Saturday 26 December 2015

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో విప్లవం - డేటా సైన్స్

ఈ మధ్యలో డేటా సైన్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. వారందరికీ అవగాహన కల్పించే విధంగా నవతెలంగాణాలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. బిటెక్, ఎంటెక్, బిఎస్సీ, ఎమెస్సీ, ఎంసిఎ విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వారి కెరీర్ అభివృద్ధికి తోడ్పడుతుంది. చదవండి.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో విప్లవం - డేటా సైన్స్

----------------------------------
అవును ఇది వాస్తవం! ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డేటాసైన్స్‌ ఓ విప్లవమే... సాంకేతిక సంచలనమే. ఐటీ రంగంలో శరవేగంతో ఇది ముందుకు దూసుకెళ్తూ ఉపాధి మార్గాన్ని సుగమం చేస్తోంది. అందుకే.. మార్కెట్‌లో దీనికి క్రేజ్‌ బాగా పెరిగింది. అసలు డేటా సైన్స్‌ అంటే ఏమిటో... దాని విశిష్టతలేమిటో తెలుసుకుందాం...
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డేటాసైన్స్‌ కీలకాంశంగా మారింది. ప్రస్తుతం ఇది ఒక హాట్‌ ఫీల్డ్‌ కావడంతో ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. టెక్నాలజీ మార్కెట్‌, రీసెర్చ్‌ సర్వేల ప్రకారం నిపుణుల కొరత ఎక్కువగా ఉండటంతో ఎక్కువ ప్యాకేజీలతో నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీంతో చాలామంది ఈ టెక్నాలజీని నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. అయితే... దీని గురించి సరైన సమాచారం అందుకోలేకపోవడం, మార్గనిర్దేశం చేసేవారు లేకపోవడంతో చాలామంది ఈ రంగంపై అనేక అపోహలతో ఉన్నారు. డేటాసైన్స్‌ గురించి ఇప్పటి వరకు వినని వారూ ఉన్నారు.

డేటా సైన్స్‌ అంటే...
సాంఖ్యాకశాస్త్రం (statistics), గణాంకాలు (computation), విజువలైజేషన్‌ టూల్స్‌ను ఉపయోగించి డేటాపై విశ్లేషణ (analysis) చేస్తారు. తద్వారా ఆయా సంస్థలు (organizations) ఒక అవగాహనకొచ్చి వివరణాత్మకంగా (informative), అన్వేషణాత్మకంగా (exploratory way), ముందుచూపుతో (forward-looking) రాబోయే రోజుల్లో సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతారు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేదా సేకరించిన సమాచారంపై దృష్టిసారించి భవిష్యత్తు మీద ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోటానికి ఇది దోహదపడుతుంది

ఏయే రంగాల్లో అసవరం..?
దాదాపు అన్ని రంగాల్లోనూ డేటాసైన్స్‌ అవసరం .
ఐటీకి ఆయువుపట్టు వంటి BFSI(బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌) రంగాలతోపాటు ప్రధానంగా ఈ-కామర్స్‌, గవర్నమెంట్‌, రిటైల్‌, మ్యాన్యూఫ్యాక్చరింగ్‌, మార్కెటింగ్‌, టెలికమ్యూనికేషన్‌, ఎనర్జీ, మీడియా, గేమింగ్‌, హెల్త్‌ కేర్‌, ఫార్మాసూటికల్‌, ట్రావెల్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌... ఇలా చెప్పుకుంటూపోతే దాదాపు ప్రతి రంగాల్లో డేటాసైన్స్‌కు ప్రాముఖ్యత ఉంటుంది.

అర్హతలేమిటి..?
డేటాసైన్స్‌ శిక్షణకు కొంచెం బేసిక్‌ స్ట్యాటిస్టిక్స్‌ మీద అవగాహన ఉంటే చాలు. మ్యాథమెటిక్స్‌, ఎకనామిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌లో కనీసం ఏదేని రెండు సబ్జెక్ట్స్‌ లేదా కాంబినేషన్స్‌తో కూడిన డిగ్రీ ఉంటే సరిపోతుంది. బ్యాచిలర్‌ డిగ్రీ మొదలుకొని పీజీ లేదా పీహెచ్‌డీలు చేసిన వారికి ఆయా అర్హత, అనుభవాన్ని బట్టి జాబ్స్‌ ఉంటాయి.

 ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ నేర్చుకోవాలి..?
ప్రధానంగా ఏదైనా ఒక స్ట్యాటిస్టికల్‌ ప్రోగ్రామ్మింగ్స్‌ (R programming, python, SAS, SPSS, strata…) బాగా అభ్యాసం చేసి అలాగే Hadoop లాంటి డిస్ట్రిబ్యూషన్‌ ప్రోసెసింగ్‌ ఫ్రేంవర్క్‌ మీద పట్టు సాధించి,SQL మీద కొంత అవగాహన ఉండి, దానికి అనుగుణంగా ఏదేని ఒక విజువ లైజేషన్‌ టూల్‌ (Tableau,Qlickview,D3.js…) నేర్చుకుని ఉంటే సరిపోతుంది .

మరిన్ని నైపుణ్యాలు అవసరం
టెక్నికల్‌ స్కిల్స్‌తో పాటు సమర్థంగా కమ్యూనికేషన్‌ చేయగలిగి కొంచెం వ్యాపార చతురత (business acumen), ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే తపన (Intellectual curiosity), తెలివిగా చిక్కుముడులను విప్పగలిగే సామర్థ్యం (hacker mindset), అంకెల రూపంలో ఉన్న డేటాని సమర్థంగా గ్రాఫ్‌ లేదా చార్ట్‌ రూపంలో అందరికి అర్థమయ్యేలా వివరించగలగడం (story telling) రావాలి. లేదా పైన చెప్పినట్టు mathematics, ఎకనామిక్స్‌, స్ట్యాటిస్టిక్స్‌ లేదా computer science లో ఏదైనా ఒక సబ్జెక్ట్‌ పైన ఎక్కువ అనుభవం (domain expertise) ఉన్నవాళ్లకు డేటా సైన్స్‌ లో మంచి అవకాశాలు ఉంటాయి.

ఇతర కెరీర్‌ నుంచి మార్పు కోరుకోవచ్చా..?
డేటా సైన్స్‌ అనేది చాలా విస్తృతమైన టెక్నాలజీ. వివిధ రకాల నైపుణ్యాలు ఉన్న వారికి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. స్కిల్స్‌ను దృష్టి లో పెట్టుకుని కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారు ఆయా సామర్థ్యాలను చూపించగలిగితే భవిష్యత్‌ లో మంచి అవకాశాలు పొందొచ్చు.

 సర్టిఫికేషన్స్‌ అవసరం ఉంటుందా..?
Coursera, Edx, Udacity లాంటి ఎడ్యుకేషన్‌ పోర్టల్స్‌ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీల భాగస్వామ్యంతో డేటా సైన్స్‌లో ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తున్నాయి. అందులో కొన్ని పూర్తిస్థాయిలో డేటా సైన్స్‌ కరికులమ్‌ను కాకుండా కొన్ని మాడ్యూల్స్‌ రూపంలో ఆఫర్‌ చేస్తున్నాయి. అలాగే IITs, IIMs, ఇంకా USA, UKలోని యూనివర్సిటీస్‌ MSc ప్రోగ్రామ్స్‌,PG, Phd డిగ్రీలు, అలాగే సర్టిఫికేట్స్‌తో కూడిన డిగ్రీలను కూడా ఆఫర్‌ చేస్తున్నాయి. అవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. కొత్తగా డేటాసైన్స్‌లోకి అడుగుపెడుతున్న వారికి ఆ విధానం అడ్వాన్స్‌డ్‌గా ఉండటం వల్ల తక్కువ ఖర్చుతో హైదరాబాద్‌లోనే ఉత్తమ శిక్షణ ఇచ్చే కేంద్రాలకు వెళ్లేందుకు చాలామంది మక్కువ చూపుతున్నారు.

 జాబ్‌రోల్స్‌ ఇలా...
కంపెనీ స్థాయి, డేటాసైన్స్‌ టీమ్‌ సభ్యుల సంఖ్యనుబట్టి డేటాసైన్స్‌ రోల్స్‌ ఆధార పడి ఉంటాయి. ముఖ్యంగా చీఫ్‌ డేటా ఆఫీసర్‌, డేటా సైంటిస్ట్‌, బిగ్‌ డేటా మేనేజర్‌, బిగ్‌ డేటా/డేటా సైన్స్‌ అనలిస్ట్‌, బిజినెస్‌్‌ ఇంటెలిజెన్స్‌ అనలిస్ట్ట్‌, బిగ్‌ డేటా ఇంజనీర్‌, బిగ్‌ డేటా సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌, బిగ్‌ డేటా/డేటా సైన్స్‌ విజువలైజర్‌, బిగ్‌ డేటా కన్సల్టెంట్‌, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ మేనేజర్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, డేటా అనలిస్‌ ్ట... ఇలా చాలా అవకాశాలు ఉంటాయి.

 మన రాష్ట్రం అనుకూలమే...
తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు ఇప్పుడిప్పుడే వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం లాంటి Tier-2 citiesకు ఐటీ విస్తరిస్తోంది. ఒకప్పుడు ఐటీ హబ్‌గా ఉన్న బెంగళూర్‌ను హైదరాబాద్‌ మించిపోతోంది. Google, Microsoft, Uber లాంటి బహుళ జాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. దీంతో మన రాష్ట్రం కూడా NASSCOMలాంటి సంస్థల సహకారంతో ఐటీలో ముఖ్యంగా బిగ్‌ డేటా అనలైటిక్స్‌కు ఒక హబ్‌గా మారిపోయింది. ఇది డేటాసైన్స్‌ అభివృద్ధికి దోహదపడింది.

 వేతనం ఎలా ఉంటుందంటే..
2011లోMcKinsey తెలిపిన వివరాల ప్రకారం.. 2018 నాటికి United statesలోనే 140,000 నుంచి 190,000 అనలిటికల్‌ నిపుణుల కొరత ఉంటుంది. అలాగే మంచి నైపుణ్యంతో కూడిన 1.5 మిలియన్‌ మేనేజర్స్‌, ఆనలిస్టులు బిగ్‌ డేటాను ఉపయోగించి విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు ఉన్న వాళ్లు అవసరమవుతారని అంచనా. ఒక ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ mathematics, statistics, economics లేదా computers విభాగాల్లో ఉండి communication, ఇతర నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్నట్లయితే మొదటి ప్యాకేజ్‌లోనే సంవత్సరానికి 7-10 లక్షల రూపాయలు చెల్లించడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి. 3-6 సంవత్సరాలు అనుభవం ఉన్న డేటా సైన్స్‌ నిపుణులకు ఏడాదికి 12-16 లక్షల రూపాయలు, 7-12 సంవత్సరాలు అనుభవం ఉన్నవారికి ఏడాదికి 25-40 లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.


 డేటాసైన్స్‌కు బహుఆదరణ
ఐటీ రంగంలో కొత్త ఆవిష్కరణలు రోజురోజుకు పుట్టుకొస్తున్నాయి. ఈ పురోగతిని గమనించి అందుకు అనుగుణంగా ముందుకుసాగాలి. మంచి భవిష్యత్‌ కోసం ప్రణాళికను రూపొందించుకోవాలి. సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు మంచి డిమాండ్‌ ఉంది. వీరిని నియమించుకునేందుకు ఆయా కంపెనీలు పోటీ పడుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న డేటా నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టే 'డేటా సైన్స్‌' నిపుణుల కోసం ద్వారాలు తెరచి ఉంచాయి. ఈ ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వారికి అవగాహన కల్పిస్తున్నాం. కెరీర్‌ గైడెన్స్‌, జాబ్‌ మార్కెట్‌, ఇండిస్టీ ట్రెండ్స్‌ తదితర అంశాల సమాచారం కోసం సంప్రదించండి...
Neo cursor
c/o Sundarayya vignana kendram,
1-8-1/b25/A,
Bagh Lingampally, Hyderabad.
Ph : 9494860011, 9494860022
- కె.సుమేందర్‌,
డేటా సైన్స్‌ అవెంజలిస్ట్‌, నియోకర్సర్‌
న్యూస్ పేపర్ లింకు కోసం దీనిని క్లిక్ చేయండి. http://navatelangana.com/article/techplus/182450

No comments:

Post a Comment