కొన్ని వాదనలుంటాయి. అవి మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతాయి. అలాంటిదే దళితులంటే ఎవరు? అనేది అది కేవలం ఎస్సీలకే ఎందుకు పరిమితం? అందులోకి బిసిలు, ఎస్టీలు ఎందుకు రారు? మహిళలు కూడా వివక్షకు గురవుతున్నారు కాబట్టి వారినీ దళితులు అనొచ్చా? ఇవీ ప్రశ్నలు... లేదా అనేద్దాం అంటూ అభిప్రాయాలు..
ఈ మౌలిక ప్రశ్నలకు సమాధానాలను వెతికేందుకే ఫేసుబుక్కులో `ఆలోచన లోచన` అనే గ్రూపులో రమేష్ సోయం హ్యూమనిస్టు గారు ఓ చర్చను నడిపారు. అందులో పాల్గొన్నవాళ్లం సమాధానం వెతికే దిశగా ఓ ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం ఎలా ఉంది? మేమింతకు సమాధానాలను వెతికి పట్టుకోగలిగామా? ఇంకా ఏమైనా మిగిలిపోయాయా? మీరే ఒకమారు చూసి చెప్పండి. ఈ కింది చర్చను చదవండి.
RECENT ACTIVITY
దలితులంటే ఎవరు?
---------------------
దలితులంటే కేవలం SC&ST వర్గాలవారు అని చాలామంది ఫిక్సయిపోయారు.
దలిత్ అన్నపదం మొదట వాడిన ఉద్దేశమే వేరు.మొదట వాడిన జర్నలిజంలో మరియు సాహిత్యంలో చాలా విస్తారమైన అర్దంలో 'దలిత్'పదాన్ని వాడారు .
అణచివేతకు,వెట్టిచాకిరికి గురయిన వర్గాల వారు దలితులే.
సామాజికంగా,ఆర్దికంగా లూటీ అయి అభివృద్ది ఫలాలకు నోచుకోని వారూ దలితులే.
పెట్టుబడిదారీ బూర్జువా భూస్వామ్య వ్యవస్థలో బలిఅయి శ్రమదోపిడికి గురయిన శ్రామిక వర్గాల వారూ దలితులే.
గృహహింసకు బలిఅయి,సమాజంలో పురుషులతో సమానంగా హక్కులు కోల్పోయిన మహిళలూ దలితులే.
దలిత్ అన్న పదానికి కొన్ని ప్రత్యేక కులాలు,వర్గాలతో ప్రత్యేకించి సంభంధమే లేదు.
రేపొద్దున ఆర్దికంగా చితికిపోయి, మిగతావర్గాల చేత చీత్కారాలకు,వివక్షకు బ్రాహ్మణులు గనక గురయితే, వారూ దలితులే అవుతారు.
No comments:
Post a Comment