ఈ మధ్య ఫేసు బుక్కులో రెండు పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకటి ఆస్తికుడు. రెండోది నాస్తికుడు. ఆ ముద్రలెందుకు బాస్? ఒకసారి ముద్రలు వేసుకున్న తరువాత ఆ గిరి నుంచి బయటికొచ్చి మాట్లాడ్డం బంద్ అయిపోతుంది. ఇది ఎంత వరకు పోతోందంటే ఆస్తికుడన్న ప్రతీ వ్యక్తి మతోన్మాద ఆర్ ఎస్ ఎస్ కు చెందిన వాడని, నాస్తికుడన్న ప్రతి ఒక్కడూ కమ్యూనిస్టు అనేంత వరకు వెళ్తోంది.
ఆస్తికుడు తాను నమ్మింది నిజమని వాదించాలంటే ఆర్ ఎస్ ఎస్ పంచన చేరాలి కాబోలు అనుకునేంత స్థితికి నెట్టేస్తున్నారు. నాస్తికులేమైనా కమ్యూనిస్టుల పంచన చేరుతారా? అది ఉండదు. వారికి వారికి సవాలక్ష గొడవలు, అభిప్రాయ బేధాలుంటాయి. చివరకు ఏం జరుగుతోంది. నాస్తికులు, పురోగామి శక్తులు అనే వాళ్లు కలవడం అటుంచి, తటస్థంగా ఉండే ఆస్థికులందరినీ ఆర్ ఎస్ ఎస్ వైపుకు జాగ్రత్తగా నెట్టేస్తున్నారు.
ఇప్పుడిక్కడ జరగాల్సిందేమిటి? పురోగామి శక్తి లేదా హేతువాది లేదా నాస్తికుడు అనే వ్యక్తి ముందుగా తన మెడలోంచి బ్యాడ్జీని తొలగించాలి. అవతలి వాడికి ఆస్తికుడనే బ్యాడ్జి వేయకుండా ఉండాలి. బ్యాడ్జీలు లేకుండా, ఎదురెదురుగానో, గుంపులోనో ఉన్నామనుకుని మనుషుల్లా అంశాల మీద చర్చించాలి. రుజువులు, సత్యాలతో ఎవరైతే నిలబడతారో వారు గెలుస్తారు. కేవలం నమ్మకం మీద ఉండే వారు ఓడుతారు. ఈ క్రమంలో బ్యాడ్జీలు లేకుండా ఆస్తికులు, నాస్తికులు ఒకరి దారిలోకి ఒకరు రావడం, వారి అభిప్రాయాల మధ్య ఏకీభావం సాధ్యమవుతుంది. అప్పుడు దేవుడు, దెయ్యం, నమ్మకాలు అన్నీ వ్యక్తిగతం అయిపోయి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే శాస్ర్తీయ ఆలోచనకు సంబంధించిన అంశాలు, సిద్ధాంతాలు చర్చకు వస్తాయి. అప్పుడే నాలెడ్జి షేరింగ్ జరుగుతుంది. ఫేస్ బుక్కులో పెట్టే చర్చలు ఇంకొకరికి పాఠాలుగా ఉంటాయి. లేకపోతే పరమ రోత పుట్టిస్తాయి.
అంచేత అయ్యా మీరు ఆస్తికులు, నాస్తికులనే ముద్రలు వేసుకోకండి. దీనివల్ల మీకు ఒరిగేదేమీ లేకపోగా, పరమ రోత పుట్టించే పరస్పర దూషణ, హేళన, గేలి రచ్చ వైపుకు మల్లి మీ మెదళ్లలో చెత్త నింపుతుంది. రమేష్ సోయం పాటి గారు ఫేసుబుక్కు పాత్ర గురించి పెట్టిన పోస్టుపై చర్చలో ఈ విషయాన్నే ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నించాను. ఒకమారు పరిశీలించండి.

No comments:
Post a Comment