Friday, 23 October 2015

గుర్రమెక్కి పగ్గాలు వేరే వాడి చేతిలో పెడితే... రాజకీయశక్తిగా మారి రాజ్యాధికారం వద్దనుకుంటే... రెండూ సేమ్ టు సేమ్...

       మితృడు దుర్గం చంద్రశేఖర్ ఒక అద్భుతమైన ప్రయత్నం చేశారు. ఈనాడు సాధారణ అంబేద్కర్ వాదులు  ఏం కోరుకుంటున్నారో దానిని చాలా చక్కగా రాశారు. ఇంకో మాటలో చెప్పాలంటే అంబేద్కరిస్టులమని భావిస్తున్నవారు లేదా భావించాలనుకున్న వారు ఎలా ఉండాలి? ఏం ఆచరించాలి? ఏం క్లారిటీకి రావాలి? వంటి అంశాలను మితృడు  దుర్గం తడిమారు.
       మొగ్గతొడుగుతున్న రచయితగా, విశ్లేషకుడిగా మితృడు దుర్గం చేసిన ప్రయత్నం శ్లాఘించతగినదే. సరిగ్గా ఆయన చేసిన విశ్లేషణలో సైతం పరిపక్వత స్థానంలోనే ఔత్సాహికత కన్పిస్తుంది. ఔత్సాహికత వల్ల శరవేగంగా ఒక అంచనాకు రావడం, దానిని సమర్థించడానికి వీలుగా వాదనలు సృష్టించడం మామూలే. అయితే కీలక అంశాన్ని  సరిగ్గా అర్థం చేసుకోకపోతే, లేదా అంబేద్కరిజం సారాంశాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోలేకపోతే మన నిర్దారణలన్నీ దారితప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరిగ్గా అలాంటిదే రాజకీయశక్తిగా మాత్రమే ఉండడం, రాజ్యాధికారాన్ని చిన్న చూపు చూడడం.
       ఇప్పటికే రంగంలో ఉన్న  కొద్ది పార్టీలను, సంఘాలను, లేదా సంస్థలను వాటి పనితీరును, అందులో ఉన్న లోపాలను చూసి యావత్తు సిద్ధాంతాన్నే తప్పుదారిలో అప్లయి చేశారనే నిర్దారణకు రావడం ఇందులో భాగంగానే జరిగిపోయింది. దీంతో అంబేద్కర్ ఆశయం కేవలం ఎస్సీలు రాజకీయశక్తిగా ఉండడం మాత్రమే. రాజ్యాధికారం లక్ష్యం కాదని చెప్పారనేంత వరకు వెళ్లింది.
       వాగ్గేయరాజు జయరాజు చెప్పినట్లుగా ``జగజ్జననేత అంబేద్కర్.. భారతం మార్క్సు అంబేద్కర్..`` అవును.. ఆయన మన భారతదేశ పరిస్థితులకు మార్క్సిజాన్ని, కమ్యూనిస్టులకంటే ఎక్కువ స్పష్టతతో అప్లయి చేసేందుకు ప్రయత్నించారు. భారతదేశంలో కులం అనే అంశం ఉన్న నిర్దిష్ట పరిస్థితుల్లో విప్లవం ఎలా రావాలి? కులంతో ఎలా తలపడాలి? 3000 ఏళ్లుగా సర్వం కోల్పోయిన ప్రజానీకం రాజ్యాంగం అందించిన ఫలాలు నిజంగా  అనుభవించాలంటే దేశ ఆస్థిపాస్తుల్లో చేపట్టాల్సిన సంస్కరణలేంటి?.. ఇలా అనేక అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలను వెలువరించారు. రాజ్యాధికారం ప్రాధాన్యత గుర్తించకపోతే అంబేద్కర్ గారు బహుశా ఇన్ని ఆలోచనలు చేసి ఉండరేమో.??
       అంబేద్కర్ అసామాన్యుడు. ఆయన తనను తాను నిత్యం మార్చుకుంటూ వెళ్లారు. ఆయన ఉపన్యాసాలు, రచనలు కాలమాన పరిస్థితులకు  అనుగుణంగా పోల్చి చూసినప్పుడు మీకు అనేక అంశాల్లో మార్పులు కనపడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే స్పష్టతవైపు ఆయన అడుగులు వేసేందుకు ప్రయత్నించారు. పాతదానినే పట్టుకుని వేళ్లాడలేదు. ప్రతీది మారుతుంటుంది అనే సర్వజనీన సూత్రాన్ని తన జీవితానికి తన ఉపన్యాసాలకు, ఆలోచనలకు అప్లయి చేసి పరిపుష్టం చేస్తూ పోయిన మహానేత అంబేద్కర్.
       ఇప్పుడు మనం ఏం చేయాలి? అంబేద్కర్ కాలం నాటికంటే ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ, పట్టణాలు చాలా అభివృద్ధి అయ్యాయి. సమాజంలో ఇవి అనేక మార్పులను తీసుకువచ్చాయి. ఈ మారిన పరిస్థితులను అంబేద్కరిజం టార్చి వెలుగులో అధ్యయనం చేయాలి. అలా కాకుండా పరిస్థితులు యథాతథంగా ఉన్నాయనుకునే భావనతో ఆరంభమయ్యే వాదనలన్నీ చివరకు లక్ష్యంలేనివిగా మిగిలిపోతాయి. కొత్తగా అడుగు ముందుకు వేద్దామనుకునేవారి కాళ్లకు బంధనాలు అయిపోతాయి.
       మితృలు దుర్గం చంద్రశేఖర్, చైతన్య కూరపాటి ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరిపారు. మీరూ చదవండి మీ అభిప్రాయం చెప్పండి.



@@@Political Power _రాజకీయ శక్తి _రాజ్యాదికారం- ఒక పరిశీలన@@@
జై భీమ్ మిత్రులారా
మొరిగే కుక్కలకి నాలుగు బొక్కలు ఎక్కవ వచ్చినట్టు "రాజ్యాధికారం" అని చెప్పే వచ్చేవారు మన SC వారిలో నలుగురు ధనవంతులు కావచ్చు కాని మొత్తం సమాజానికి ఒరిగేది ఏమిలేదు.
అంబేడ్కరిజం అంటే ' రాజ్యాధికారం ' అంటూ ప్రజలను తప్పు పట్టిస్తున్నారు . వీరు చెబుతున్న ఈ రాజ్యాధికారం అనే దాన్ని బాబాబాసాహెబ్ ఏమని పేర్కొన్నాడు. రాజ్యాధికారం ను ఇంగ్లీష్ లో ఏమంటారు. ' Political power ' అనే పదానికి తెలుగు అనువాదం ఏమిటి ? రాజ్యాధికారానికి ఆంగ్ల అనువాదం ఏమిటి ? ఇవి తెలుసుకోవలసిన అవసరం వుంది.
Political Power కి రాజ్యాధికారం అనేది తప్పుడు అనువాదాపదం , Political Power అంటే రాజకీయశక్తి. బాబాసాహెబ్ అంబేద్కరు మాటలను వక్రీకరించి కొందరు స్వార్థపర అవకాశవాదులు రాజ్యాధికారం అంటూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు.రాజ్యాధికారం అంటే రాజు యొక్క అధికారం , ఇది రాజరిక వ్యవస్తలో వుంటుంది. రాజ్యాధికారం అంటే Political authority. ప్రజాసామ్యంలో అధికారం ఎవరిచేతిలో ఉంటుంది? ఒక వ్యక్తి వేతిలో ఉంటుందా? లేక ఒక వర్గం చేతిలో ఉంటుందా?వుంటే దానిని ప్రజాసామ్యం అంటారా ? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ? రాజ్యధికారం ప్రజసామ్యంలో సద్యమా? రాజరికంలో సాద్యమా?కూలినప్రవుత్వమా? లేకా రాజరికమా?నిరకుసత్వమా?ఓక వ్యక్తి కి లేక వర్గానికి రజకీయా స్వయం నిర్నయాధికారం అనేది ప్రజసామ్యమా?
"రాజ్యాధికారం" సరి అయినది కాకున్నా ఆచరణలో కఠినమైనది కానిది. కాని రాజకీయ శక్తి (Political Power ) సులభమైనది మరియు సిద్ధాంతింగా అస్పృశ్యత నిర్మూలనకై చేసే కులనిర్ములన ద్వార ఒక రాజకీయ శక్తిగా ఎదగవచ్చు సరే
యస్సీలు రాజ్యాధికారం ఒంటరిగా సాధించడం సాధ్యమా?
70 సంవత్సరాలనుండి యస్సీలు రాజ్యాధికారం ఎందువల్ల సాధించలేకపోతున్నారు? సాధించామని చెప్పుతున్న చోట అస్పృశ్యత ఎందుకు నిర్మూలింపబడలేదు? అలాంటప్పుడు రాజ్యాధికారం వల్ల ప్రయోజనం ఏమిటి ?
బాబాసాహెబ్ పేర్కొన్న Political Power అనే పదాన్ని ' రాజకీయ శక్తి ' అనే అర్థం లో ఉపయోగించాడు. అయితే కొందరు స్వార్థపరులు దాన్ని ' రాజ్యాధికారం ' అంటూ వక్రీకరించి జనాన్ని మోసం చేస్తున్నారు.
రాజకీయ శక్తి అంటే ఏమిటి ?
ఈనాడు కేవలం 5% ఓట్ల తేడాతో ప్రభుత్వాలు మారుతున్నాయి. యస్సీలు దాదాపు 20% ఉన్నారు. అందులో కనీసం 10% ఓట్లను మనం అంటే అంబేద్కర్ పార్టీ సాధించగలిగితే మనం రాజకీయ శక్తి సాధించినట్టే. మన మద్దతు లేకుండా ఏ వ్యక్తి కూడా MLA కాలేడు. మన మద్దతు లేకుండా ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. మన అంగీకారం లేకుండా ఏ బిల్లు కూడా శాసనం కాజాలదు. అదే Balance of Power. దాన్నే రాజకీయ శక్తి లేదా Political Power అంటారు. Power అంటే శక్తి దీనిని Political Science లో ఈ విధంగా చెప్పబడును. శక్తి అంటే ఒక వ్యక్తి లేదా వర్గం మరి ఒక వ్యక్తి లేదా వర్గం యొక్క అభిప్రాయాన్ని తనకు అనకూలంగా మార్చగల సామర్థ్యాన్ని శక్తి అంటారు.
బాబాసాహేబు అంబేద్కరు రాజకియాశక్తి పోందలని చేప్పిన, హిందూమతం విసర్జుంచూ అని చేప్పిన దాని లక్షం, అశయాం అస్ప్రుశ్యత నిర్ములణ . అస్ప్రుశ్యతా నిర్ములన కావాలంటే కులనిర్ములన కోసం పని చేయ్యలి. కులనిర్ములన స్వచ్చంగా చేసుకోవలంటే దానికీ మద్దతూ ఇస్తున్నా బ్రాహ్మణభవజలా గ్రంథాలనూ వాటి పవిత్రతను, నియమాలనూ ఖండించాలి.అస్పృశ్యత నిర్మూలన క్రమంలో రాజకీయ శక్తిని సాదించడం సాద్యం .
అంబేద్కరు యోక్క లక్షం, అశయమే అంబేద్కరిజం. అదే అస్ప్రుశ్యతా నిర్ములణ, అదే కులనిర్ములన, కానీ నేడు కులలను బలపరుస్తు ఓట్లు అడిగే వారు ఏంతటి వారు అయినా వారు అంబేద్కరువాదులు కారు. నకలీ అంబేద్కరు వాదులు మత్రమే కులన్ని సమర్దిస్తారూ, కులసంఘాలను బలపరుస్తారు, ఉపకులాలను బలపరుస్తారు.
అంబేద్కర్ ఆశయం కానిది. ఆ లక్షానికి చేరే మార్గమ కానివి క్రింద ఇవ్వబడినవి
1. కులాలను బలపరచి రాజకీయం చెయ్యడం,
2. కుల సంఘాలను ప్రోత్సహించడం , వాటిలో ఉండడం
3. దళితవాదం , బహుజనవాదం , దళిత బహుజనవాదం , మూలినివాసి వాదం, రాజ్యాదికారం ఇలా అంబేద్కర్ పేరు చెప్పి బ్రాహ్మణవాదం ప్రచారం చెయ్యడం
4. "స్వరాజ్యం" కొరకు బ్రాహ్మనవాదులలు "రాజ్యాధికారం" అని అనాగారిన కులాలు చెప్పుకోవడం ప్రజాసామ్యం కాదు . ప్రజాసామ్యం లో అధికారం ఒక వర్గం చేతిలో, ఒక వ్యక్తీ చేతిలో వుండకూడదు. . ఒక వర్గం రాజకీయ శక్తి(పొలిటికల్ పవర్ ) మాత్రమే పొందుతుంది
5. రాజ్యాధికారం కోసం అని కులాలను బలపరచడం , కుల నాయకులను ప్రోత్సహించడం
6. అంబేద్కరిజం అంటే రిజర్వేషన్ అని చెప్పి , అది కులాల ఆస్తి అని ప్రచారం చేస్తూ SCలుగా కలిసున్నా వారిని వర్గీకరణ పేరుతొ ఉపకులాలు విభజించి, యస్సిలు కలిసి బ్రాహ్మణవాదం పై ఉధ్యమించవలసినది పోయి ఒకరితో ఒకరు 15 సంవత్సారాలుగా పోరుసగించడ , ఉపకుల పోరుతో కులస్పృహ కలించడం ద్వార కుల వ్యవస్తను బలపరచడం
7. స్వాభిమానం , ఆత్మాభిమానం అని చెప్పి కులం తొకలను పేరు చివరకు తగిలించడం. ఇది అస్పృశ్యతను శాశ్వతం చెయ్యడం
8. కుల ధర్మం అయిన బ్రాహ్మణమతాన్ని పాటించడం , ప్రచారించడం , దానిలో క్రూరత్వాన్ని చెప్పకపోవడం , అస్పృశ్యత బానిస సంకెళ్ళను ఆభరణంగా భావించడం. కుల ధర్మాలను వాటి పవిత్రతను , నియమావలి చెప్పే మత గ్రంతాలను ఖండించకపోవడం.
9. అంబేద్కర్ యొక్క అంత్య సందేశం అయిన Educate , Agitate , Organize సరిగా అర్థం చేసుకోక బోధించు, సమీకరించు,పోరాడు అని తప్పుడు అనువాదాన్ని , తప్పుడు అమరికతో వెళ్ళడం , తప్పుడు సందేశాన్ని ఇస్తుంది అని గుర్తించక పోవడం
పైవన్నీ తెలుసుకోకపోవడం వలన మన దేశ సమస్యను అర్థం చేసుకోలేక పోతున్నాము, మన సమస్యను అర్థం చేసుకోలేక పోతున్నాము. సమస్యే అర్థం కానప్పుడు పరిస్కారం ఎలా కనిపిస్తుంది, వారు కృషి కులనిర్ములన కోసం అవుతుందా లేక కుల పునర్ నిర్మాణం (కుల వ్యవస్తను బలపరచడం) చేస్తున్నరా ?
అసలు యస్సీల ప్రధాన సమస్య ఏమిటి ?
అస్పృశ్యత అంటే ఏమిటి ?
అస్పృశ్యత నల్ల అసమానత్వం వచ్చిందా లేక అసమానత్వం వల్ల అస్పృశ్యత వచ్చిందా?
మనకి మొదట స్పష్టత కావాలి.
పెట్టదారి కులాలు సెజ్ లు, పరిశ్రమాలు, ఐటి పార్కులు, గోల్ఫ్ పార్కులు, ఎ వన్ రేష్లు, విమానాశ్రయాలు, రాజధానులు, ఇలా రకరకాల పేర్లతో కబలిస్తుంటే మనం మాత్రం కూలీలుగా, పారిశుధ్య కార్మికులుగా, సేవకులుగా, బానిసగా మగ్గుతున్నారు. 4వ తరగతి ప్రజలుగా బతుకుతున్నారు.
అన్ని అనర్ధాలకు కారణం అస్పృశ్యత :
సామాజిక బానిసత్వానికి,ఆర్ధిక బానిసత్వానికి రాజకీయ పలేరుతనానికి దెబ్బలుతినే పిరికితనానికి, అవమానాలు పొంది అభిమాన హీనత్వానికి, అన్యాయాలను ఎదురించలేని పిరికితనానికి, అత్యాచారాలు సహించే లజ్యారహిత్యనికి, హక్కులు వున్నా వాటిని డిమాండ్ చెయ్యలేని నిస్సయతకు మూల కారణం అస్పృశ్యత. అస్పృశ్యత యస్సిలను మానసికంగా బానిసను, శారీరకంగా దుర్భాలుడిగా , అసమర్డుడిగా, పిరికివాడిగా మారుస్తున్నది. అస్పృశ్యత కొనసాగినంత కాలం వరకు ఈ భాదలు తప్పవు. అస్పృశ్యత నుంచి బయటపడినప్పుడే మనకు అన్ని శక్తులు లభిస్తాయి.
అస్పృశ్యత రాజకీయ శక్తిని హరించింది.
రాజ్యాంగం యస్సిలకు రాజకీయ హక్కులను కల్పించినది అయితే అస్పృశ్యత వాటిని ఉపయోగించకుండా నిరోధిస్తుంది. అస్పృశ్యత యస్సిలను సామాజికంగా, రాజకీయంగా అధములుగా చేసింది. శక్తిహీనులుగా, బానిసలుగా చేసింది. తత్పలితంగా రాజకీయ హక్కులను స్వతంత్రంగా ఉపయోగించే సామర్ధం కోల్పోయి హిందువులకు అనుకూలంగా, హిందువుల ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్తితి ఏర్పడినది. సామాజిక, ఆర్ధిక పరాదినత్వం వాళ్ళ పెట్టడాలి కులాల పార్టీలకు అనుకూలంగా వ్యవహరించవలసి వస్తున్నది. ఈ విధంగా అస్పృశ్యత యస్సిల రాజకీయ శక్తిని హరించివెస్తున్నది. తమ విముక్తికి ఆయుధమైన రాజకీయ శక్తిని స్వచ్చందంగా నిర్వీర్యం చేసుకొనే విధంగా అస్పృశ్యత మనలను శాసిస్తున్నది. ఈ అస్పృశ్యత నుండి బయట పడందే రాజకీయ శక్తి సాధించడం సాధ్యపడదు. రాజకీయ శక్తి లేకుండా అభివృద్ధి చెందడం ఆసాద్యం. కాబట్టి అస్పృశ్యత నిర్మూలన మన ప్రాథమిక బాద్యత. యీ విధంగా మనిషికి మనిషి , మనిషికి మతానికి , మనిషికి ప్రబుత్వానికి మద్య సంబందాన్నిచెబుతూ మనిషి ఇంకొక మనిషికి బానిస కాకుండా , అసమానత్వాన్ని చెదించెవిధంగ, సమానత్వాన్ని బలపరిచే విధంగా చైతన్యం పరుచుతూ ప్రజల్ని విజ్ఞానించడం (EDUCATE చెయ్యడం ), Educate అయినవారూ వారు అస్పృశ్యతపై , కుల వ్యవస్తపై , బానిసత్వంపై , అసమనత్వంపై ఎదురించించి ఉద్యమం(AGITATE) చేస్తు, ఉద్యమములో వచ్చేవారినీ వ్య్వస్తికరించడమే(ORGANIZE ) అంబేద్కరిజం. మన దేశ సమస్య అయినా కులం, దాని కులనిర్ములణ కోసం పని చేయ్యాడమే దిశఅభిమనీ/దేశం మీదా ప్రేమ కలవారూ. వారే అంబేద్కరువాదులు
Like   Comment   
Comments
Venkat Bi Jai Bheem 
Chandra sekhar. Good analysis. Superb

LikeReply321 hrs
Durgam Chandrasekhar Thank you bro
LikeReply120 hrs
Mala Sena Touch on this link and get in to mala caste information website.
http://www.malasena.org


Mala Sena Organisation
MALASENA.ORG
LikeReply18 hrs
Srinivasbhim Zade Chandu bro superb
LikeReply118 hrs
Adv Mahendra Jadhav Ur evolving as a grt writer dada
LikeReply116 hrs
Adv Mahendra Jadhav Am so happy
LikeReply116 hrs
Sreenivasulu Kedem Good analysis Durgam. Jai Bheem.
LikeReply112 hrs
Jagadish Kumar దుర్గం నీది దిల్లు దోచిన ప్రయత్నం.. కానీ చిన్న ప్రశ్న... రాజ్యాధికారం వద్దా? రాజకీయ శక్తిగా మాత్రమే ఉండాల్నా? రాజ్యాధికారం మరెవరికి ఉండాలి? నేను ఈ ప్రశ్న వేసే ముందు మళ్లీ నీ ఎనాలిసిస్ చదివిన. అయినా ఈ డౌటు అడగాలినిపించింది. జర ఈ మట్టిబుర్రను కనికరించు...
LikeReply210 hrs
Chaithanya Kurapati భారత దేశ చరిత్రను గమనిస్తే ... రాజ్యాధికారం ఒక తోలు బొమ్మల ఆట లాంటిదే... ప్రాచీన చరిత్రలో ఏ వర్ణం రాజ్యం చేసినా.. మధ్య యుగ చరిత్రలో ఏ మతం రాజ్యం చేసినా.. స్వతంత్రానంతరం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా... బ్రాహ్మణత్వం ఏర్పరిచిన చట్రంలోనే పాలన సాగింది... బ్రాహ్మణత్వాన్ని �బలపరుస్తూనే వస్తోంది .. అంటే ఏ వ్యవస్థనైనా నడిపించగల రాజకీయ శక్తిగా ఈ నాటికీ బ్రాహ్మణత్వం కొనసాగుతుంది .. అదే విధమైన వ్యవస్థలో SCలు అధికారం చేజిక్కించుకున్నప్పటికీ వారిని వెనుక ఉండి నడిపేది బ్రాహ్మణత్వమే.. అటువంటి అధికారం ఏ విధంగానూ అఖ్ఖరకు రాకపోగా... బ్రాహ్మణత్వాన్ని బలపరచడానికి SCలు కూడా పావులుగా ఉపయోగపడతారు... ఒక బానిస ఇంకా బానిసగానే ఉంటూ చేసే రాజ్యాధికారం బానిసత్వంలో తన బాధ్యతను పెంచుతుందేగానీ.. నిర్మూలనకు ఏమాత్రం ఉపయోగపడదు..
మహద్ చెరువు పోరాట సమయంలో బాబాసాహెబ్ తన ప్రసంగంలో ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేక వ్యవస్థను నిర్మించడానికే ఈ ఉద్యమం అంటారు.. రాజ్యాంగంలో కూడా అదే ప్రయత్నం చేసారు.. అంటే ముందుగా అబద్ధాలతో, మోసాలతో, మభ్యలతో నిండి ఉన్న బ్రాహ్మణత్వాన్ని రీప్లేస్ చేయగల ఒక శక్తిగా SCలు నిర్మాణం చెందాలి, అధికారం తరువాత అంశము..

UnlikeReply210 hrs
Durgam Chandrasekhar యి దేశన్నీ మనం పరిపాలిస్తి, మంచిదే. ప్రదానమంత్రీ, ముఖ్యమంత్రీ ఆనే పదవులూ ఓక పరాధాలంటీది. దాని కంట్రలు వేర చోట వఉంటుంది. మనవారీ దీన పరిస్తితీ లో వున్నవారికీ , రోజూ మహిలాలపై దాడి జరిగినా, సజివా దాహనం చేసినా, నగ్నంగా ఉరేగించినా, చేట్టూకు కట్టేసీ కోట్టఇనా ఏదురించలేనీ ప్రజలకూ రజ్యధికారం అనేదీ తేల్ల కాగితం మీదా చక్కేర అని వ్రాసీ తిను అన్నటు ఉంటుంది. చదవడానికీ తియ్యాటిది తినడానికీ కాదూ. అస్ప్రుశ్యతను, కులాలనూ బలపరుచుతూ మనం పాలకులూ అయినా, ఆ ప్రయానం మన వారీ మాన ప్రానలా, శవాలాపై నడూస్తు పాలకులం ఆనే గమ్మ్యన్నీ చేరగలం. రజకియాము చేయూ కానీ కానీ కులాలనూ బలపరుస్తూ కాదూ.
LikeReply110 hrs
Jagadish Kumar -- ఊహూఁ.... ప్రశ్న మళ్లీ అడుగుత... రాజకీయ శక్తిగా మారిన తరువాత లక్ష్యం ఏమై ఉంటుంది? రాజ్యాధికారమా కాదా? రాజ్యాధికారంలోకి రావడం తప్పా? 
-- భారతదేశంలో విప్లవం రావాలంటే 360 డిగ్రీల్లో కులం అడ్డుగోడగా ఉంటుంది. దానిని బద్దలు చేస్తేనే విప్లవం వస్తుంది. సోషలి
జం వైపు అడుగేస్తుంది. ఏదోరూపంలో విప్లవం వచ్చినా దానిని ధ్వంసం చేసేందుకు కులం ప్రయత్నిస్తుంది. అప్పుడైనా సరే కులంతో తలపడాల్సిందేనని అంబేద్కర్ చెప్పారు. (జాత్ పాత్ తోడ్ మండల్ వారి సభలో చేయాల్సిన ప్రసంగంలోని అంశమిది)
--ఈ కోణంలో చూసినప్పుడు రాజకీయశక్తి, రాజ్యాధికారం ఏదో ఒకటి కాస్త వెనుక ముందు వచ్చాయనుకో.. అప్పుడు రాజ్యాధికారం అనే నినాదం తప్పా? రైటా? రాజ్యాధికారంలోకి రావాలని కోరుకోవడం వక్రీకరించడం ఎలా అవుతుంది?

LikeReply10 hrs
Durgam Chandrasekhar పాలకులూ కవలనీ కోరుకోవడం తప్పు కాదు, కులనిర్ములనను ఏదురిస్తూ చేసి రాజకియాలూ మన అస్ప్రుశ్యత, కుల వ్యవస్తకు ఇంకా బలపరుస్తాయీ.
UnlikeReply110 hrs
Jagadish Kumar మరి అదేదో తప్పు అన్నట్లు మీ పోస్టు ఉన్నదే... ఒకమారు సరిచూసుకోండి..
LikeReply10 hrs
Durgam Chandrasekhar రాజకీయా శక్తి సాదించని మన అభివ్రుద్దీ సాద్యాపడదు అని వ్రసినాను. కాని రాజకియా శక్తి గా ఏదగలేకా పోవడానికీ అస్ప్రుశ్యత అడ్డూవస్తున్నదీ అని వ్రసినానూ చుడండి బ్రో.
LikeReply10 hrs
Jagadish Kumar రాజకీయశక్తి అంటే మీరన్నట్లు 10శాతం ఓటర్లు ఒక్క మాట మీద ఉండడం అంతేనా? అదయితే అభివృద్ధి సాధ్యపడుతుందా? 10శాతం ఓటర్లు అది కూడా ఎస్సీ ఓటర్లు ఒక్కతాటిపైకి వస్తే ఇది సాధ్యం అంతేకదా! వీరు ఒక్కటవ్వడానికి అస్పృశ్యతకు లింకేంటి? వీరి మధ్య కూడా అస్పృశ్యత ఉన్నదా? కొంచెం నన్ను కన్ ఫ్యూజ్ చేసినట్లున్నావ్...
LikeReply10 hrs
Jagadish Kumar
Write a reply...
Jagadish Kumar మరి అదేదో తప్పు అన్నట్లు మీ పోస్టు ఉన్నదే... ఒకమారు సరిచూసుకోండి..
LikeReply10 hrs
Jagadish Kumar ఇంకొన్ని ప్రశ్నలు..
--------------------------------------------------------
1. //రాజ్యాధికారం అంటే రాజు యొక్క అధికారం// ఇది కరెక్టేనా? మరి రాజ్యంపై అధికారానికి సరైన పదమేది?

2. // 70 సంవత్సరాలనుండి యస్సీలు రాజ్యాధికారం ఎందువల్ల సాధించలేకపోతున్నారు? సాధించామని చెప్పుతున్న చోట అస్పృశ్యత ఎందుకు నిర్మూలింపబడలేదు? అలాంటప్పుడు రాజ్యాధికారం వల్ల ప్రయోజనం ఏమిటి ?// అన్నగారూ... ఎందువల్ల సాధించలేకపోతున్నారు అని అడిగారు.. ఆ వెంటనే సాధించిన ప్లేసులున్నాయని చెబుతున్నారు. ఉంటే అవేంటి? అక్కడ జరిగిన పనేంటి? కుల వ్యవస్థను నిర్మూలించడానికి చేసిన కృషి ఏంటి? ఎందుకు అక్కడ ఫెయిల్ అయ్యింది? ఇవేవీ చెప్పకుండా రాజ్యాధికారం వల్ల ప్రయోజనం ఏంటి అనడం సబబు కాదేమో???
3. // యస్సీలు దాదాపు 20% ఉన్నారు. అందులో కనీసం 10% ఓట్లను మనం అంటే అంబేద్కర్ పార్టీ సాధించగలిగితే మనం రాజకీయ శక్తి సాధించినట్టే. // ఇది ఎక్కడి లెక్క? దేశం మొత్తం మీదనా? లేదా ఒక రాష్ట్రంలోనా? లేదా ఒక ఎంపిసీటులోనా? లేదా ఒక ఎమ్మెల్యే సీటులోనా? అంతటా ఇట్లనే ఉంటదా? 20లో 10 ఎందుకు? 20 ఎందుకు కాకూడదు? ఇక ఈ అంబేద్కర్ పార్టీ అంటే ఏమిటి?

LikeReply10 hrs
Chaithanya Kurapati రాజకీయ శక్తిగా మారిన తరువాత వనరుల మీద ఆథిపత్యం ... అధికారం మజిలీ మాత్రమే .. అంతిమ లక్ష్యం కానే కాదు.. అధికారం ఒక్కోసారి భారం కావచ్చు.. లక్ష్యానికి దూరం చేయనూవచ్చు.. కాబట్టి అధికారం కేవలం పావు మాత్రమే .. రాజకీయ శక్తిగా మారిన తరువాత అధికారం ప్రాధాన్యత లేని విషయం... మనుధర్మం బలపరిచింది, వ్యవస్థీకృతం చేసింది బ్రాహ్మణత్వాన్నే.. కానీ అది వ్యవస్థీకృతం చేసే బాధ్యత పాలకుల మీద ఉంచబడినది.. బ్రాహ్మణుడే ఈ అమలు బాధ్యత తన భుజానికెత్తుకోలేదు (అత్యవసరం అయితే తప్ప).. పాలకుడు క్షత్రీయుడైనా, శూద్రుడైనా సరే... అందుకే రాజకీయ శక్తిగా మారిన తరువాత అధికారం పావు మాత్రమే
LikeReply19 hrsEdited
Chaithanya Kurapati బానిసత్వంలో ఉండి చేసే రాజ్యాధికారం వలన ఆ బానిసత్వాన్ని మరింతగా బలపరిచే బాధ్యతను భుజాన వేసుకున్నట్లే.. మరి ఉద్యమాలను ఈ వైపుకు ఆకర్షించడం పొరపాటే కదా??
LikeReply110 hrs
Sakthi Swaroopini jagadeesh anna ipudnna konthamandi dalithanayakulu(karem sivaji mmandakrishna so on) rajyadikaram vype unnaru kada mari vallu chestunnademiti....just think...
UnlikeReply29 hrsEdited
Jagadish Kumar రూపాన్ని చూసి సారాన్ని అంచనా వేస్తే వచ్చే చిక్కిదే.. వారికి రాజ్యాధికారానికి సంబంధం ఏంటి? వారి ఉద్యమం రిజర్వేషన్లలో వర్గీకరణ సందర్భంలో పుట్టింది. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచబ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉవ్వెతున్న లేస్తున్న సందర్భంలో వాటిని చీల్చడానికి పాలకవర్గం ఆడిన నాటకంలోంచి పుట్టిన 'అమాయకపు` సంఘాలవి.

-- ``అమాయకపు`` ఎందుకంటే? ఉమ్మడిగా కలిసి అన్నింటిలో రిజర్వేషన్లు కావాలి లేదా మరిన్ని చోట్ల రిజర్వేషన్లు కావాలి అని అడగకుండా తగ్గిపోతున్న ప్రభుత్వరంగంలో ఉన్న రిజర్వేషన్ల విభజన మీద ఒకరినొకరు కొట్టుకున్న సంఘాలవి. రెండు పిల్లులు ఒక కోతి కథ గుర్తుంది కదా! అందులో పిల్లులు అమాయకమైనవా? కాదా?

-- `అమాయకపు` సంఘాలైనప్పటికీ అవి అద్భుతమైన పని చేశాయి. మాల, మాదిగ అనడానికి భయపడుతున్న రోజుల్లో ధైర్యంగా నేను ఫలానా మాదిగ, లేదా నేను ఫలానా మాల అని రొమ్ము ఇర్సుకుని చెప్పే అస్తిత్వ చైతన్యాన్ని తీసుకువచ్చాయి. ఇలాంటి చైతన్యం రావడం, అంబేద్కర్ చెప్పిన ఆత్మాభిమానం అన్నదానిని బలంగా సమాజంలోకి తీసుకెళ్లడంలో ఇవి విజయవంతమయ్యాయి. ఇవి అగ్రకులమదానికి కౌంటరే. కానీ వీరు కొట్లాడుకోవడం వల్ల ఈ అస్తిత్వ చైతన్యం ఎంతైతే ఫలితాలివ్వాలో అంత ఇవ్వలేకపోయింది.

-- ``అమాయకపు`` అని ఇంకా ఎందుకన్నానంటే ఎవరు వర్గీకరణ ఇస్తామంటారో వారివైపు వీరు వెళ్తుంటారు. ఎందుకు? వారి వెనుక ఫలానా నిర్దిష్ట శాతంలో ఓటర్లున్నారు. కాబట్టి తమను తాము ఒక రాజకీయశక్తిగా భావించారు. కానీ రాజ్యాధికారంలో ఉన్న వారు వేరే. తమ కోర్కె నెరవేరాలని, నెరవేరుస్తామన్నవారికల్లా మద్ధతు ఇస్తూ పోయారు. ఫలితం మళ్లీ అమాయకలయ్యారు. మోసపోతూనే ఉన్నారు.

-- అందుకే కేవలం రాజకీయ శక్తిగా ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయ్...

LikeReply8 hrs
Sakthi Swaroopini jagadeesh anna nuvu communism suporter vaa
LikeReply7 hrs
Jagadish Kumar అవును
LikeReply7 hrs
Jagadish Kumar

Write a reply...
Jagadish Kumar Chaithanya Kurapati
1. అదే అడుగుతున్న... రాజకీయశక్తి అంటే ఏమిటి? దుర్గం చెప్పినట్లు 10శాతం దళిత ఓట్లు ఒక్కటవ్వడమా? దానికి అస్పృశ్యత ఎలా అడ్డుపడింది? 10శాతం దళిత ఓట్లు ఏ ప్రాతిపదికన ఒక్కటవుతాయి? లేదా ఒక్కటవ్వాలి? వారికి బ్రాహ్మణత్వం పీచమణచాలి అని ఉన్నదన
ుకుందాం. లేదా రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉన్నప్పటికీ తమకు కావాల్సినవి రప్పించుకునేందుకు అనుకుందాం. అప్పుడు కూడా ఒకడు ఇచ్చేవాడు.. రెండో వాడు కొట్లాడి పుచ్చుకునేవాడుగానే ఉండిపోతారు కదా! ఇచ్చేవాడిగా ఎదగాలి అనే మానసిక స్థితికి ఎందుకు ఎదగడం లేదు? 

2. 3000 ఏళ్లుగా అధికారాన్ని ఏలుతున్న వారికి అధికారం భారం కాలేదు. దళితులకు అది భారమవుతుందా? భారం అని అనుకున్న తరువాత సామర్థ్యం, సమర్థత, చేతన అవ్వడం లాంటి ఉప ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఇది గమనంలో ఉంచుకోండి.

3. //రాజకీయశక్తిగా మారిన తరువాత అధికారం ప్రాధాన్యత లేని విషయం// అవునా? ఏదైనా ఒక అంచనాకు లేదా తీర్పుకు రావాలంటే కొన్ని వాస్తవాంశాల ఆధారంగా రావాలి. దీనిని నమ్ముతారా? నేనిప్పుడు అడిగే ప్రశ్న రాజకీయశక్తిగా మారిన తరువాత రాజ్యాధికారం ప్రాధాన్యత లేని విషయమని ప్రపంచ చరిత్రలో ఏ సందర్భంలోనైనా ఎవరైనా ఊటంకించారా? లేదా అలా జరిగిందా? అలాంటి పరిస్థితి ఆ దేశంలో లేదా రాజ్యంలో ఎన్నాళ్లు మనగలిగింది?

LikeReply9 hrs
Chaithanya Kurapati రాజ్యం అంటే kingdom.. మనకిప్పుడు రాజ్యాలు లేవు.. అయినా 90% మామూలు ప్రజలకు అర్థంకాని.. మేధావులకే పరిమితమైన "ఈ పదాలపై పోరాటం" పదాలతో పోరాటం చేసి జనబాహుళ్యానికి ఉద్యమాన్ని దూరం చేయడం, ఒక అర్థంకాని జఠిల పదార్థంగా మార్చడానికి నేనైతే వ్యతిరేకిని... పైన జరుగుతున్న చర్చ ఉద్యమ స్వరూపం మీద మాత్రమే కానీ ఉద్యమ పదజాలం మీద కాదని గమనించాలి..
UnlikeReply19 hrs
Jagadish Kumar agreed
LikeReply9 hrs
Jagadish Kumar

Write a reply...
Jagadish Kumar Chaithanya Kurapati
4. //మనుధర్మం బలపరిచింది, వ్యవస్థీకృతం చేసింది బ్రాహ్మణత్వాన్నే.. కానీ అది వ్యవస్థీకృతం చేసే బాధ్యత పాలకుల మీద ఉంచబడినది.. పాలకుడు క్షత్రీయుడైనా, శూద్రుడైనా సరే... అందుకే రాజకీయ శక్తిగా మారిన �తరువాత అధికారం పావు మాత్రమే//
-- ఇందులో
 మూడు అంశాలున్నాయి. ఒకరు పాలించే వారు.. రెండోది రాజ్యాంగం.. మూడోది రాజ్యాధికారం.. పాలించేవారు రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి శూద్రులైనా సరే ఆ రాజ్యాంగాన్ని అనుసరించే నడవాల్సి ఉంటుంది. గుడ్ నేను కాదనను. ఆ రాజ్యాంగం మనుధర్మశాస్ర్తం అయ్యిందనుకుందాం. ఏం? దానిని అనుసరించే పాలించాలా? దానిని మార్చకూడదా? మార్చాలంటే పార్లమెంటు బయట కేవలం రాజకీయశక్తిగా ఉంటే సరిపోతుందా? పూర్తిస్థాయి అధికారం అవసరం అవుతుందా? చిన్న లాజిక్కే.. మరి అలాంటప్పుడు రాజ్యాధికారం అనేది పావు ఎలా అవుతుంది. అది కీలకం అవ్వాలి కదా!

LikeReply9 hrs
Durgam Chandrasekhar 1.రాజ్యధికారం అంటే రాజకియా అధికరం, రాజూ అధికరం. Political Power ఆనే పదన్నీ రజ్యధికరం కా అనువాదం చేస్తున్నరూ. రాజ్యధికారం english లో Political authority గా translate అవుతుంది. కానీ కోందరు దానిని తప్పుడు అనువాదలతో మన తక్షనా కర్ఠవ్యం అయినా కులనిర్ములనకి గండి కోడుతున్నరూ.
2. UP రాజకియా అధికరం సదించామూ అని BSP చేప్పూకుంటుంది. అక్కడాఅస్ప్రుశ్యతా ఏందుకూ నిర్ములించబదలేదూ. దేశంలో ఏక్కవా దాడులు అక్కడే జరుగుతున్నయీ.
3.రాజకియా శక్తీ పోందవలసినదీ ప్రతి గ్రమంలో, ప్రతి వార్డ్ లో, ప్రతి కాన్సీటేన్సలో అలగే దేశంలో
బాబాసాహేబు అంబేద్కరూ పార్టి అంటే ఆయన ఆశయం కోసం అతని సిద్ధాంతముతో పనీ చేసి పార్టి.

LikeReply19 hrs
Jagadish Kumar మంచి ప్రయత్నం... ఇంకొన్ని ప్రశ్నలు
4. //అస్పృశ్యత నల్ల అసమానత్వం వచ్చిందా లేక అసమానత్వం వల్ల అస్పృశ్యత వచ్చిందా?// ఇంతకు దీనికి మీ సమాధానం ఏంటి? లేదా ప్రశ్ననే తప్పా?
5. ///పెట్టదారి కులాలు సెజ్ లు, పరిశ్రమాలు, ఐటి పార్కులు, గోల్ఫ్ పార్కులు, ఎ వన్ రేష్ల
ు, విమానాశ్రయాలు, రాజధానులు, ఇలా రకరకాల పేర్లతో కబలిస్తుంటే మనం మాత్రం కూలీలుగా, పారిశుధ్య కార్మికులుగా, సేవకులుగా, బానిసగా మగ్గుతున్నారు. 4వ తరగతి ప్రజలుగా బతుకుతున్నారు. // ఎస్సీలకు ఇవన్నీ ఇస్తే సరిపోతుందా? మోడీ సర్కారు సైతం ఎస్సీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రుణం ఇస్తానంటోంది కదా!

LikeReply9 hrs
Jagadish Kumar

Write a reply...
Chaithanya Kurapati 1.రాజకీయ శక్తి గా మారేందుకు కావలసిన అంశాలలో ఒక అంశం మాత్రమే అయిన జనబల సమీకరణ గురించి మాత్రమే దుర్గం అన్న ఉదహరించారు.. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి .. కనీసం రెండు రోజులు చర్చించుకోదగ్గ అంశము.. ఒక పోస్టులో పూర్తి రూపం రావాలనుకోవడం సరి కాదు... 

2. 3000 ఏళ్ళు
 అధికారా�న్ని ఏలుతున్నారు... మంచి పాయింట్.. ఎవరు ఏలారు... ఎవరు నడిపించారు?? ఏ వ్యవస్థను బలపరిచారు... బ్రాహ్మణత్వాన్ని అమలు పరుస్తూ వచ్చిన ఈ మూడు వేళ్ళ ఏళ్ళ పాలనలో బ్రాహ్మణులు రాజ్యం చేసిన సందర్భాలు ఎన్ని.. అవి ఏవి?? ఈ విషయాలు గమనిస్తే రాజకీయ శక్తికి, పాలనాధికారానికీ ఉన్న తేడా సులభంగా గురించవచ్చు..

3. ఈ పాయింట్ కు కూడా రెండో పాయింట్ లోనే సమాధానం చెప్పవచ్చు... రాజకీయ శక్తిగా మారిన బ్రాహ్మణులు.. మౌర్యుల పాలన, రాజపుత్రుల లొంగుబాటు, బ్రిటిష్ రాజ్య సరళీకృత (మరియు inclusive ) పాలన లాంటి బ్రాహ్మణత్వానికి ప్రమాదంలో పడిన సందర్భాలలో మాత్రమే ప్రత్యక్షంగా పాలనను అమలు చేసే బాధ్యతను తమ చేతులలోకి తీసుకున్నారు తప్ప ఎప్పుడూ కూడా తెర వెనుక శక్తిగా ఉండడానికి ఇష్టపడ్డారు... పాలకులు మారారు కానీ రాజకీయ శక్తిగా ఉన్న బ్రాహ్మణత్వం, చెక్కు చెదరలేదు...

మీరు అడిగిన చారిత్రక ఆధారం విషయానికొస్తే "బౌద్ధం" మంచి ఉదాహరణ ... బౌద్దం బ్రాహ్మణత్వ వ్యవస్థను భర్తీ చేసిన తరువాతనే ఆశోకుని సామ్రాజ్యం సాధ్యమైంది... మౌర్య రాజ్యం కూల్చినంత తేలికగా బౌద్దాన్ని అంతం చేయలేకపోయింది బ్రాహ్మణత్వం ... పాలకునిగా ఉండడం కంటే రాజకీయ శక్తిగా మారడం అనేదే బలమైన అంశం అని ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తుంది

UnlikeReply29 hrsEdited
Jagadish Kumar Chaithanya Kurapati
1. //రాజకీయ శక్తి గా మారేందుకు కావలసిన అంశాలలో చాలా అంశాలు ఉన్నాయి .. కనీసం రెండు రోజులు చర్చించుకోదగ్గ అంశము.. ఒక పోస్టులో పూర్తి రూపం రావాలనుకోవడం సరి కాదు... // అగ్రీడ్.. అవెయిటింగ్... ఎదురుచూస్తుంట..


2. // బ్రాహ్మణత్వాన్ని అమలు పరుస్తూ వచ్చిన ఈ మూడు వేళ్ళ ఏళ్ళ పాలనలో బ్రాహ్మణులు రాజ్యం చేసిన సందర్భాలు ఎన్ని.. అవి ఏవి?? ఈ విషయాలు గమనిస్తే రాజకీయ శక్తికి, పాలనాధికారానికీ ఉన్న తేడా సులభంగా గురించవచ్చు..//
అవునా? చర్చ బ్రాహ్మణవాదాన్ని, బ్రాహ్మణత్వాన్ని, మనువాదాన్ని లేదా అవి సృష్టించిన రాజ్యాంగాన్ని, దానిని బట్టి నడిచే రాజ్యాధికారాన్ని గురించి అయినప్పుడు బ్రాహ్మణుల ప్రస్తావన ఇక్కడేంటి? రాజకీయశక్తికి, పాలనాధికారానికి తేడా గురించి నేను నాలుగో పాయింటులో చెప్పాను. ఒకమారు చూడండి. 

3.// రాజకీయ శక్తిగా మారిన బ్రాహ్మణులు.. మౌర్యుల పాలన, రాజపుత్రుల లొంగుబాటు, బ్రిటిష్ రాజ్య సరళీకృత (మరియు inclusive ) పాలన లాంటి బ్రాహ్మణత్వానికి ప్రమాదంలో పడిన సందర్భాలలో మాత్రమే ప్రత్యక్షంగా పాలనను అమలు చేసే బాధ్యతను తమ చేతులలోకి తీసుకున్నారు తప్ప ఎప్పుడూ కూడా తెర వెనుక శక్తిగా ఉండడానికి ఇష్టపడలేదు.. పాలకులు మారారు కానీ రాజకీయ శక్తిగా ఉన్న బ్రాహ్మణత్వం, చెక్కు చెదరలేదు...// బ్రాహ్మణవాదాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో దానికి ఆటంకాలు వచ్చినప్పుడు వారే పాలకులయ్యారన్నది మీ ఉదాహరణ సారాంశం. సో... వారికి ఎప్పుడు ప్రమాదం కనిపించింది? తమ రాజ్యాంగాన్ని, లేదా తమ మనువాదాన్ని ధిక్కరించి అధికారం చేజిక్కించుకున్న క్రమంలోనే కదా.. మీ ఉదాహరణలు కూడా వాటినే చెబుతున్నాయి. రాజ్యాధికారం లేకపోవడం వల్ల బ్రాహ్మణవాదం పునఃస్థితికి లేదా మరింత బలమైన స్థితికి చేరింది. మీరు రాసింది మరోమారు చదవండి.

4. // మీరు అడిగిన చారిత్రక ఆధారం విషయానికొస్తే "బౌద్ధం" మంచి ఉదాహరణ ... బౌద్దం బ్రాహ్మణత్వ వ్యవస్థను భర్తీ చేసిన తరువాతనే ఆశోకుని సామ్రాజ్యం సాధ్యమైంది... మౌర్య రాజ్యం కూల్చినంత తేలికగా బౌద్దాన్ని అంతం చేయలేకపోయింది బ్రాహ్మణత్వం ... పాలకునిగా ఉండడం కంటే రాజకీయ శక్తిగా మారడం అనేదే బలమైన అంశం అని ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తుంది// 
-- బౌద్ధం బ్రాహ్మణత్వ వ్యవస్థను భర్తీ చేసిందా? బ్రాహ్మణత్వ వ్యవస్థ అంటే ఏంటి? అందులో ఉండే అంశాలేంటి? వాటిల్లో ఏ అంశాలను అదిభర్తీ చేసింది? మిత్రమా!! బౌద్ధం బ్రాహ్మణవాదాన్ని గట్టిగా ఢీ కొందనడంలో ఎలాంటి సంశయానికి తావులేదు. అయితే అది వ్యవవస్థను రీప్లేస్ చేయలేకపోయింది. అందుకే అది మన దేశంలో ఇనాక్టివ్ దశలోకి చేరిపోయింది. అంబేద్కర్ సాబ్ వల్లే మళ్లీ దానికి అంత ప్రాధాన్యత వచ్చింది. ఇది హిస్టరీ.. క్యాస్ట్ ఎనిహిలియేషన్ ఒక మారు చదువు. అదే సందర్భంలో బౌద్ధం ఎందుకు? అనే పుస్తకంలో బౌద్ధానికి ఉన్న పరిమితులను అంబేద్కర్ చర్చించారు. ఒకమారు ఆ పుస్తకం కూడా చదవండి. అప్పుడు మీరు వచ్చిన అంచనా సరైనదో కాదో మీరే చెబుతారు.

LikeReply9 hrs
Chaithanya Kurapati 4. ఉదాహరణ తీసుకుందాం.. 1976 లో 42వ రాజ్యాంగం సవరణ ద్వారా రాజ్యాంగంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది.. పాలన మారిన తరువాత మళ్ళీ తిరిగి సవరించడం జరిగింది... కేవలం పార్లమెంటులో ఉన్న తాత్కాలిక బలంతో ఒక కొత్త వ్యవస్థ నిర్మాణం జరుగుతుందనుకోవడం అత్యాశే.. రాజకీయ శక్తి రాజ్యాంగ మౌళిక స్వరూపాన్ని కూడా మార్చగలిగేటంత బలమైనది, (అది కూడా సవరణ చేయకుండానే ).. ఉదాహరణకు రాజపుత్రులు ముస్లిం పాలకులకు లొంగిన సమయంలో బ్రాహ్మణత్వాన్ని కాపాడే బాధ్యత శూద్రులకు ఇవ్వబడినది... దీనికి ఏ మనుధర్మం అడ్డు రాలేదు.. ఆనాటినుండీ ఇప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుత్వాన్ని మోసే బాధ్యతను శూద్రులు మోస్తూనే ఉన్నారు.. ఇప్పడు ఉత్తరాదిలో SCల మీద అత్యధికంగా దాడులు చేస్తున్నది శూద్రకులాలే.. ఇది ఆ బ్రాహ్మణత్వాన్ని అమలు చేసే బాధ్యతలో భాగమే..
LikeReply19 hrs
Jagadish Kumar Sakthi Swaroopini 
రూపాన్ని చూసి సారాన్ని అంచనా వేస్తే వచ్చే చిక్కిదే.. వారికి రాజ్యాధికారానికి సంబంధం ఏంటి? వారి ఉద్యమం రిజర్వేషన్లలో వర్గీకరణ సందర్భంలో పుట్టింది. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచబ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉవ్వెతున
్న లేస్తున్న సందర్భంలో వాటిని చీల్చడానికి పాలకవర్గం ఆడిన నాటకంలోంచి పుట్టిన 'అమాయకపు` సంఘాలవి.

-- ``అమాయకపు`` ఎందుకంటే? ఉమ్మడిగా కలిసి అన్నింటిలో రిజర్వేషన్లు కావాలి లేదా మరిన్ని చోట్ల రిజర్వేషన్లు కావాలి అని అడగకుండా తగ్గిపోతున్న ప్రభుత్వరంగంలో ఉన్న రిజర్వేషన్ల విభజన మీద ఒకరినొకరు కొట్టుకున్న సంఘాలవి. రెండు పిల్లులు ఒక కోతి కథ గుర్తుంది కదా! అందులో పిల్లులు అమాయకమైనవా? కాదా?

-- `అమాయకపు` సంఘాలైనప్పటికీ అవి అద్భుతమైన పని చేశాయి. మాల, మాదిగ అనడానికి భయపడుతున్న రోజుల్లో ధైర్యంగా నేను ఫలానా మాదిగ, లేదా నేను ఫలానా మాల అని రొమ్ము ఇర్సుకుని చెప్పే అస్తిత్వ చైతన్యాన్ని తీసుకువచ్చాయి. ఇలాంటి చైతన్యం రావడం, అంబేద్కర్ చెప్పిన ఆత్మాభిమానం అన్నదానిని బలంగా సమాజంలోకి తీసుకెళ్లడంలో ఇవి విజయవంతమయ్యాయి. ఇవి అగ్రకులమదానికి కౌంటరే. కానీ వీరు కొట్లాడుకోవడం వల్ల ఈ అస్తిత్వ చైతన్యం ఎంతైతే ఫలితాలివ్వాలో అంత ఇవ్వలేకపోయింది.

-- ``అమాయకపు`` అని ఇంకా ఎందుకన్నానంటే ఎవరు వర్గీకరణ ఇస్తామంటారో వారివైపు వీరు వెళ్తుంటారు. ఎందుకు? వారి వెనుక ఫలానా నిర్దిష్ట శాతంలో ఓటర్లున్నారు. కాబట్టి తమను తాము ఒక రాజకీయశక్తిగా భావించారు. కానీ రాజ్యాధికారంలో ఉన్న వారు వేరే. తమ కోర్కె నెరవేరాలని, నెరవేరుస్తామన్నవారికల్లా మద్ధతు ఇస్తూ పోయారు. ఫలితం మళ్లీ అమాయకలయ్యారు. మోసపోతూనే ఉన్నారు.

-- అందుకే కేవలం రాజకీయ శక్తిగా ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయ్...

LikeReply9 hrs
Durgam Chandrasekhar రాజకీయా శక్తిగా ఏదగాలీ కాని అది అంబేద్కరు భవజలములో ఏదగాలీ. గాంధీవాదంతో కాదూ. బ్రాహ్మణవాదముతోకాదూ.
అంబేద్కరూ అదించినా ఫలాలు అనుభవించడంలో ఉన్న శ్రద్దా దానినీ కాపాడడంలో లేదు. వర్గికరనలో నాయకులు గాంధీవాదం అదే బ్రాహ్మణవాదం తో ప్రజల ఫలాలు కాపడేి శక్తిని నిర్విర్యం చేసింది.

LikeReply27 hrsEdited
Chaithanya Kurapati కాస్త busy గా ఉండడము వలన చర్చలో పాల్గొనలేకపోతున్నాను... సాయంత్రానికి వస్తాను
UnlikeReply27 hrs
Durgam Chandrasekhar ఏ అస్ప్రుశ్యత నిర్మూలించడానికి బాబాసాహేబు అంబేద్కరు తన జీవితన్ని ధారపోశాడో, ఏ కుల నిర్మూలన కోరకు ఆయన తన కుటుంబాన్ని త్యాగం చేశాడో, ఏ దేశం కోరకు ఆయన తన సర్వస్వాన్ని ధారపోశాడో ఏ ప్రజలకోరకు ఆయన సర్వస్వాన్ని బలీ ఇచ్చడో, ఆ మాహోన్నతునీ ఆశయ సిద్ధికి మనమందరం నిర్విరామంగా క్రుషఇ చేయడం మన ప్రాథమిక విధి. ఆయన తలపట్టఇన లక్ష్యమును సాధించడం మన ఏకైకా లక్షం. అందుకే మనమంతా అంబేద్క్రరిజన్ని చదవాలి, చదివించాలీ, చదివింది అర్ఠం చేసుకోనీ Agitate చేయ్యలీ, చేయ్యించాలీ. ఆ విధంగా ORGANIZE అవ్వాలి. ఏంతగా ఆర్గనైజూ అవుతామో అంతగా లక్ష్యన్ని సాధించడం అవుతుంది. డాఅంబేద్కరు మనకిచ్చినా త్రీ కమాండమేంటు ఆగ్న్యలూ Educate Agitate Organize .ఈ ఆగ్నలనూ అనుసరించడమే అంబేద్కరుకు మనం ఇచ్చే నిజమైనా నివాలి.
LikeReply1 hr
Jagadish Kumar

Write a reply...
Ambedkar Oujac Good bro
LikeReply1 hr
Jagadish Kumar Durgam Chandrasekhar
1. అస్పృశ్యత పల్లెల్లో ఉన్నది. పట్టణాల్లో కంటికి కనిపించని, చెవులకు వినిపించని స్లీప్ మోడ్ లో నడుస్తోంది. దీనర్థం దాదాపు లేదు. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందిన దశ సృష్టించిన కొత్త పరిస్థితి ఇది. అంబేద్కర్ కాలం నాటికి ఇలా లేదు. దీనిని గమనించాలి. దానికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలి.

2. అంబేద్కర్ ఆశయం ఏంటి? కుల నిర్మూలనా? ఆయనే బ్రాహ్మణత్వాన్ని అంత తొందరగా వదిలించుకోలేమని బౌద్ధంలోకి చేరారు. మనం కూడా బౌద్ధంలో చేరాల్నా? లేదా కుల నిర్మూలనకోసం ప్రాక్టికల్ గా కృషి చేయాల్నా?

3. అస్పృశ్యత, కుల నిర్మూలన రెండు మాత్రమే ఆయన లక్ష్యాలనుకుంటే పొరపాటు. `మైనారిటీస్ అండ్ స్టేట్స్` అనే పుస్తకం చదవండి. అందులో ఆయన భూములను, ఆస్తులను జాతీయం చేయమన్నారు. ఇది సోషలిస్టు భావన. అప్పుడు మాత్రమే మనువాద చట్రాన్ని బద్దలు కొట్టగలమని, రాజ్యాంగ ఫలాలు దళితులకు అందుతాయని చెప్పారు. మరి భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా ఆ సోషలిస్టు భావన వైపు అడుగులు వేయాల్నా? లేదా దానిని వదిలేసి పై రెండింటికే పరిమితం కావాల్నా?

4. ఆర్గనైజ్ కావాలని చెబుతున్నాం. ఏ పద్ధతిలో? తన జీవిత చరమాంకంలో అస్పష్ట కార్యక్రమంతో ముగిసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలోనా? లేదా మాన్యవర్ కాన్షీరాం గారు ప్రవచించి ఆచరించిన గత బిఎస్పి లోనా? లేదా మరే రూపంలో ఆర్గనైజ్ కావాలి? ఆర్గనైజ్ ఎలా కావాలి?

5.అంబేద్కరుకు నిజమైన నివాలి అని ఒక్కోరు ఒక్కొక్క భాష్యం చెబుతున్నారు. మీ భాష్యం మీరు చెప్పారు. వాస్తవానికి ఆయన ఊహించిన కులం లేని, కుల పీడన లేని, దోపిడీ లేని సమసమాజం ఇంకో మాటలో చెప్పాలంటే భారతదేశ పరిస్థితుల్లో సోషలిస్టు సమాజాన్ని మనం ఆచరణలో సాధ్యం చేయాలి. అలా చేయాలంటే కుల నిర్మూలనకు కట్టుబడి, సమసమాజం లేదా సోషలిస్టు సమాజం లక్ష్యంగా పని చేస్తున్న పార్టీలేవైతే ఉన్నాయో వాటిని గుర్తించాలి. అవి చేస్తున్న ప్రయత్నాలు నిశితంగా పరిశీలించాలి. వాటితో కలిసి అడుగు ముందుకేయాలి. సూటిగా చెప్పాలంటే మనువాద మతోన్మాదం పెచ్చరిల్లుతున్న నేటి తరుణంలో లాలునీలాలు కలవాల్సిన అవసరం, కల్సి పోరాడాల్సిన అవసరం తక్షణం కన్పిస్తోంది. ఈ పని జరిగితే అంబేద్కర్ గారి లక్ష్యం దిశగా ఒక అడుగు వేసినట్లే కదా! వేల అడుగులు కూడా ప్రారంభమయ్యేది ఆ ఒక్క అడుగుతోనే కదా?

LikeReply2 mins