నల్లనయ్య కంచె ఐలయ్య ఇప్పుడు మనువాద పరిరక్షకులకు చెవిలో జోరీగ, కంట్లో నలుసు, చెప్పులోని రాయి, గుండెలో రైళ్లు, కడుపులో మంట, పక్కలో బళ్లెంలా తయారయ్యాడు. ఆయన మాటలు ఈటెల్లా గుచ్చుకుంటుంటే నొప్పిని తట్టుకోలేక ఇన్నాళ్లూ నరనరంలో, ప్రతి రక్తపు బొట్టులో, కడుపులో, ఎదలో, కంఠంలో దాగున్న విషాన్ని భళ్లున కక్కేస్తున్నారు. పురాణాల్లో చెప్పినట్లు అమృతం కోసం విషాన్ని దిగమించిన శివయ్య ఓ నల్లనయ్యనే.. అది కూడా ఓ కాకమ్మ కథనే అయినప్పటికీ ఐలయ్యకూడా ఆ పని చేయాలని, ఆ శక్తి అతనికి సమకూరాలని, ఆయన మొక్కవోని దీక్షతో నిలబడాలని కోరుకుంటున్న.. మనిషి ఎప్పుడైనా ఒక్కడే. మార్క్సయినా, అంబేద్కరయినా, ఐలయ్య అయినా.. అయితే వారి భావజాలం జనంలోకి ఇంకినప్పుడే శక్తిలా మారుతుంది. నా బోటి వాళ్లందరం ఇప్పుడు చేయాల్సింది ఆ భావజాలాన్ని జనంలోకి ఇంకించడమే.. నేను సిద్ధం. మరి మీరు..??
ముఖ పుస్తకంలోని ఆలోచన లోచన (open think forum) లో కంచె ఐలయ్య మీద మనువాదులు ప్రతిరోజూ విరుచుకు పడుతున్నారు. అశుద్ధ కవితలనూ గుమ్మరించారు. వారికి అశుద్ధమైనదల్లా మనకు అతి శుద్ధమైనదే. వారి అశుద్ధాన్ని వారికే అప్పచేప్పేందుకు ఓ చిన్న ప్రయత్నం జరిగింది. అదే ఈ పోస్టు సారాంశం. వివరాలకు ఈ కింద జరిగిన చర్చను చూడండి..
----------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment