సఫాయి కార్మికులు పోరాటం చేస్తున్నరు. ఆ కార్మికుల్ల ఉండేది ఎక్కువ భాగం ఎస్సీలు. విభజించి పాలించడమనే చీప్ ట్రిక్కును వీరి సమైక్య ఆందోళన మీద ప్రయోగించి కెసిఆర్ సర్కారు గెలిసింది. అయితే ఇది తాత్కాలికమే లేదా సగమే గెలుసుడని హైదరాబాదేతర మున్సిపాలిటీల్లోని కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు తమ నిరంతర పోరాటం ద్వారా కుండబద్దలు కొట్టిర్రు.. ఇది కెసిఆర్ కు మింగుడుపడ్తలేదు. ఆళ్ల పోరాట స్ఫూర్తిని ఎట్లయిన దెబ్బతీయాలని చెత్తెత్తుకునే వాళ్లు నిరంతర బిచ్చగాళ్లుగా ఉండాలనే కుట్రతో అంజాన్ కొట్టుడు షురూ చేసిండు... ఆ పోరాట స్ఫూర్తిని గుర్తించి, దానికి మద్ధతు ఇచ్చి అంజాన్ గొడ్తున్న కెసిఆర్ ను ఆయనకిష్టం లేకున్నా దీనిమీద మాట్లాడేట్లు చేయాలని పది కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నం చేసినయ్. ఆ ప్రయత్నం ఎంత విజయవంతం అయ్యిందంటే అది కెసిఆర్ లో ఉన్న కుల అహంకారాన్ని, దొరల లక్షణాన్ని, ఉద్యమాల పట్ల ఆయనకున్న దృష్టిని, మున్సిపల్ కార్మికుల పట్ల ఆయనకున్న చిన్న చూపుని అన్నీ ఒక్కదెబ్బతో భళ్లున కక్కించేసింది. దిక్కుమాలిన కెసిఆర్ చేసిన దిక్కుమాలిన కామెంట్లు ఇప్పుడు ఆయన మెడకే సుట్టుకుంటున్నయ్. సుట్టుకునేట్లు మనమంతా చేయాలే. లేకపోతే కెసిఆర్, ఆయన అనుచరులు గజిబిజి చేస్తరు. గారడి చేస్తరు. జనాన్ని కన్ ఫ్యూజ్ చేస్తరు. దీనికి లోనైన కొద్ది మంది జనం కూడా మనల్ని అనుమానిస్తరు. Telangana Netizens Joint Action Committee లో జరిగిన చర్చ ఇందుకు ఉదాహరణ. మీరే చూడండి...
-------------------------------------------------------------------------------------------------------------------------------------
Jagadish Kumar shared CPIM Telangana's photo.
Jagadish Kumar shared CPIM Telangana's photo.
''కేసీఆర్..
నీ దృష్టిలో దిక్కుమాలిందెవరు..??
ఉద్యమాలు దిక్కుమాలినవా..?? ఉద్యమ కారులు దిక్కుమాలిన వాళ్లా..??
నీ దృష్టిలో దిక్కుమాలిందెవరు..??
ఉద్యమాలు దిక్కుమాలినవా..?? ఉద్యమ కారులు దిక్కుమాలిన వాళ్లా..??
'' మున్సిపల్ కార్మికులు 'దిక్కుమాలిన' సమ్మె చేయడం వల్లనే ఉద్యోగాలు కోల్పోయారా..??''
అంటే నీ దృష్టిలో స్వాతంత్ర్య 'ఉద్యమం' దిక్కుమాలిందా..??
వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాట 'ఉద్యమం' దిక్కుమాలిందా..??
ప్రత్యేక తెలంగాణ సాధన 'ఉద్యమం' దిక్కుమాలిందా..??
వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాట 'ఉద్యమం' దిక్కుమాలిందా..??
ప్రత్యేక తెలంగాణ సాధన 'ఉద్యమం' దిక్కుమాలిందా..??
నీ దృష్టిలో అమరవీరులు 'దిక్కుమాలిన పోరాటాలు' చేసి ప్రాణత్యాగం చేశారా..??
నీ అహంకార వైఖరి ముమ్మాటికీ తప్పు.. ఉద్యమాలెప్పుడు దిక్కుమాలినవి కావు. ప్రభుత్వాల 'దిక్కుమాలిన' విధానాల వల్ల ప్రజల కడుపు మండి అందులోంచి ఉద్యమాలు పుడతాయి.
ఆనాడు పోరాటాల్ని అణిచివేయాలని చూసిన బ్రిటీష్ ప్రభుత్వం మట్టిగొట్టుకుపోయింది..
నిజాం రాజు కూలిపోయాడు..
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాడ లేకుండా పోయింది..
చరిత్రను మర్చిపోయి మాట్లాడుతున్నావ్..
నిజాం రాజు కూలిపోయాడు..
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాడ లేకుండా పోయింది..
చరిత్రను మర్చిపోయి మాట్లాడుతున్నావ్..
ఇదే వైఖరితో ఉంటే.. నువ్వూ దిక్కులేకుండా పోతావ్..
కబడ్దార్.. కేసీఆర్..
కబడ్దార్.. కేసీఆర్..
''ఉద్యమకారులకి బహిరంగ క్షమాపణ చెప్పు.. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించు.''
- తమ్మినేని వీరభద్రం,
సీపీఐఎం తెలంగాణ..
- తమ్మినేని వీరభద్రం,
సీపీఐఎం తెలంగాణ..
who will pay salaries to local municipal workers? panchayties or from state govt treasury?. and please let us know, how payments happen in previously or in other congress or communist govt states so that the issue will get clear to understand.
ReplyDeleteAnd I know little with this issue: previous Govt allowed to spend 30% from Pachayat income to pay salaries now the govt is the relaxed upto 50% is it wrong?
కడుపుమండి కేకలేసినోడు....
ReplyDeleteఆకలి తీర్చమని అడిగినోడు....
బాధతో, రోధనతో గొంతెత్తినోడు...
కూడుకోసం, గూడుకోసం నోరిప్పినోడు...
దిక్కుమాలినోడు... దిక్కులేనోడు....
నిన్నటివరకు వీళ్ళు నమ్ముకున్న "సమ్మె"...దిక్కుమాలిందయింది.....
సంఘటితమై గొంతిప్పాలన్న వాళ్ళ ఆలోచన ..దిక్కులేనిదయింది.
వాళ్ళు నమ్ముకున్న 'సమ్మే కు అర్ధం మారాలి...
సమ్మె అంటె ఆగాల్సింది సైరన్ కూతలు కాదు...
సమ్మె అంటె రేగాల్సింది పాలకుల గుండెల్లొ గుబులు...
సమ్మెల అర్ధం మారాల్సిన సమయం ఆసన్నమయింది...
దిక్కుమాలిన సమ్మెలకు కొత్త అర్ధం చెప్పాలి....
సంఘటిత శక్తులకు ఒక కొత్త దిక్కు కావాలి..
దిక్కుమాలిన సమ్మెలు దేశ దిక్సూచికలవ్వాలి..!!!
K S S Bapujee