------------- రాజ్యాంగం రాసుకున్న 60 ఏళ్ల తరువాత తితిదే వేద పాఠశాలలో దళితులకు స్థానం కల్పించారు. ఈ చిన్న మార్పును చూపెట్టి కమ్యూనిస్టులింకా అగ్రకుల పాటలు పాడుతున్నారంటూ , అసలు కులాలే లేవంటూ ప్రచారం జరుగుతోంది. తితిదేలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. దళిత గోవిందం ఎందుకో తెలుసుకోవాల్సి ఉంది. కమ్యూనిస్టుల అగ్రకుల పాటలు జనానికి నచ్చట్లేవు. పాడుకోవట్లేదు. కరెక్టే... ఎందుకంటే అవి వారికి అర్థం కావట్లేదు. అర్థం అయ్యేట్లుగానూ, జనరంజకంగానూ ఆ పాటలుండాలి. తాజా టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సి ఉంది.. ఈ మార్పులు మనం ఆశించవచ్చేమో!
Hi I am Jagadish kumar, Lives in Hyderabad. This Blog represent my views in various discussions.. MY FB ID https://www.facebook.com/jagadish.praja.. I will meet you in my comment box.
Sunday, 18 January 2015
Saturday, 17 January 2015
విద్యార్థికి రాజకీయాలు అవసరం లేదా? 18 ఏళ్లు నిండినాక ఓటు ఎట్లెయ్యాలె? ఎవరికెయ్యాలె? ఆ సంగతి ఎప్పటి నుంచి తెల్వాలె?
ఉద్యమాలు, రాజకీయాలు బొంగు అంటే విద్యార్థులకు ఫ్యూచరుండదు. సప్పుడ్దాక సదువుకుంటే కాంపిటీషన్ వరల్డ్ లో నెగ్గుకొస్తరు. ర్యాంకులు కొడతరు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తరు. తల్లి దండ్రులను బాగ చూసుకుంటరు. గప్పుడే దేశం బాగు పడ్తది... అనే వాళ్లు చాలా మందే ఉన్నారు. నిజమే విద్యార్థులు సదువుకోవాలే.. కానీ సదువు`కొనే` పోటీలో సదువే లేకుండా పోతున్నది కదా? దీని గురించి ఆలోచించొద్దా.. దీని సంగతెందో తేల్చొద్దా? అయ్యా.... పిల్లలు ఈ రోజు నుంచి రాజకీయాలు తెల్సుకోకపోతే ఓటేసే ఏజెచ్చొన తరువాత రాజకీయ నిర్ణయం ఎట్ల చేస్తరు. పరిపక్వత ఎప్పుడొస్తది? ఎక్కడ్నుంచి ప్రారంభం కావాలే...? ఆ పరిపక్వత లేకపోతే సమాజానికి పనికొచ్చేట్లు విద్యార్థి తనను తాను మార్చుకుంటడా?
![]() |
| జెఎన్ యు విద్యార్థి ఎన్నికల్లో గెలిచిన ఎస్ ఎఫ్ ఐ నాయకులు (ఫైల్ ఫొటో) |
ఒక విద్యార్ధి సమాజానికి పనికి వచ్చేలా తన జీవితాన్ని ఎలా మలచుకోగలడు ..
మేధావులారా, మార్గం చూపించగలరా...
మేధావులారా, మార్గం చూపించగలరా...
Subscribe to:
Posts (Atom)


