Friday, 26 June 2015

మనుధర్మ శాస్ర్తం , ఆర్ ఎస్ ఎస్ బుకాయింపు, కమ్యూనిస్టుల్లో వచ్చిన మార్పులు...

మనుధర్మ శాస్ర్తం అనేడిది కాలం చెల్లిన అణుబాంబు, లేదా భోపాల్ గ్యాస్ లాంటిది. అది పేలుడు సంగతి పక్కన పెడితే, అది వదిలే రేడియేషన్ లేదా విష వాయువులు ఈనాటికీ సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాంటి కాలం చెల్లిన విష సిద్ధాంతాన్ని పదిలంగా భద్రపర్చి జనం ప్రాణాలతో ఆటలాడాలనుకుంటున్న బ్యాచీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. నాగ్ పూర్ హెడ్ క్వార్టర్ ఈ మేరకు చక్రం తిప్పుతోంది. అర్రె.. మనుషుల మధ్య కట్టుబాట్లను పెట్టి విభజిస్తున్న  మనుధర్మ శాస్ర్తాన్ని  తగులబెట్టాలె అని చెప్పంగనే ముఖ పుస్తక మిత్రుడు, ఆర్  ఎస్ ఎస్ లో కీలక కార్యకర్త .. ఆ చర్చను దారిమళ్లించేందుకు అనేక బంతులు విసిరాడు.. వాటన్నింటినీ బాదేస్తే కమ్యూనిస్టుల మీద పడ్డాడు. అది కూడా బాదేస్తే ఇక అక్కడితో ఆగిపోతాడా లేదా తెలియదు. నాతో సంవాదించిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త విజ్ఞుడు. అతనితో వ్యక్తిగత విభేధాలు లేవు. ఉంటే గింటే సైద్ధాంతిక విభేదాలే.. ఆర్ ఎస్ ఎస్ చెప్పినట్లు అతను  నడుచుకుంటున్నాడు. ఆ మేరకే ఈ వాదనలను చూడాలి.
మనుధర్మ శాస్ర్తాన్ని ఎందుకు తగలెయ్యాలి? కార్పొరేట్ మీడియా లేదా ఆర్ ఎస్ ఎస్ ఇలాంటి చర్చను ఎలా దరి మళ్లిస్తుంది? కమ్యూనిస్టు పార్టీ వైఖరిలో వచ్చినమార్పులేంటి.? తదితర వివరాలకోసం ఈ కింది చర్చను పరిశీలించండి. మీ సూచనలు అందించండి..



News Feed