya you are right...
    మద్యపానం వ్యసనంగా మారితే కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఛిద్రమవుతాయి. జీవితాలూ నాశనమవుతాయి. 


    1. మద్యపాన వ్యతిరేక చైతన్యం ప్రజల్లో వచ్చినప్పుడు దీర్ఘకాలంలో దీనిని నిలువరించొచ్చు.

    2. మధ్యస్థ కాలంలో.... ప్రభుత్వం కట్టడి చేయొచ్చు. మద్యంపై వచ్చే ఎక్సయిజ్ ఆదాయాన్ని వదులుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు. కాబట్టి విచ్చల విడి మద్య సేవనం పెరిగిపోతోంది. 

    3. తక్షణం చేయదగ్గదైతే.. మనింట్లో ఎవరైనా వ్యసనానికి బలైపోతుంటే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అయితే వ్యక్తి అభిప్రాయాలను, స్వేచ్ఛను నియంత్రించాలని చూస్తే అది మనకు తెలియని దారులు వెతుక్కుంటుందన్న విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. పట్టు విడుపులుండాలి.

    4. చేయకూడనిది.. బాధ పడుతూ కూర్చోవడం.. లబోదిబోమని మొత్తుకోవడం.. దీనికి పరిష్కారం కోసం మత గ్రంథాలు వెతకడం.. విలువలు పాడైపోతున్నాయనే పేరిట మోరల్ పోలీసింగ్ చేయడం.. వీటినెందుకు చేయొద్దు అని అంటున్నానంటే... బాధపడుతూ కూర్చుంటే బాధ పడ్డవారికి డిప్రెషన్. లబోదిబోమని మొత్తుకుంటే పరిష్కారం దొరకదు. మన మత గ్రంథాలన్నీ సురాపానాన్నీ కీర్తిస్తూ గానం చేసినవే. మోరల్ పోలీసింగ్ చేస్తే దానిని రెచ్చగొట్టి పెంచిన వారమవుతాం...

    5. నీవు చెప్పిన ఉదాహరణలో కొడుకు తల్లితో చెప్పుకోగలుగుతున్నాడంటే వాడు నియంత్రణలోనే ఉన్నాడని అర్థం. తల్లి సైతం తన కొడుకుతో ఆ మాటలు మాట్లాడిందంటే అభిప్రాయాలకు గౌరవమిస్తుందని దాని అర్థం. ఈ రెండూ మన సమాజానికి కావాలి. ఇవి లేకే ఇంట్లో అబద్దాలు.. వాకిట్లో తందానాలు..
    38 mins · Edited · Like
  • Om Kiran we have some many diff tangent topics we are crossing over.. in this ..
  • Jagadish Kumar నీవు చెప్పిన అంశాలకు వస్తున్న ఓపిక పట్టు Om Kiran

    విపరీత బుద్ధి.. వినాశకారి... మతోన్మాదం... మానవత్వానికి చేటు...
    ...See More
  • Bala Krishna Cherupally jagaidsh kumar pakkodi raatalu kmaadu nee sontha trelivi entol cheppu
  • Bala Krishna Cherupally jagadish kumar nee laanti vedavalu ee desham lo boledu...em chestaam nee baada enti..hinduvulanu ee nundi tarimeddaaama
  • Om Kiran I stopped reading right on your #1 // 1. ఏ మతం మరొకరిని చంపాలని చెప్పదు.// 
    you know that a BIG WRONG, right?? or you want me to 'prove' it 
  • Jagadish Kumar ముందు మొత్తం చదువు.. మధ్యలో ఆపేస్తే... లాభం లేదు... Om Kiran
  • Om Kiran you know i don't read nonsense.. lets go one at a time.. else we loose focus in big big text .. unless you agree thats a 'wrong' statement.. OR prove your right? I can prove other wise
    11 mins · Edited · Like
  • Jagadish Kumar Bala Krishna Cherupally గారూ... మీరు నా గురించి అంత కరెక్టుగా ఎలా చెప్పారు... మీ లాంటి వారు నన్ను పొగిడితే తప్పు గానీ తిడితే ఎంత మాత్రమూ కాదు. మీతో తిట్టించుకోవడం దీవెనలనుకుంటా... మీరు తిట్టడంలో ఏ మాత్రం తగ్గొద్దు.. సూపర్....

    1. పక్కోడి రాతలు ఎత్తి రా
    స్తే ఫలానా వాడు రాశాడని చెప్పుకుంటాను. ఇవి పూర్తిగా నా రాతలే...

    2. అన్ని మతాల వారు సామరస్యంతో కలిసి ఉండాలన్నది నా అభిమతం. భారత రాజ్యాంగం ఏది చెప్పిందో నేను అదే చెబుతున్నా... మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా అది మానవత్వాన్ని, మానవజాతిని హననం చేస్తుంది. ఇదే చెబుతున్నా... 

    ఇవి నా వరకు క్లారిఫికేషన్లు...
    8 mins · Like
  • Jagadish Kumar నాయనా Om Kiran నీకు `టైము పేషన్సు ఉండాలి`... `లెంథీ డిస్కషన్` కు సిద్ధపడాలి. లేకపోతే ఇతరులు చెప్పేదంతా నీకు నాన్సెన్సు అవుతుంది. నీవు చెప్పేది సూపర్ సెన్సు అవుతుంది...

    ఈ మాటలు ఇంతకు ముందే చెప్పాను. కాబట్టి నీ `నాన్సెన్స్` గోల నీ ఇష్టం....

1 comment: