Wednesday, 18 February 2015

విద్యుత్ ఛార్జీలు .... వామపక్షాల డిమాండు... వాస్తవాలు

విద్యుత్ ఛార్జీల గురించి ఓ మిత్రుడు చేసిన పోస్టుపై నా కామెంటు  ఇది. అయితే ఈ కామెంట్లు పెడుతున్నప్పుడు  సదరు మిత్రుడో లేదంటే మరెవరో స్పామ్ అని రిపోర్టు చేయడం జరిగిపోయింది. నేను  చేసిన శ్రమ వృధా కాకూడదని దానిని ఈ బ్లాగు పోస్టు రూపంలో సేవ్ చేస్తున్నాను గమనించగలరు.



Timeline Photos



"1. అధికారపక్షం దుర్మార్గమైనది, దుష్టపాలన చేస్తుంది. బూర్జువా మనస్తత్వంతో పెట్టుబడిదారుల కోరల్లో చిక్కుకుపోయింది. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప. ఎర్రజెండా విముక్తికి బాట. తాడిత, పీడిత ప్రజల విముక్తికోసం నడుంకట్టాలి.. కార్మిక కర్షకుల ఐక్యత వర్థిల్లాలి. సమాజంలో 70% ఉన్న కూలీల హక్కులకోసం కదలి రండి ఎర్రజెండా రెపరెపలతో........... // .. ....../// .... .." మాలాంటివారూ చిన్నప్పుడు భారత విద్యార్థి సమాఖ్య అంటే ఊగిపోయేవారం. కలసినడిచాం. ఆనాడున్న పరిస్థితులవి. కానీ కాలం మారిందని గ్రహించండి. వామపక్షాలూ మీరు అసలు మారరా?
.
2. సమాజంలో ప్రాథమికరంగం ప్రాధాన్యత రోజు రోజుకీ తగ్గుతోంది. ప్రతీదీ ఆలోచించే మధ్యతరగతి పెరుగుతోంది. వామపక్షాలూ ప్రతిపక్షమంటే కేవలం విమర్శించడమేనా? అసలు విద్యుత్ రేట్లు పెంచకూడదంటే.. పెంచకూడదనే ఉద్యమాలే! కానీ ఎందుకు పెంచకూడదో వివరించారా?మీ పాలిత రాష్ట్రాలలో అసలు ఏ రేట్లూ పెంచలేదా? ఒక సమస్యపై పోరాడేటప్పుడు దానికి పరిష్కారాలు చూపించాల్సిన బాధ్యత కూడా బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలుగా మీ మీద ఉందని మరువకూడదు కదా? మీ మీద గౌరవం లేకపోలేదు. ఈ దేశంలో ప్రభుత్వ సంస్థలు కాపాడబడటానికి, అత్యయికపరిస్థితి సమయంలో ప్రజాస్వామ్య హక్కులు కాపాడటానికి (సిపియం1971-77), సాధ్యమైనవరకూ నీతి నిజాయితీలతో నంబూద్రిపాద్, అచ్యుతమీనన్, నయనార్, నృపేన్ చక్రవర్తి, జ్యోతిబసు, దశరథదేబ్,బుద్దదేవ్ భటాచార్య, మాణిక్ సర్కార్ లాంటి ముఖ్యమంత్రులుండగా వామపక్షాలు పాలన సాగించారు. భాజపా, కాంగ్రెస్ రెండూ రైటిస్టు పక్షాలుగా ఉన్న నేపథ్యంలో వామపక్షాలుగా మీ పాత్ర పోషించాలి. కానీ పాతచింతకాయపచ్చడిలా(ఈ మాట అనవలసివచ్చినందుకు అనుకోవద్దు) ఎప్పుడూ ఈ బూర్జువాలనో మరొకటనో గుడ్డిగా(చైనా/రష్యాలలో పరిస్థితి ఎలా ఉందో గమనించండి. మీరు ఇప్పుడు మొదటగా కార్మికుల హక్కులకోసం అక్కడ ఉద్యమించాలి) వ్యతిరేకించకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారని, ఉద్యమిస్తారని కోరుకుంటున్నాను.

3. ప్రతిపక్షాలు చేసే అన్ని ఆరోపణలూ సరైనవని అనలేము. కానీ ఏ రేటుకి విద్యుత్ ఎక్కడ కొంటున్నారో, అలాగే బొగ్గు దిగుమతులలో రేటు, కాలరఫిక్ విలువ, అసలు వాడకం ప్రతీదానికీ పక్కా లెక్కలతో పారదర్శకతతో అంతా ప్రజలకు తెలపాలి. ఆ క్లోజడ్ డోర్ పాలసీలు ఇకచెల్లవు. ఇది ప్రశ్నిస్తే పరిస్థితులు ప్రమాదకరం అనే పరిస్థితినుంచి తప్పించి పాదరర్శకత పెంచుతారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలని కోరుతున్నాను. అలాగే వామపక్షాలు మరియు ప్రతిపక్షాలూ, ఎపిలో యూనిట్ కొన్ని పైసల నుంచి రూ.2.50 (ఫిక్సడ్ కాస్ట్) వచ్చే విద్యుత్ పోగొట్టుకుని బయట 5.50 నుంచి 8 రూపాయలవరకూ విద్యుత్ కొన్నా మీకు ఫరవాలేదా? అటు లోపాలూ పూడ్చకుండా, ఆదాచేయకుండా దశాబ్దాలు రేటు పెంచకూడదంటే సరైనది కాదు కదా? వాస్తవాలు వివరిస్తా డిమాండ్ చేయాలి. 24 గంటల టాగ్ కోసం ఎన్ని వేలకోట్లు అధికంగా నష్టపోతున్నామో తెలుసుకోవాలి. సమయానికి బొగ్గు అందిస్తూ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తగ్గిపోకుండా చూసుకోవాలి. $4.2(btu) కే గాస్ విద్యుదుత్పత్తి కేంద్రాలకి అందిస్తూ పారదర్శకంగా విద్యుత్ కొనుగోలు చేయాలి. భవిష్యత్తులో ప్రభుత్వరంగంలో విద్యుత్ కేంద్రాలు ఎక్కువగా పెట్టాలి. అందుకని ఆ ముఖ్యమైన విషయాలతోపాటు నష్టాలను తగ్గించి ఆదాచేయడం, పీక్ లోడ్ డిమాండ్ తగ్గించడానికి సూచనలతో ఒకసారి వాస్తవాలపై దృష్టి పెట్టి ఉద్యమించండి. - చలసాని
Like ·  · Share · 19 hrs · Edited
  • 43 people like this.
  • Thirumal Prasad Patil ఈ మధ్యకాలంలో వీళ్ళ ఉద్యమాలన్నీ కూడా ఏదో "ఇంకా మేమున్నాం" అని చెప్పడానికే తప్ప, చిత్తశుద్ధి ఉన్నట్లు కనపడదు..!!
    19 hours ago · Like · 2
  • Khadar Mohammed Communist gurinchi matladatam anavasam, tala toka leni asamardulu veellu, dabbu dandukune veellu evari gurunchi matladataru
    19 hours ago · Like · 5
  • Lokesh Vanapalli ప్రజలపక్షాన నిలిచిపోరాడేది ఇప్పటికీ వామపక్షాలే. కానీ వాస్తవాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి !
    18 hours ago · Like · 1
  • Venkat VenkateswaraRao Vaallalonu raajakiya cheeda purugulu pravesimchaayi

    vaama pakshaala mind set maari, chaithanya vanthamainaa, dhandhaalu chese gallee leadars kante veru gaa undadhu..
  • Gulam Hussain Khadar mahammad lanti samaja spruha leni vallu ilanti comments chestaru. ituvanti cheeda purugulu undabatte e samajam ela cheeda pattindi ituvanti cheeda purugulni eri pareyavalasina avasaram enthina undi
    16 hours ago · Like · 1
  • Naresh Siramani Lokesh Vanapalli , prajala pakshaana kaadu, udyogula pakshaana, panidongala pakshaana maatladevare communists.
  • Suresh Thalluri Naresh Garu...Your comment is not Correct!!!!
    14 hours ago · Like · 1
  • Jagadish Kumar అయ్యా చలసాని ఏం చెప్పాలనుకున్నారు. ఏం చెప్పారు. అది గమనించండి. ఆయన చెప్పిన వాటిల్లోంచే పాయింట్లు తీయండి. అతను చెప్పినదానిలో అంగీకరించాల్సినవి, ఆయనకే క్లారిటీ లేక గందరగోళపడినవి, ఆవేశంతో చెప్పిన మాటల జాబితా మీకు కనిపిస్తుంది. ఏడు పాయింట్లుగా నేను ఓ ప్రయత్నం చేశాను. మీరు కూడా చూడండి.

    1.//కానీ కాలం మారిందని గ్రహించండి. వామపక్షాలూ మీరు అసలు మారరా?//
    - వామపక్షాలు మారాలన్నది చలసాని గారి వాదన. అగ్రీడ్. మారలేదు కాబట్టే ఇబ్బందుల్లో పడ్డారు. అయితే మీలాంటి వారు కోరుకున్న మార్పుకు, జనం కోరుకుంటున్న మార్పుకు మధ్య తేడా ఉంది.
  • Jagadish Kumar 2. //వామపక్షాలూ ప్రతిపక్షమంటే కేవలం విమర్శించడమేనా? అసలు విద్యుత్ రేట్లు పెంచకూడదంటే.. పెంచకూడదనే ఉద్యమాలే! కానీ ఎందుకు పెంచకూడదో వివరించారా?//
    // ఒక సమస్యపై పోరాడేటప్పుడు దానికి పరిష్కారాలు చూపించాల్సిన బాధ్యత కూడా బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలుగా మీ మీద ఉందని మరువకూడదు కదా? //
    - ఇఆర్ సి అంటే మీకు తెలుసా చలసాని గారు. విద్యుత్ నియంత్రణ మండలి/సంస్థ. విద్యుత్ ఛార్జీలు పెంచడం, తగ్గించడం మీద సిఫారసులు చేసే బాడీ ఇది. ప్రతిసారి విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చినప్పుడల్లా ఇందులో చర్చను నిర్వహిస్తారు. ఇది నిర్వహించిన ప్రతీ సందర్భంలో వామపక్షాలు ఇందులో పాల్గొని నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నాయి. కార్పొరేట్ మీడియా వాటిని బయటకు రానివ్వడం లేదు. అందుకే ఎందుకు పెంచకూడదో బుక్ లెట్లు వేసి అమ్ముతున్నాయి. దురదృష్టవశాత్తు కమ్యూనిస్టులు సోషల్ మీడియాలో తక్కువగా ఉన్నారు. అందుకే మీ వరకు అవి వచ్చి ఉండవు. మీలాంటి వారి వరకు సమాచారం అందివ్వలేకపోవడం కమ్యూనిస్టుల తప్పు ఎలా ఉందో, ఆ సమాచారాన్ని మీరు కూడా సేకరించాలని ప్రయత్నించకుండా కామెంటు చేయడంలో కూడా అలాంటి తప్పే ఉంది.
  • Jagadish Kumar 3. // మీ పాలిత రాష్ట్రాలలో అసలు ఏ రేట్లూ పెంచలేదా?//
    -- విద్యుత్ ఛార్జీలనేవి ఇప్పుడు రాష్ర్టాలకు సంబంధించిన అంశం. దీనర్థం ఏమిటి? ఎక్కడికక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద ఉన్న పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీలపై నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకానికి ఆయా ప్రభుత్వాలు తెలియచేసుకుంటాయి. కాబట్టి ఏ రాష్ర్టానికి ఉండాల్సిన ఆ రాష్ర్టం ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ విషయం మనం మాట్లాడాల్సి ఉంటుంది. తెలుగు రాష్ర్టాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరమే లేదు. పవర్ పర్చేజ్ అగ్రీమెంట్స్ (పిపిఎ) అంటే మీకు తెలుసునకుంటా. ఇవి ఇప్పుడు జనాన్ని కొట్టి కార్పొరేట్లకు మేపేందుకు దోహదం చేస్తున్నాయి. వీటిని సవరిస్తే దెబ్బకు కరెంటు ఛార్జీలు దిగివస్తాయి. ఎంతసేపు అవతలివాడిని మేపాలనే దానిలో పడిపోయిన రాష్ర్ట ప్రభుత్వాలు కనీసం సరఫరాలో ఉన్న నష్టాలను కూడా తగ్గించుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. అంతెందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన 2003 విద్యుత్ చట్టం విద్యుత్తును కేవలం వ్యాపారాంశంగా మార్చేస్తోంది. ఇది మరింత ధరలు పెరిగేందుకు కారణం కాబోతోంది. ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఛార్జీలు తగ్గించడం అంటే గొంగట్లో అన్నం తిన్నట్లే అవుతుంది.
  • Jagadish Kumar 4. //చైనా/రష్యాలలో పరిస్థితి ఎలా ఉందో గమనించండి. మీరు ఇప్పుడు మొదటగా కార్మికుల హక్కులకోసం అక్కడ ఉద్యమించాలి//
    -- దాని గురించి ఆయా దేశాల్లో ఉన్న కార్మికులు, కార్మికసంఘాలు చూసుకుంటాయి. విద్యుత్ ఛార్జీలకు ఈ అంశానికి సంబంధం లేదు.
  • Jagadish Kumar 5.// ఏ రేటుకి విద్యుత్ ఎక్కడ కొంటున్నారో, అలాగే బొగ్గు దిగుమతులలో రేటు, కాలరఫిక్ విలువ, అసలు వాడకం ప్రతీదానికీ పక్కా లెక్కలతో పారదర్శకతతో అంతా ప్రజలకు తెలపాలి. ఆ క్లోజడ్ డోర్ పాలసీలు ఇకచెల్లవు. ఇది ప్రశ్నిస్తే పరిస్థితులు ప్రమాదకరం అనే పరిస్థితినుంచి తప్పించి పాదరర్శకత పెంచుతారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలని కోరుతున్నాను. //
    // ప్రతిపక్షాలు చేసే అన్ని ఆరోపణలూ సరైనవని అనలేము. //
    - పై రెండు స్టేట్ మెంట్లలో గందరగోళం చూడండి. ప్రభుత్వాలు పారదర్శకత కనబర్చకుండానే, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు సరైనవి కావనడం.. వాస్తవాలు తెలియకుండానే దానిని ప్రశ్నించేవారిని విమర్శించడం..
  • Jagadish Kumar 6. // వామపక్షాలు మరియు ప్రతిపక్షాలూ, ఎపిలో యూనిట్ కొన్ని పైసల నుంచి రూ.2.50 (ఫిక్సడ్ కాస్ట్) వచ్చే విద్యుత్ పోగొట్టుకుని బయట 5.50 నుంచి 8 రూపాయలవరకూ విద్యుత్ కొన్నా మీకు ఫరవాలేదా?//
    -- హ హ హ హ హ హ హ.... వామపక్షాలు ఎప్పుడైనా చవక విద్యుత్తును పోగొట్టుకోమని చెప్పాయా?
    // అటు లోపాలూ పూడ్చకుండా, ఆదాచేయకుండా దశాబ్దాలు రేటు పెంచకూడదంటే సరైనది కాదు కదా?//
    -- లోపాలు పూడిస్తే, ఆదాచేస్తే దశాబ్దం కాలంగా పెంచుతూ వచ్చిన రేట్లు మరింత తగ్గించొచ్చు. అది కూడా గుర్తించండి.
    // వాస్తవాలు వివరిస్తా డిమాండ్ చేయాలి. //
    -- ఇదే ఆ వాస్తవం..
  • Jagadish Kumar 7. // 24 గంటల టాగ్ కోసం ఎన్ని వేలకోట్లు అధికంగా నష్టపోతున్నామో తెలుసుకోవాలి.//
    -- ఇస్తానని చెప్పింది ఆయా రాష్ర్టాల్లోని తెలుగు ముఖ్యమంత్రులు. వారు చెప్పింది చేయాలని చెబుతున్నవి వామపక్షాలు. 24 గంటల ట్యాగ్ అనేది వామపక్షాలవి కావని గమనించాలి. 
    // సమయానికి బొగ్గు అందిస్తూ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తగ్గిపోకుండా చూసుకోవాలి. $4.2(btu) కే గాస్ విద్యుదుత్పత్తి కేంద్రాలకి అందిస్తూ పారదర్శకంగా విద్యుత్ కొనుగోలు చేయాలి. భవిష్యత్తులో ప్రభుత్వరంగంలో విద్యుత్ కేంద్రాలు ఎక్కువగా పెట్టాలి. అందుకని ఆ ముఖ్యమైన విషయాలతోపాటు నష్టాలను తగ్గించి ఆదాచేయడం, పీక్ లోడ్ డిమాండ్ తగ్గించడానికి సూచనలతో ఒకసారి వాస్తవాలపై దృష్టి పెట్టి ఉద్యమించండి. //
    -- అగ్రీడ్.. ఇప్పటి వరకు చేస్తున్నదీ అదే. అయితే అది మీకు అర్థం చేయించలేకపోయిన వామపక్షాలది తప్పు.
    Unable to post comment.
  • Jagadish Kumar
    Write a comment...

No comments:

Post a Comment