విద్యుత్ ఛార్జీల గురించి ఓ మిత్రుడు చేసిన పోస్టుపై నా కామెంటు ఇది. అయితే ఈ కామెంట్లు పెడుతున్నప్పుడు సదరు మిత్రుడో లేదంటే మరెవరో స్పామ్ అని రిపోర్టు చేయడం జరిగిపోయింది. నేను చేసిన శ్రమ వృధా కాకూడదని దానిని ఈ బ్లాగు పోస్టు రూపంలో సేవ్ చేస్తున్నాను గమనించగలరు.
Timeline Photos
"1. అధికారపక్షం దుర్మార్గమైనది, దుష్టపాలన చేస్తుంది. బూర్జువా మనస్తత్వంతో పెట్టుబడిదారుల కోరల్లో చిక్కుకుపోయింది. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప. ఎర్రజెండా విముక్తికి బాట. తాడిత, పీడిత ప్రజల విముక్తికోసం నడుంకట్టాలి.. కార్మిక కర్షకుల ఐక్యత వర్థిల్లాలి. సమాజంలో 70% ఉన్న కూలీల హక్కులకోసం కదలి రండి ఎర్రజెండా రెపరెపలతో........... // .. ....../// .... .." మాలాంటివారూ చిన్నప్పుడు భారత విద్యార్థి సమాఖ్య అంటే ఊగిపోయేవారం. కలసినడిచాం. ఆనాడున్న పరిస్థితులవి. కానీ కాలం మారిందని గ్రహించండి. వామపక్షాలూ మీరు అసలు మారరా?
. 2. సమాజంలో ప్రాథమికరంగం ప్రాధాన్యత రోజు రోజుకీ తగ్గుతోంది. ప్రతీదీ ఆలోచించే మధ్యతరగతి పెరుగుతోంది. వామపక్షాలూ ప్రతిపక్షమంటే కేవలం విమర్శించడమేనా? అసలు విద్యుత్ రేట్లు పెంచకూడదంటే.. పెంచకూడదనే ఉద్యమాలే! కానీ ఎందుకు పెంచకూడదో వివరించారా?మీ పాలిత రాష్ట్రాలలో అసలు ఏ రేట్లూ పెంచలేదా? ఒక సమస్యపై పోరాడేటప్పుడు దానికి పరిష్కారాలు చూపించాల్సిన బాధ్యత కూడా బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలుగా మీ మీద ఉందని మరువకూడదు కదా? మీ మీద గౌరవం లేకపోలేదు. ఈ దేశంలో ప్రభుత్వ సంస్థలు కాపాడబడటానికి, అత్యయికపరిస్థితి సమయంలో ప్రజాస్వామ్య హక్కులు కాపాడటానికి (సిపియం1971-77), సాధ్యమైనవరకూ నీతి నిజాయితీలతో నంబూద్రిపాద్, అచ్యుతమీనన్, నయనార్, నృపేన్ చక్రవర్తి, జ్యోతిబసు, దశరథదేబ్,బుద్దదేవ్ భటాచార్య, మాణిక్ సర్కార్ లాంటి ముఖ్యమంత్రులుండగా వామపక్షాలు పాలన సాగించారు. భాజపా, కాంగ్రెస్ రెండూ రైటిస్టు పక్షాలుగా ఉన్న నేపథ్యంలో వామపక్షాలుగా మీ పాత్ర పోషించాలి. కానీ పాతచింతకాయపచ్చడిలా(ఈ మాట అనవలసివచ్చినందుకు అనుకోవద్దు) ఎప్పుడూ ఈ బూర్జువాలనో మరొకటనో గుడ్డిగా(చైనా/రష్యాలలో పరిస్థితి ఎలా ఉందో గమనించండి. మీరు ఇప్పుడు మొదటగా కార్మికుల హక్కులకోసం అక్కడ ఉద్యమించాలి) వ్యతిరేకించకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారని, ఉద్యమిస్తారని కోరుకుంటున్నాను. 3. ప్రతిపక్షాలు చేసే అన్ని ఆరోపణలూ సరైనవని అనలేము. కానీ ఏ రేటుకి విద్యుత్ ఎక్కడ కొంటున్నారో, అలాగే బొగ్గు దిగుమతులలో రేటు, కాలరఫిక్ విలువ, అసలు వాడకం ప్రతీదానికీ పక్కా లెక్కలతో పారదర్శకతతో అంతా ప్రజలకు తెలపాలి. ఆ క్లోజడ్ డోర్ పాలసీలు ఇకచెల్లవు. ఇది ప్రశ్నిస్తే పరిస్థితులు ప్రమాదకరం అనే పరిస్థితినుంచి తప్పించి పాదరర్శకత పెంచుతారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలని కోరుతున్నాను. అలాగే వామపక్షాలు మరియు ప్రతిపక్షాలూ, ఎపిలో యూనిట్ కొన్ని పైసల నుంచి రూ.2.50 (ఫిక్సడ్ కాస్ట్) వచ్చే విద్యుత్ పోగొట్టుకుని బయట 5.50 నుంచి 8 రూపాయలవరకూ విద్యుత్ కొన్నా మీకు ఫరవాలేదా? అటు లోపాలూ పూడ్చకుండా, ఆదాచేయకుండా దశాబ్దాలు రేటు పెంచకూడదంటే సరైనది కాదు కదా? వాస్తవాలు వివరిస్తా డిమాండ్ చేయాలి. 24 గంటల టాగ్ కోసం ఎన్ని వేలకోట్లు అధికంగా నష్టపోతున్నామో తెలుసుకోవాలి. సమయానికి బొగ్గు అందిస్తూ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తగ్గిపోకుండా చూసుకోవాలి. $4.2(btu) కే గాస్ విద్యుదుత్పత్తి కేంద్రాలకి అందిస్తూ పారదర్శకంగా విద్యుత్ కొనుగోలు చేయాలి. భవిష్యత్తులో ప్రభుత్వరంగంలో విద్యుత్ కేంద్రాలు ఎక్కువగా పెట్టాలి. అందుకని ఆ ముఖ్యమైన విషయాలతోపాటు నష్టాలను తగ్గించి ఆదాచేయడం, పీక్ లోడ్ డిమాండ్ తగ్గించడానికి సూచనలతో ఒకసారి వాస్తవాలపై దృష్టి పెట్టి ఉద్యమించండి. - చలసాని |