----------------------------మతం....హింస.. అహింస... సైన్సు-----------------------------
మతాల గురించి మాట్లాడుకుంటూ.... హింస... అహింస గురించి మాట్లాడుకోవడం అంటే గొంగట్లో అన్నం తిన్నట్లే లెక్క.. మతాన్ని, పాలకులను, సైన్సును విడదీసి చూసే వాళ్లంతా ఇదే తప్పు చేస్తున్నారు.
1. మతం అనేది మూఢ విశ్వాసం. ఆ మూఢ విశ్వాసం మత్తు మందులా మారి మనిషిని భ్రమింపచేస్తుంది. కళ్లకు గంతలు కడుతుంది. వాస్తవాన్ని చూడనివ్వదు. సైన్సు ఆ గంతలు విప్పుతుంది. ఉన్నదున్నట్లు చూడనిస్తుంది.
2. మూఢ విశ్వాసం వ్యక్తికి మాత్రమే పరిమితమైతే తక్కువ నష్టం. అదే సంఘానికి పాకితే యావత్తు సంఘం, లేదా సమాజం ఆ మూఢవిశ్వాసం లో పడి కొట్టుకుపోతే అభివృద్ధి వైపు ఒక్క అడుగు కూడా పడదు. ఈ రెండు నష్టాలు జరగకుండా సైన్సు తీరుస్తుంది. అయితే దానికి అవకాశం ఇవ్వాలి. రుజువులను చూసేందుకు సిద్ధపడాలి.
3. సైన్సు అభివృద్ధి అయితే ప్రశ్నించడం అభివృద్ధి అవుతుంది. ప్రశ్నించడం అభివృద్ధి అయితే సమాజం నడుస్తున్న మార్గం గురించి ప్రశ్నించడం షురు అవుతుంది. సమాజ పురోభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న అన్ని అంశాలనూ అది తులనాడుతుంది. వాటిని ధ్వంసం చేయాలంటుంది. పూర్తిస్థాయి మానవ వికాసాన్ని కోరుతుంది.
4. సమాజాన్ని పాలిస్తున్నవారు లుటేరాలు, సంపద పోగేసుకునేవాళ్లు అయ్యారనుకుందాం. వారు ఇలాంటి సైన్సును పెంచి పోషిస్తారా? గొంతు నొక్కేస్తారా? రెండో పనే చేస్తారు. వారికి కావాల్సిందేమిటి? వారి సీట్లు కాపాడుకోవడం. `వ్వవస్థను ఉన్నదున్నట్లుగా ఉంచడం` వారికి కావాలి. అప్పుడే వారు బతగ్గలుగుతారు. `వ్యవస్థ ఇలా ఎందుకుంది?` అనే ప్రశ్న ప్రారంభమైతే వారికి కష్టం. దీనికోసం మతం అనే మూఢవిశ్వాసాన్ని ఓ మాస్ హిస్టీరియాలా మార్చి సమాజం మొత్తం ఆ మత్తులో దిగేట్లు చేస్తారు. ఆ మత్తును ప్రశ్నించినవారిని దేవుడ్ని ప్రశ్నించడంగా ముద్రేసి శిక్షలు విధిస్తారు.
5. అయ్యల్లారా..! అమ్మల్లారా!! మతం అనేది విశ్వాసం స్థాయి నుంచి పాలకుల చేతుల్లో ఆయుధంగా ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచే శిక్షలు వచ్చాయి. తొలి బైబిల్ లో భూమి బల్లపరుపుగా ఉందనుకున్నారు. గెలిలీయో శకం తరువాత భూమి గుండ్రంగా ఉంది శూన్యంలో వేలాడుతుంది అని సవరించుకున్నారు. మత విశ్వాసాన్ని ఛాలెంజ్ చేసినందుకు గెలీలియోను చంపేశారు. సైన్సు గురించి మాట్లాడుతున్న వారందరికీ ఈ భూమిమీద జీవితం లేకుండా చేయడం `మాస్ హిస్టీరియా` పోషకులకు అవసరం.
6. బైబిల్ లో తండ్రే పిల్లల్ని చంపుకుంటాడు. ఖురాన్ లో తమ మతాన్ని నమ్మని వారిని చంపమంటున్నారు. హిందూ ధర్మ శాస్ర్తాల్లో ధర్మాన్ని ప్రశ్నించని వాడిని, ఎదురుతిరిగే వాడిని నానా హింసలు పెట్టమంటున్నారు. శిరచ్ఛేదనం చేయమంటున్నారు. మూఢవిశ్వాసాన్ని ప్రశ్నించే, ధర్మ సూత్రాలకు ఎదురుతిరిగే, సైన్సును నమ్మే, మనిషిని శిక్షించాలనుకుంటున్నారు. దానికి ఏ మతమైతే ఏంది? మతం అనేది సమాజాన్ని అణిచి ఉంచేందుకు పాలకుల చేతుల్లో ఎఫెక్టివ్ ఆయుధం.
7. ఈ విషయాన్ని మనం గుర్తిస్తే మతపరంగా ఫలానా గ్రంథంలో ఏం చెప్పారు? దానిలో హింస ఏ స్థాయిలో ఉంది? వంటి అంశాలు చర్చకు రావు. దాని స్థానంలోనే `మానవత్వాన్ని బతికించేందుకు`, మానవుడు సర్వతోముఖాభివృద్ధి చెందేందుకు, నిజమైన మానవ వికాసానికి అడ్డు పడుతున్న మత గ్రంథాల అస్తిత్వం, దానిని అస్తిత్వంలో ఉంచుతున్న భాగోతాల గురించి చర్చకు వస్తాయి... మన సమాజానికి ఇప్పుడు ఇవే కావాలి.
No comments:
Post a Comment